Publish Date:Nov 18, 2012
అహ్మదాబాదులో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 123 పరుగుల వద్ద కామ్టన్ జహీర్ ఖాన్ బౌలింగులో అవుట్ కాగా, ఓజా బౌలింగ్‌లో పీటర్సన్, ట్రాట్ వెనుదిరిగారు. ఉమేష్ యాదవ్ రెండు వరుస బంతుల్లో ఇయాన్ బెల్, సమిత్ పటేల్‌ను ఔట్ చేశాడు.
నాల్గో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ వికెట్‌ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆల్ ఔట్ అయిన ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ఆడుతోంది. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా కుక్ ఒంటరి పోరాటంతో సెంచరీ చేశాడు. కామ్టన్ 37, ట్రాట్ 17, పీటర్సన్ 2, ఇయాన్ బెల్ 22 పరుగులు చేసి అవుటయ్యారు. సుమిత్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 230పరుగులతో ఆడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-vs-england-2012-36-19184.html
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి పథకాలు యువ పారిశ్రామిక వేత్తలకు గొప్ప అవకాశాలకు రాచబాట పరుస్తున్నాయి. నేడు భారత్ లో 1. 25 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్స్ ఉన్నాయి. ఇందులో సగానికి పైగా టూ టైర్ 2, 3 పట్టణాల నుంచి మొదలైనవి కావడం విశేషం.
ఈ ట్రయల్ లో భాగంగా ప్రజల ఫోన్లకు శనివారం అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్‌తో రావచ్చని తెలిపింది.
దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి. బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి.
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. లంక ఆటగాడు పాతుమ్ నిస్సంక ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న నిస్సంక పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.