Publish Date:Jan 12, 2013
రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే లో ఇండియా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి నష్టానికి 316 పరుగులు చేసింది. 326 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కి దీగిన భారత్ ఓపెనింగ్ జోడి చాల రోజుల తరువాత మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అజింక్యా రహనే 47 పరుగులు చేయగా, ఆ తర్వాత గంభీర్ 52 పరుగులు చేసి అవుటయ్యాడు.యువరాజ్ సింగ్, సురేష్ రైనా, గంభీర్ అర్థ సెంచరీలు చేసినా ఇండియాను గెలిపించలేకపోయారు. ట్రెడ్‌వెల్ నాలుగు వికెట్లు తీసి భారత్ దెబ్బ కొట్టాడు. భారత్ ఓడిన చివరి వరకు పోరాడింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, ఇయాన్ బెల్ ఇండియా బౌలర్లను ఆటాడుకున్నారు. మొదటి వికెట్ కి వీరిద్దరూ 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇయాన్ బెల్ (85) పరుగులు చేయగా, అలిస్టర్ కుక్ (75) పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆతరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇయాన్ మోర్గాన్, పీటర్సన్‌లు బాగా ఆడినప్పటికీ అర్ధసెంచరీలలు చేయలేక పోయారు.మోర్గాన్(41), పీటర్సన్(44) పరుగులు చేసి అవుటయ్యారు. అనతరం బ్యాటింగ్ కు దీగిన పటేల్, క్రెయిగ్ కీష్టెట్టర్ ఇండియా బౌలర్లను అదరగొట్టారు. పటేల్ 20 బంతుల్లో 44 పరుగులు చేశారు. క్రెయిగ్ కీష్టెట్టర్ 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india`s-woes-continue-as-they-lose-by-nine-runs-in-1st-odi-36-20361.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.