ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి హతం
Publish Date:Mar 3, 2026
Advertisement
ఇరాన్ ప్రభుత్వంలోని కీలక నేతలను ఇజ్రాయెల్ వరుసగా హతం చేస్తుంది. ఐడీఎఫ్ దాడుల్లో ఇరాన్ రక్షణ కొత్త మంత్రి మజీద్ ఇబెన్ అల్-రెజా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. మంత్రిగా నిన్ననే బాధ్యతలు స్వీకరించడం గమనార్హం..ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్‌జాదే మృతిచెందిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో తాత్కాలిక రక్షణ మంత్రిగా మజీద్‌ను నియమించింది. రక్షణ మంత్రి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే నూతన రక్షణ మంత్రి మృతిచెందడంతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. సోమవారం బాధ్యతలు స్వీకరించిన మజీద్ ఇబెన్ అల్-రెజా మృతిచెందడంపై ఇరాన్ రక్షణ వర్గాల్లో కలకలం రేగుతోంది. దాడులు ఎక్కడ జరిగాయి? ఆయుధాలను ఉపయోగించారా అనే విషయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతిని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.
http://www.teluguone.com/news/content/irans-new-defense-minister-dies-36-214944.html





