గ్రామ పెద్దల అమానుషం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను ఎలా శిక్షించారంటే..?
Publish Date:Jul 12, 2025
Advertisement
ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలూ అంగీకరించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసినా కూడా ఆచారం పేరిట గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఒడిశాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. పెద్దల అంగీకారంతో ప్రేమపెళ్లి చేసుకున్న ఓ జంట ఏదో చేయకూడని ఘోర అపరాధం చేసిందన్నట్లుగా గ్రామ పెద్దలు అమానుష శిక్ష విధించారు. ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ప్రేమపెళ్లి గ్రామ ఆచారం ప్రకారం పెద్ద తప్పు అంటూ కంజమజ్జిరా గ్రామ పెద్దలు ఆ జంటకు దారుణమైన శిక్ష విధించారు. ఆ జంటను నాగలికి ఎద్దుల్లాగా కట్టి, కర్రలతో కొడుతూ పొలం దున్నించారు. ఆ తరువాత పాపపరిహారం అంటూ ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేయించి చిత్రహింసలకు గురి చేశారు. పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు ఇంతటి అమానుష శిక్ష విధించిన గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/inhuman-punishment-to-couple-39-201835.html





