అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం.. కబ్జా కోరల నుంచి రూ. వంద కోట్ల స్థలానికి విముక్తి
Publish Date:Apr 1, 2026
Advertisement
హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపారు. పాతబస్తీ మైలార్దేవ్ పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి లోని మైలార్దేవ్పల్లి శాస్త్రిపురం కాలనీలో బుధవారం (ఏప్రిల్ 1) తెల్లవారుజా మున నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో నిర్మాణ దశలో ఉన్న ఐదు భవనాలను కూల్చివేశారు. దీంతో వంద కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా కోరల నుంచి కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. మైలార్దేవ్ పల్లి ప్రాంతంలో 188 ఎకరాల విస్తీర్ణంలో రూపొందించిన లేఔట్‌కు హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చింది. ఆ లేఔట్ ప్రకారం 1800కు పైగా ప్లాట్ల మధ్య 6500 గజాల విస్తీ ర్ణాన్ని ప్రత్యేకంగా క్రీడామైదానంగా కేటాయించారు. అయితే.. గత మూడు సంవత్సరాలుగా కొందరు కబ్జాదారులు నోటరీ ఆధారం గా ఈ స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తూ అక్రమ నిర్మా ణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు.ఈ విష యంపై ముందుగా జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసి, 2 కూల్చివేత చర్యలు చేపడతామని స్పీకింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చింది. అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. లేఔట్‌లో స్పష్టంగా క్రీడామైదానం కోసం కేటాయించిన స్థలంలోనే నిర్మాణాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. వెంటనే నిర్మాణాలు నిలిపివేయాలని హెచ్చరికలు జారీ చేసిన ప్పటికీ కబ్జాదారుల నుండి స్పందన లేకపోవ డంతో అధికారులు కూల్చి వేతలు చేపట్టారు. బుధవారం (ఏప్రిల్ 1) ఉదయం నిర్మాణ దశలో ఉన్న ఐదు భవనాలను పూర్తిగా కూల్చివేశారు. అదనంగా రెండు సింగిల్ రూమ్ నిర్మాణాలను కూడా తొలగించారు. ఇప్పటికే నివాసాలు ఉన్న మరో రెండు భవనాలను తాత్కా లికంగా మినహాయించినట్లు అధికారులు తెలిపారు. క్రీడామైదానం తిరిగి అందుబాటులోకి రావడంతో శాస్త్రిపురం కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/hydra-iron-fist-against-illegal-structures-36-216504.html





