హైదరాబాద్‌లో ఫైర్ సేఫ్టీపై హైడ్రా ఆకస్మిక తనిఖీలు

Publish Date:Jan 29, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై హైడ్రా దృష్టి సారించింది.  కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ప్రారంభించగా, నిబంధనలను లెక్కచేయకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న పలుచోట్ల షోరూమ్‌లు, వాణిజ్య భవనాలపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–36లోని నీరూస్ వస్త్రాల షోరూమ్‌ను హైడ్రా అధికారులు సీజ్ చేశారు. 

అనుమతులులేకుండా రూఫ్ షెడ్ నిర్మించడంతో పాటు, షోరూమ్‌ను గోదాములా మార్చి భారీగా వస్త్రాలను నిల్వ చేయడం అధికారుల దృష్టికి వచ్చింది. ఫైర్ ఎన్‌వోసీ లేకపోవడం, అగ్నిమాపక యంత్రంసరిగా లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలు గుర్తించడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. షోరూమ్ ప్రాంగణంలో “ఫైర్ అన్‌సేఫ్ షాప్” అనే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి, వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా షాపులను గోదాములుగా మార్చడంపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ భారీ ఫర్నీచర్ షోరూమ్‌ను కూడా అధికారులు సీజ్ చేశారు. ఆరు అంతస్తుల భవనంలో నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫర్నీచర్ నిల్వలు ఉండటం, మెట్ల మార్గాలను సైతం స్టాక్‌తో మూసివేయడం గుర్తించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలు పూర్తిగా అడ్డుపడేలా ఉండటంతో అధికారులు తీవ్రంగా  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ ఎన్‌వోసీ లేకపోవడం, అగ్నిమాపక యంత్రం అందు బాటులో లేకపోవడంతో షోరూమ్‌కు తాళం వేసి వ్యాపార లావాదేవీలను నిలిపివేయడమే కాకుండా విద్యుత్ సరఫరాను కూడా నిలిపేశారు. 

ఇటీవల ఇదే ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత కూడా నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో హైడ్రా, ఫైర్ సర్వీసెస్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ విభాగాల అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. నగరంలో ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఫైర్ నిబంధనల ఉల్లంఘ నలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేం దుకు హైడ్రా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 

హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667కు లేదా కమిషనర్‌కు నేరుగా 7207923085 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు పంపవచ్చని అధికారులు సూచించారు. అదేవిధంగా Commissioner_HYDRAA ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. షాపులు, షోరూమ్‌లను గోదాములుగా మార్చి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. నగరవ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతా యని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని వాణిజ్య సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్పష్టం వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
తనకు జరిగిన మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు  సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు   చేసి గుణవంత్‌తో పాటు అతని తల్లిని అరెస్టు చేశారు.
హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మా లక్ష్మి గ్రూప్ చైర్మన్ హరీష్ చంద్ర ప్రసాద్ యార్లగడ్డ.. దాదాపు 500 ఏళ్ల విద్యా వారసత్వం కలిగిన సంస్థను అమరావతికి తీసుకురావడం కేవలం ఒక పాఠశాల నిర్మాణానికే పరిమితం కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాల వికాసంతో పాటు రాజధాని నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చే దీర్ఘకాలిక పెట్టుబడిగా అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు. అక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో  సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు.
ప్రముఖ హెల్త్‌కేర్ టెక్నాలజీ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు,  వైస్ ఛైర్మన్‌ ఈ వర్ధమాన్ జైన్. వ్యాపార రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు   ఆధ్యాత్మిక, సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఏకకాలంలో మానవ సేవా, మాధవ సేవా చేస్తుంటారు.
చెన్నై నగరానికి చెందిన వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం   ఈవో ని కలిసి, తాను సమర్పిస్తున్న బంగారు ఆభరణాలకు సంబంధించిన అధికారిక పత్రాలను అందజేశారు. ఆభరణాల అప్పగింతకు సంబంధించిన నిబంధనలు, ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఈ డాక్యుమెంట్లను ఈవోకు సమర్పించారు.  
కఠినమైన చికిత్సల మధ్య కూడా బాలిక ముఖంలో చిరునవ్వు, ఆసుపత్రి సిబ్బంది చూపిన మానవీయ కోణం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వైద్యుల అంకితభావం వల్లే ప్రాణాలు నిలిచాయంటూ   ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ఆయన మంగళవారం (నవంబర్ 24) అమ్రాబాద్, ఉడుమిల్ల పరిసరాల్లో పర్యటించారు. అమ్రాబాదు శివాలయంలో కాకతీయుల కాలపు అత్యంత కళాత్మకమైన నంది విగ్రహం, ఆలయం వెనుక, ప్రాకారంగోడ పక్కనే మట్టిలో కూరుకు పోయిందన్నారు.
 భక్తులు గోదావరి, కృష్ణా వంటి పుణ్యనదుల స్నానఘట్టాల వద్దకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. స్నానాల అనంతరం కార్తిక దీపాలను వెలిగించి, నదీ జలాల్లో వదులుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి కావడంతో, ఆ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు భక్తులకువైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు  టీటీడీ ప్రకటించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.  సంస్థ కార్యాలయాలు, సంబంధిత ప్రాంగణాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ అధికారులు విస్తృతంగా పరిశీలన జరిపారు.
ఈ పురాతన క్షేత్రంలో భారీ మర్రి, రావి చెట్ల వేర్లు, ఊడల తొర్రలో శివలింగ రూపం కనిపించడం ఆధ్యాత్మిక విశేషంగా నిలుస్తోంది. కార్తీక మాసంలో  స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించి పునీతులౌతారు.
అర్ధరాత్రి  దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలు వచ్చేలా టపాసులు కాలుస్తూనే ఉన్నారని పేర్కొన్న రేణూ దేశాయ్ పండుగ రోజుల్లో తాను ఏదైనా మాట్లాడితే అనవసరంగా తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే భయంతోనే  దీపావళి రోజు తాను మౌనంగా ఉన్నానన్నారు.,
. తామిరువురం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరుసంపూర్ణ గౌరవంతో విడిపోతున్నామని వారా ప్రకటనలో పేర్కొన్నారు.   తమ వివాహ బంధం ఒక ముగింపునకు వచ్చిందని పవన్, అన్నా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా తమ విడిపోయినప్పటికీ స్నేహితులుగా  కలిసే ఉంటామని పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.