Top Stories

political-news-img

బొల్లారంలో దారుణం...మహిళ గొంతు కోసి హత్య, భర్తపై కత్తితో దాడి

సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో మహిళ మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం బీహార్‌కు చెందిన అనిల్ కుమార్, మీనా దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి బొల్లారం పారిశ్రామికవాడలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులు ఈరోజు ఉదయం సంతకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఐడీఏ క్రీడా ప్రాంగణం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు. ఈ క్రమంలో మీనాతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించగా, భర్త అనిల్ కుమార్ అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో దుండగులు అనిల్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. అనంతరం మీనా గొంతు కోసి అత్యంత దారు ణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న అనిల్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న బొల్లారం పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అలాగే ఉండటంతో ఇది దోపిడీ హత్య కాదని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అలాగే లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కూడా లభించలేదని వెల్లడించారు. హత్య వెనుక అసలు కారణాలను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Publish Date: May 31, 2026 10:31AM

political-news-img

తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ : రామ్మోహన్ నాయుడు

లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు.. వర్చువల్ గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, శ్రీధర్ సాతులూరి, వంశీ గరికపాటి, విష్ణు యలమంచి, ప్రతాప్ మెతరమిట్ట, సురేష్ అయినంపూడి, సురేష్ అంబటి, చందు గుత్తికొండ, శ్రీకాంత్ అత్తోటి, కిషోర్ గరికపాటి, వెంకట్ సుంకర, నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జూమ్ ద్వారా హాజరయ్యారు. సుమారు 150 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు పాల్గొని ఎన్టీఆర్ గారి సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా మహానాడు తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, అలాగే పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. అన్న ఎన్టీఆర్ గారి జయంతిని పురస్క రించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, తెలుగు జాతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Publish Date: May 31, 2026 10:07AM

political-news-img

కిడ్నీ వ్యాధుల నుండి విముక్తి: డయాలసిస్ అవసరం లేకుండా సహజ సిద్ధమైన మార్గాలు!

మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం, సూదుల నొప్పిని భరించడం ఎంత నరకంలా ఉంటుందో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. మీరు లేదా మీ ప్రియమైన వారు ఈ పరిస్థితుల్లో ఉన్నారా? కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని డాక్టర్లు చెప్పారా? అయితే ఆందోళన చెందకండి. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలతో, ఆహారపు అలవాట్లలో మార్పులతో మీ కిడ్నీలను మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Dr. Srinivas Gupta గారు ఈ VIDEO లో వివరించారు. కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రకృతి చిట్కాలు మన ఇంటి పరిసరాల్లో దొరికే మొక్కలే మనకు గొప్ప డాక్టర్లు. వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో వాడబడుతున్న చిట్కాలు కిడ్నీ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను చూపుతున్నాయి. వేపాకు మరియు రావి ఆకు కషాయం: ఐదు వేపాకులు మరియు మూడు రావి ఆకులను తీసుకుని, 100 ml నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు 50 ml అయ్యే వరకు మరిగించి, ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల క్రియాటినిన్ (Creatinine) మరియు యూరియా స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని వేల మంది పేషెంట్లలో గమనించడం జరిగింది. మొక్కజొన్న పొత్తు జుట్టు (Corn Silk): మనం సాధారణంగా పడేసే మొక్కజొన్న పొత్తు జుట్టు కిడ్నీలకు ఒక వరం. దీనిని నీటిలో మరిగించి టీ లాగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి పసుపు టీ: పచ్చి పసుపు, అల్లం మరియు కరివేపాకులను నలిపి నీటిలో మరిగించి ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఆహారమే అతిపెద్ద మందు కిడ్నీ పేషెంట్లు రైస్ లేదా గోధుమ రొట్టెలకు బదులుగా బార్లీ (Barley) ని వాడటం శ్రేయస్కరం. బార్లీ ఒక నేచురల్ డయూరెటిక్ (diuretic) లాగా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. కూరగాయల ఎంపిక: మీ మధ్యాహ్న భోజనంలో పొట్లకాయ (సొరకాయ) మరియు రాత్రి భోజనంలో బీరకాయను ఎక్కువగా చేర్చుకోవాలి. ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం చాలా ముఖ్యం. గ్రీన్ జ్యూసెస్: కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మరియు గ్రీన్ ఆపిల్‌తో చేసిన జ్యూస్ శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి (Detox) సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్: రక్తపోటును (BP) నియంత్రించడంలో మరియు కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక అమృతంలా పనిచేస్తుంది. ఆధునిక చికిత్స మరియు జీవనశైలి మార్పులు కేవలం ఆహారం మాత్రమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లలో అందించే కిడ్నీ ప్యాక్, కిడ్నీ మసాజ్ మరియు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ వంటి బాహ్య చికిత్సలు కిడ్నీలను మళ్ళీ ఉత్తేజితం చేస్తాయి. అలాగే, చెప్పులు లేకుండా నేల మీద నడవడం (Earthing) వల్ల శరీరం ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు హెచ్చరికలు: యూరిన్ వెళ్ళినప్పుడు బాగా నురుగు వస్తుంటే, అది ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు ప్రాథమిక సూచన. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న 1: క్రియాటినిన్ స్థాయిలను సహజంగా తగ్గించవచ్చా? సమాధానం: అవును, వేపాకు మరియు రావి ఆకు కషాయం తీసుకోవడం, బార్లీ ఆహారంలో చేర్చుకోవడం మరియు కిడ్నీలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు. ప్రశ్న 2: డయాలసిస్ స్టేజ్ లో ఉన్నవారు కూడా ఈ చికిత్సలు ఫాలో అవ్వచ్చా? సమాధానం: తప్పకుండా. ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టేజ్ లో ఉన్నవారు కూడా సరైన డైట్ మరియు నాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా తమ క్రియాటినిన్ స్థాయిలను తగ్గించుకుని సాధారణ స్థితికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రశ్న 3: కిడ్నీ పేషెంట్లు ఎలాంటి కూరగాయలు తినాలి? సమాధానం: సొరకాయ మరియు బీరకాయ కిడ్నీలకు చాలా మంచివి. కూరగాయలను వాడే ముందు వాటిని బాయిల్ చేసి ఆ నీటిని పారబోయడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి, ఇది కిడ్నీ పేషెంట్లకు ముఖ్యం. కిడ్నీ సమస్య అనగానే భయపడిపోయి డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్ళే ముందు, ఒకసారి మన ప్రకృతి అందించే చికిత్సలను నమ్మండి. క్రమశిక్షణతో కూడిన ఆహారం మరియు సరైన వ్యాయామంతో కిడ్నీలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు. మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313 USA : +1(732)947-4166 మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు కిడ్నీ వ్యాధులపై పూర్తి అవగాహన కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ TeluguOne Health ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి! మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే!

