అరసవల్లిలో మంగ్లికి అనుచిత ప్రాధాన్యం.. కూటమి క్యాడర్ లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం

Publish Date:Feb 5, 2025

Advertisement

జగన్ హయాంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది.  వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌లో అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు హ‌ద్దే లేకుండా పోయింది. ఆ పార్టీ నేత‌లు అందినకాడికి ప్ర‌భుత్వ భూముల‌తోపాటు అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జాలు చేసేశారు. మ‌రికొన్ని భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వారి అనుకూల ట్ర‌స్టుల‌కు, కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తే.. జ‌గ‌న్ మాత్రం త‌న హ‌యాంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగాపెట్టుకొని పాల‌న‌ను గాలికొదిలేశాడు. దీంతో వైసీపీ హ‌యాంలో రాష్ట్రం క‌నీస‌ అభివృద్ధికి నోచుకోక‌పోవ‌డంతో దేశంలోనే ఏపీ అట్ట‌డుగు స్థాయికి వెళ్లిపోయింది.

అదలా ఉంటే.. జగన్ విధానాలను వ్యతిరేకించిన వారినీ, తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులకు కొదవే లేదు. నిజం జగన్ అధికారం వెలగబెట్టిన ఐదేళ్లూ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలపై వేధింపులతో చెలరేగిపోయారు. ఆయన అండ చూసుకుని ఆ పార్టీ నేతలూ, అభిమానులుగా చెప్పుకున్న వారూ కూడా చెలరేగిపోయారు. 

సరే జనం జగన్ పాలనను నిర్ద్వంద్వంగా తిరస్కరించి, గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీకి ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా ఆ పార్టీ తగదని తమ తీర్పు ద్వారా తేల్చి చెప్పారు. ఘన విజయం సాధించిన తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది.  వైసీపీ హయాంలో మంచీ చెడూ విచక్షణ లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలూ, వారి అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలూ అధికారులపై తెలుగుదేశం కూటమి సర్కార్ కొరడా ఝుళిపిస్తుందనీ, వారిని చట్టంముందు నిలబెట్టి శిక్షిస్తుందనీ ఆశించిన తెలుగుదేశం, జనసేన క్యాడర్ లో ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా కూడా   జగన్ హయాంలో అక్రమాలు, సోషల్ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోయిన ఆ పార్టీ యాక్టివిస్టులను చూసీ చూడనట్లు వదిలేస్తుండటమే ఇందుకు కారణం. అంతే కాదు వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించిన వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ రాజచమర్యాదలు పొందుతుడటంతో క్యాడర్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

 వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజాకు తిరుమలలో ప్రొటోకాల్ దర్శనం లభించడం.. తాజాగా రథ సప్తమి నాడు అరసవల్లిలో గాయని మంగ్లీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా ప్రొటో కాల్ దర్శనానికి అనుమతించడంతో తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతోంది.

వైపీపీ హయాంలో సింగర్ మంగ్లి టీటీడీలో పదవి అనుభవించిన సంగతి తెలిసిందే. అటువంటి మంగ్లి తాజాగా అరసవెల్లి రథ సప్తమి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి వీఐపీ ప్రొటో కాల్ దర్శనం చేసుకోవడం.. మంత్రి పక్కనే నిలబడి మీడియాతో  మాట్లాడటం  తెలుగుదేశం కార్యక ర్తలకు మింగుడు పడటం లేదు.  టీడీపీకి వ్యతిరేకంగా, వైసీపీకి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మంగ్లికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంత ప్రాధాన్యాన్నీ, గౌరవ మర్యాదలనూ ఇవ్వడమేంటంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ప్రత్యర్థుల పట్ల అవసరం లేని మెతకతనం చూపుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు మంగ్లీ విషయంలో కార్యకర్తల ఆగ్రహం ఒకింత ఇబ్బందికరమే అనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో పెడితే ఊరుకోబోమని సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హెచ్చరించారు. ఎవరైనా అధికారులు ఆయన ఫోటో పెడితే నడిరోడ్డుపై పగలగొడతామని హెచ్చరించారు.
తెలుగు ఇండస్ట్రీలో ఆ నాలుగురు ఆ నాలుగురు అంటున్నారు. కానీ ఆ నలుగురిలో లేనని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల అవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సాహసం అని విమర్శించారు.
ఆపరేషన్‌ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది.
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌‌ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. అదేవిధంగా ఫ్యామిలీ నుంచి కూడా అతడిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌‌ను ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌‌లో కలిశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ దాని పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
రాష్ట్ర నీటి అవ‌స‌రాలు కాపాడ‌టంలో ఈ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది.. గోదావ‌రి – బ‌న‌కచ‌ర్ల ప్రాజెక్టు వ‌ల్ల తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దంపతులు పుష్కర పుణ్య స్నానం ఆచరించారు. గవర్నర్‌ దంపతులకు మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ సతీసమేతంగా ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు
మిస్ ఇంగ్లండ్ మ్యాగీ వ్య‌వ‌హార శైలి కాస్త అనుమానాస్ప‌దంగానే ఉందంటున్నారు. బేసిగ్గా స్విమ్మ‌ర్ అయిన మ్యాగీ త‌న త‌ల్లి నుంచి, స్విమ్మింగ్ నుంచి ఏమి నేర్చుకుందోగానీ కొన్నికొన్ని విష‌యాల్లో ఆమెను తీవ్రంగా అనుమానించాల్సి వ‌స్తోంద‌ని అంటారు కొంద‌రు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చాలా విష‌యాల‌పై సిట్ ఇంకా పూర్తిగా దృష్టిసారించ‌లేదని ఆయ‌న పేర్కొన్నారు. సిట్ పిలిస్తే తాను వెళ్లి మద్యం కుంభకోణంలో బ‌య‌ట‌కు రాని విష‌యాలు వెల్ల‌డిస్తాని ఆయన అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విజయ్‌ కుమార్‌ అనే కానిస్టేబుల్‌ మృతిచెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశం చేశారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం గ్రామ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో చంద్రబాబు కొత్తగా ఇల్లు నిర్మించుకున్న సంగతి విదితమే.
వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకా క‌డ‌ప‌లో తొలిసారి నిర్వ‌హిస్తున్న మహానాడుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలిరానున్నాయి. అయితే వైసీపీ మాత్రం మహానాడుపై కుట్రల పర్వానికి తెరతీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.