ఇన్‌స్టాలో పరిచయం... ఇన్‌స్టంట్ ప్రేమ... చివరకు లైంగిక దాడి..!

Publish Date:Jul 26, 2026

Advertisement

 

 ఇటీవల హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన 'రిచ్ కిడ్' కేసు మరువకముందే..అలాంటి తరహాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికలు, యువతులతో పరిచయం పెంచుకుని... కొద్ది రోజుల్లోనే ప్రేమ పేరుతో దగ్గరవడం... పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించడం... అనంతరం లైంగికంగా దోపిడీ చేసి... చివరకు వారిని మోసం చేసి పరారవడం ఇది నిందితుడి నేర శైలి...పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పవన్ అలియాస్ తరుణ్ కోసం పోలీసులు మూడు నెలలుగా గాలింపు చేపట్టారు. 

చివరకు అతడు సోషల్ మీడియాలో చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. సాంకేతిక ఆధారాలతో అతని కదలికలను గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు మరింత సంచలనంగా ఉన్నాయి. నిందితుడిపై ఇప్పటికే ఆరు నెలల వ్యవధిలో రెండు పోక్సో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు, ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారాలు కొనసాగించినట్లు, మరో యువతి ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. పవన్ సోషల్ మీడియానే తన వేటకు వేదికగా మార్చుకున్నాడు. 

ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం... ఆ తర్వాత ప్రేమ పేరుతో భావోద్వేగాలకు దగ్గరవడం... నమ్మకం పెంచుకుని వ్యక్తిగతంగా కలవడం... చివరకు లైంగిక దాడికి పాల్పడటం... అనంతరం ఫోన్ నంబర్లు మార్చి, సోషల్ మీడియా అకౌంట్లను నిలిపివేసి పరారవడం అతని విధానంగా గుర్తించారు. ఇది మాత్రమే కాకుండా, పవన్‌పై చోరీలు, స్నాచింగ్ వంటి పలు క్రిమినల్ కేసులు కూడా నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 

దీంతో అతని నేరచరిత్రపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, ఇదే తరహాలో మరికొందరు బాధితులు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన 'రిచ్ కిడ్' కేసు తరహాలోనే ఈ ఘటన లోనూ సోషల్ మీడియాను ఉచ్చుగా మార్చుకుని యువతులను లక్ష్యంగా చేసుకున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాధితుల ఫిర్యాదులు, డిజిటల్ ఆధారాలు, నిందితుడి కాల్ డేటా, సోషల్ మీడియా కార్యకలాపాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Insta cheating, Instagram Love, Banjara Hills Police, Social media, Pawan, Tarun, Rich Kid case, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand
 

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు.
కేంద్ర విద్యాశాఖలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ.. !
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా అడిగి తెలుసుకున్నారు.
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సరిహద్దుల భద్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
కూకట్‌పల్లిలో టిప్పర్ ఢీకొని యువకుల దుర్మరణం..!
రాజకీయ ప్రవేశంపై కాక్రోచ్ జనతా పార్టీ క్లారిటీ..!
నల్గొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు వద్ద ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది.
ధరణి పోర్టల్‌లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలు, సాంకేతిక లోపాలు, ప్రభుత్వానికి జరిగిన రెవెన్యూ నష్టంపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.