సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నో

Publish Date:Oct 16, 2025

Advertisement

కర్నాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ వ్వవస్థాపకుడు నారాయణ మూర్తి నిరాకరించారు. ఆయనతో పపాటు ఆయన సతీమణి, రచయిత్రి, సామాజిక ఉద్యమ కారిణి సుధామూర్తి కూడా ఈ సర్వేలో పాల్గొనేది లేదని కుండబద్దలు కొట్టారు. తాము ఏ వెనుకబడిన వర్గానికీ చెందిన వారం కాదనీ, అందుకే ఈ సర్వే వల్ల ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదనీ పేర్కొన్న వారు అందుకే సర్వే కోసం తమ ఇంటికి వచ్చిన అధికారులకు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చి మరీ తమ అనంగీకారాన్ని తెలిపారు. సర్వే ఫారంపై కూడా వారీ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.  

ఇలా ఉండగా ఈ సర్వే ప్రారంభమైన తొలి వారంలోనే పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సర్వేలో పాల్గొనాలని అధికారులు, ఉపాధ్యాయులు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.   సర్వేలో పాల్గొనబోనని చెప్పినా పర్వే చేయడానికి వచ్చిన వ్యక్తి బెదరింపులకు దిగుతున్నారని పలువురు ఆరోపణలు గుప్పించారు. అన్నిటికీ మించి సర్వే పట్ల ప్రజల విముఖతకు ప్రధాన కారణంగా   ప్రశ్నలు చాలా ఎక్కువగా, విసుగు తెప్పించేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి డీకేశివకుమార్ కూడా సర్వే కోసం ఉద్దేశిచిన ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉందనీ, విసుగుతెప్పించేవిగా ఉన్నాయనీ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా.. ప్రశ్నల సంఖ్యను తగ్గించి, సర్వే ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.  

నగరాల్లో నివశించే ప్రజలకు అన్నేసి ప్రశ్నలకు అంతంత సేపు సమాధానం చెప్పే ఓపిక, తీరిక ఉండదని డీకే అన్నారు.  ఇక ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు సర్వేలో పాల్గొనడానికి   నిరాకరించడం పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమన్న డీకే శివకుమార్  సర్వేలో పాల్గొని తీరాలని తాము ఎవరిపైనా ఒత్తిడి తేబోమని స్పష్టం చేశారు.   రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85.89 శాతం సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతున్నా, గ్రేటర్ బెంగళూరు పరిధిలో మాత్రం కేవలం 19.62 శాతమే పూర్తి కావడం గమనార్హం. ఇది నగరంలో సర్వే ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతోంది.

By
en-us Political News

  
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రీప్లే చేయాలంటూ అర్జెంటీనా అభిమానులు ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో పిటిషన్ ప్రారంభించారు. ఇప్పటికే 61,500 మందికి పైగా సంతకాలు చేసిన ఈ వివాదంలో ఫిఫా నిబంధనలు ఏం చెబుతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తండ్రి తన తండ్రి నుంచి పొందిన ఆస్తిపై పిల్లలకు పుట్టుకతోనే హక్కు ఉంటుందా స్వయంకార్జిత ఆస్తులు, పిత్రార్జిత ఆస్తుల మధ్య తేడాలను వివరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ ఇంజనీర్ FDE ఉద్యోగాల డిమాండ్, రూ. 1.4 కోట్ల భారీ జీతాల ప్యాకేజీలు మరియు AI అమలులో వీటి ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించగా, మయాంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పూర్తి మ్యాచ్ వివరాలు ఇక్కడ చూడండి.
126 పరుగుల సునాయాస విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా ఆరంభంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఆ ఆనందం జింబాబ్వేకు ఇసుమంతైనా దక్కనీయకుండా.. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశి తన బ్యాట్ తో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు.
మన్యం ప్రాంతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు కలిసి పర్యటిస్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు పర్యటించే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
రాజధాని అమరావతిలో సాంకేతిక మౌలిక వసతులను కల్పించడం, ఆర్థిక సేవల రంగాన్ని ఆధునీకరించడం, డిజిటల్ లావాదేవీలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంక్ అమరావతిలో ఇటువంటి అధునాతన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఏపీ పారిశ్రామిక, సాంకేతిక పురోగతికి ఎంతగానో దోహదం చేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.