Publish Date: May 30, 2026 6:24PM

political-news-img

తెలంగాణ అవతరణ వేడుకల సమయాల్లో మార్పు.. సీఎం కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణ సమయాల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2వ తేదీన నిర్వహించ తలపెట్టిన అధికారిక ఉత్సవాల సమయాన్ని కుదిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలకు జనం అల్లాడిపోతుండటంతో, ఎండ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఈ అడుగు వేశారు. సికింద్రాబాద్ లోని ప్రతిష్టాత్మక పరేడ్ మైదానంలో జరగనున్న ఈ వేడుకలను ఉదయం పూటనే ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. ఎండలు ముదరక ముందే, అంటే ఉదయం 8:30 గంటలకే ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించేలా సన్నాహాలు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సారి నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ కేవలం గంటన్నర వ్యవధిలోనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు అన్ని రకాల అధికారిక కార్యక్రమాలను ఉదయం 10 గంటల కల్లా ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వేడుకలకు విచ్చేసే వీఐపీలు, ఆహ్వానితులు, విద్యార్థులు అలాగే సాధారణ ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సభా ప్రాంగణంలో తగిన నీడ, తాగునీటి సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వేడుకల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమయాల మార్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండుటెండల్లో కార్యక్రమాలు సుదీర్ఘంగా సాగడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని, ఈసారి గంటన్నరలోనే ముగించడం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. జూన్ 2న జరిగే ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు వీలుగా సచివాలయంలో ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎండల తీవ్రతను తట్టుకునేలా పరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసే యోచనలో యంత్రాంగం ఉంది. ఈ మార్పుల నేపథ్యంలో అధికారులు నూతన షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లను వేగవంతం చేశారు.

Publish Date: May 30, 2026 6:05PM

political-news-img

సైబర్ క్రైమ్ బ్యూరోలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో ఉన్న సైబర్ క్రైమ్ బ్యూరో కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ బ్యూరోకు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మహేందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాల ప్రకారం, ఓ కేసుకు సంబంధించిన వ్యవహారంలో బాధితుల నుంచి రూ.2 లక్షలు లంచంగా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని సీఐ మహేందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయన వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.ఈ ఘటనతో సైబర్ క్రైమ్ బ్యూరోలో కలకలం రేగింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తుండగా, మహేందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.ఈ ఘటనపై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

Publish Date: May 30, 2026 5:54PM

political-news-img

వివేకా హత్యపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గొడ్డలి పార్టీ అని ప్రజల్లోకి వెళ్లే కొద్ది సైకోలో ఫ్రస్ట్రేషన్‌ పెరుగుతోంది... వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు వివేకా కుమార్తె సునీతకు ఉందన్నారు. ఆమె పోరాటం కారణంగానే ఇప్పటికీ వివేకా హత్య కేసు సజీవంగా ఉందన్నారు. సునీత పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి పలు కీలక అంశాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. జగన్ కుటుంబ చరిత్ర, హత్యా రాజకీయాల గురించి ప్రస్తుత తరానికి తెలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వైఎస్ కుటుంబం అరాచకాల గురించి తనకు కూడా కొన్ని విషయాలు తెలియవని.. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన 'కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం' పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారని తెలిపారు. సైకో కంటే 'గొడ్డలి పార్టీ' అనే పేరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. గొడ్డలి పార్టీ అనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లే కొద్దీ జగన్‌లో అసహనం పెరుగుతోందని ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలు చేసిన వారు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు కానీ, బాధితులు మాత్రం జిల్లా రాజకీయాలు చేయకూడదా? అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నక్సలైట్లు తుపాకులతో రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారని.. అలాగే గొడ్డలి పార్టీతో వీళ్లు రాజకీయాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యానికి వీళ్లు ఎలా సరిపోతారంటూ వైసీపీ, జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చంద్రబాబు మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు. మహిళా రిజర్వేషన్లను అన్ని పార్టీలు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మొదటి నుంచీ మహిళలకు టీడీపీ అండగా ఉందని సీఎం చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ విషయంలో 2011 జనాభా లెక్కలైనా, తాజా లెక్కలైనా మనకు నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే ఉన్న స్థానాలను 50 శాతం పెంచితే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. పెంచిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారి ఆలోచన కూడా మారవచ్చని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. రెండు బిల్లులను తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోందని, ఆ రెండింటినీ విడదీసి చూడాల్సిన అవసరం ఏముందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రెండు బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులు తప్పనిసరిగా తీసుకురావాలని, ఇవి దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Publish Date: May 30, 2026 5:49PM

MOVIE NEWS