Publish Date:Aug 28, 2024
తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా పని మొదలెట్టేసింది. ఇప్పటికే నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సహా పలు అక్రమ కట్టడాలను కూల్చివేసింది. చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయన చెరువును ఆక్రమించి విద్యాసంస్థలు నిర్మించారంటూ నోటీసులు జారీ చేసింది.
మర్రి రాజశేఖరరెడ్డికి చెందిన ఎమ్ ఎల్ ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలను చిన్న దామెర చెరువు ను ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు మర్రిరాజశేఖరరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఆయనకు చెందిన విద్యాసంస్థల కూల్చివేతపై ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు. అయితే మరో వైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను అతిక్రమించి నిర్మించిన విద్యాసంస్థల విషయంలో వాటి యాజమాన్యాలకు కొంత సమయం ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. వాటిపై తక్షణ చర్యలు తీసుకోబోమని పేర్కొన్నారు.
విద్యాసంవత్సరం మధ్యలో ఉన్నందున అటువంటి విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేస్తామన్నారు. విద్యార్థులను తరలించిన తరువాత ఆ కట్టడాలను వారంతట వారే కూల్చి వేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలా జరగకపోతే అప్పుడు హైడ్రా రంగంలోకి దిగుతుందని రంగనాథ్ పేర్కొన్నారు. ఆ సందర్భంగా ఆయన మల్లారెడ్డి, ఒవైసీల పేరు ప్రస్తావించారు. నిబంధనలను అతిక్రమించి నిర్మించిన కట్టడాల విషయంలో మల్లారెడ్డి అయినా, ఒవైసీ అయినా హైడ్రా ఒకేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hydraa-notices-to-brs-mla-25-183761.html
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.