Publish Date:Dec 28, 2025
ఏపీలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గెజిట్ విడుదల చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన అధికారుల్లో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో భాగంగా జరిగే సాధారణ ప్రక్రియలోనే ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పదోన్నతి పొందినప్పటికీ కొందరు అధికారులు తమ ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి, అలాగే ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా ఆమ్రపాలి కాట తమ ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతారు.
డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌గా పునర్వ్యవస్థీకరించారు.
గంధం చంద్రుడికి కార్మిక శాఖ కమిషనర్‌గా కొత్త బాధ్యతలు అప్పగించగా, ఇప్పటివరకు ఆ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించగా, ఆయనకు సంబంధించిన పోస్టింగ్‌పై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్, కేడర్ సమానత్వం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ias-officers-promotion-andhra-pradesh-36-211677.html
ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు
కృష్ణా బేసిన్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదని శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక బయటకు వచ్చింది.
పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన బర్సీ దేవా, చదువు మధ్యలోనే ఆపి మావోయిస్టు ఉద్యమంలో చేరాడు.
డ్రగ్స్ వినియోగం కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ టిమీండియా జట్టును ప్రకటించింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శాసన సభలో ప్రకటించారు.
కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నివేదికలో వెల్లడించింది.
ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనిజులా వెల్లడించింది.
ఈ నిర్ణయంతో బీసీసీఐ బంగ్లాదేశ్ లో క్రికెట్ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంచితే.. ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా ప్లేయర్లపై నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఫలితం లేకపోవడంతో గ్రామ పెద్దలు, బంధువుల ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో విషయం తెలిసిన మౌనిక తన బండారం నలుగురికీ తెలిసిపోతుందన్న భయంతో భర్త హత్యకు పథకం పన్నింది.
రాంపల్లి, ఘట్‌కేసర్ ప్రధాన రహదారిపై సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్ షాప్‌కు శుక్రవారం సాయంత్రం సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. సాధారణ కొను గోలుదారుల మాదిరిగా షాప్‌లోకి ప్రవేశించిన వారు. కొద్దిసేపటికి ఒక్కసారిగా తమ వద్ద ఉన్న టాయ్ గన్ తో షాప్ యజమాని సందీప్ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు.