Publish Date:Aug 29, 2024
చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టానికి కళ్లు లేవు , చట్టానికి చుట్టాలు లేరు అనేవి సినిమాల్లో వినిపించే సర్వసాధారణ డైలాగ్స్. గత కొన్ని రోజులుగా హైడ్రా చేపడుతున్న కూల్చివేతల కార్యక్రమం కేవలం ప్రతిపక్ష నేతలను దృష్టిలో పెట్టుకుని కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. హైదరాబాద్ చెరువుల పరిరక్షణ కోసం చేపట్టిన కూల్చివేతల కార్యక్రమంలో తన కుటుంబసభ్యులు ఉన్నా ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ సందర్భం రానే వచ్చింది. దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టిన 204 ఇళ్లకు జీహెచ్ ఎంసీ నోటీసులు జారీ చేసింది. 204 ఇళ్లకు నోటీసులు రావడం పెద్ద వార్త కాదు . కానీ ఈ ఇళ్లలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇవ్వడం పెద్ద వార్త అయ్యింది. దుర్గం చెరువు పరివాహక ప్రాంత వాసులు భయంతో వణికి పోతున్నారు. మాదాపూర్, అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు రావడంతో వారి భయం మరింత పెరిగింది. ఈ సొసైటీ పలువురు సినీ రాజకీయ నేతలకు స్థలాలను గతంలో విక్రయించింది. వీరిలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూడా ఉన్నారు. సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయంతో రేవంత్ సర్కార్ మీద భరోసా పెరిగింది. కాంగ్రెస్ బద్ద శత్రువు అయిన బిజెపి కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ పార్టీ నేత రఘునందన్ రావు ప్రముఖ న్యాయవాది. హైడ్రా విషయంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తానని ఇంతకుమునుపే ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hydra-notices-to-residence-of-chief-minister-brother-tirupati-reddy-25-183842.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు