2023 నాటికి చైనాను మించనున్న భారత్ జనాభా.. యు.ఎన్
Publish Date:Jul 11, 2022
Advertisement
భారత దేశ జనాభా వచ్చే ఏటికి చైనాను మించి అత్యధిక జనాభాగల దేశంగా నిలిచే అవకాశాలున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరవచ్చని ఆ నివేదిక పేర్కొన్నది. 1950 నుంచి గమనిస్తే ప్రపంచ జనాభా పెరుగుదల రేటు తక్కువగానే వుంది, 2020 లో ఒక్క శాతానికి పడిపోయిందని నివేదిక తెలియజేసింది. జనాభా పెరుగుదల అంశాన్ని ప్రస్థావిస్తూ, 2030లో ప్రపంచ జనాభా సుమారు 8.5 బిలియన్‌మేరకు పెరగ వచ్చని, అదే 2050లో 9.7 బిలియన్లకు పెరగవచ్చని యు.ఎన్. నివేదిక పేర్కొన్నది. అలాగే, 2080 నాటికి ఈ పెరుగుదల 10.4 బిలియన్లకు చేరుకుని 2100 వరకూ నిలకడగా వుండవచ్చని సూచించింది. ఈ సంవ త్సరం ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) ఒక మైలురాయి సంవత్సరంలో వచ్చింది, భూమి పై ఎని మిది బిలియన్ల మంది జననాన్ని వూహించినట్టు యు.ఎన్. సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్ తెలి పారు. ఇది మన వైవిధ్యాన్ని, మన ఉమ్మడి మానవత్వాన్ని గుర్తించడానికి , ఆయుర్దాయం పొడిగించిన మాతా , శిశు మరణాల రేటును నాటకీయంగా తగ్గించిన ఆరోగ్యంలో పురోగతిని చూసి ఆశ్చర్యపోవడానికి ఒక సందర్భమని ఆయన అన్నారు. అలాగే, మన భూమి గురించిన జాగ్రత్తలు తీసుకోవడంలో బాధ్యత లను పంచుకోవడం గుర్తుచేస్తుందని, అంతేగాక మన నిబద్ధతలో పొరపాట్లను తెలుసుకోవడానికి ఇది సరయిన సమయమని ఆయన అన్నారు. అంతేగాక, 2022లో అత్యధికంగా 2.3 బిలియన్ జనాభా కలిగిన ప్రాంతాలుగా తూర్పు, ఈశాన్య ఆసియా ప్రాంతాలు వున్నాయి. అంటే ప్రపంచ జనాభాలో 29 శాతం ఈ ప్రాంతాల్లో వున్నది. సెంట్రల్, దక్షిణా సియా 2.1 బిలియన్ జనాభాతో అంటే ప్రపంచ జనాభాలో 26 శాతం జనాభా వున్నారని యు.ఎన్. నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో చైనా, భారత్ అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. రెండు దేశాల్లోనూ 2022లో 1.4 బిలియన్ జనాభా నమోదయింది. 2050 నాటికి ప్రపంచ జనాభా ప్రస్తుతం వున్న జనాభాకంటే సగం ఎక్కువ పెరగవచ్చని, అది కూడా కాంగో, ఈజిప్టు, ఇథోపియా, భారత్, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పైన్స్, టాంజానియాలలో ప్రధానంగా జరగవచ్చని నివేదిక తెలియజేసింది.
http://www.teluguone.com/news/content/india-likely-to-surpass-china-population--25-139467.html





