ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అరెస్ట్: 16 రోజుల రిమాండ్
Publish Date:Jan 21, 2013
Advertisement
ఎం.ఐ.ఎం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అక్బరుద్దీన్ అరెస్టై ఆందోళన చెందుతున్న తరుణంలో ఎం.ఐ.ఎం నేతలకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఆ పార్టీ ఎంపీ అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ కూడా అరెస్టయ్యారు. కోర్ట్ ఇతనికి 16రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అసదుద్దీన్ న్ని సంగారెడ్డి జైలుకు తరలించారు.
2005 ఏప్రిల్ 16న పటాన్ చెరువు ఏరియాలోని రోడ్డు వెడల్పు భాగంగా మసీదుని అధికారులు తొలగించే విషయమై అప్పటి కలెక్టర్ అనిల్ కుమార్ సింఘాల్, జేసీ భీమానాయాక్లను అసదుద్దిన్ తీవ్ర పదజాలంతో దుషి౦చారు. దీంతో పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసిన విషయం తెసిందే.
http://www.teluguone.com/news/content/hyderabad-mp-asaduddin-owaisi-43-20528.html
బ్రెజిల్ నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ బ్రెజిల్ శాంటా మారియా నగరంలో జనంతో కిక్కిరిసిన ఓ నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 245 మందికి పైగా మృతి చెందారు. షో కోసం వెలిగించిన నిప్పు వలన ఈ అగ్నిప్రమాదం జరిగిందని షో నిర్వాహకులు చెప్పారు.
తెలంగాణాపై ఇప్పటికిప్పుడు పరిష్కారం అసాద్యం అని గులాం నబీ ఆజాద్ ఈ రోజు తేల్చి చెప్పేయడంతో నెల రోజుల సస్పెన్స్ త్రిల్లర్ సీరియల్ పూర్తయిపోయింది. ఇక, రాజకీయ పార్టీల మద్య మాటల యుద్దాలు తరువాత దశలో పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలు, మెజార్టీ వగైరాలు మొదలుకానున్నాయి.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మోకాలి శస్త్రచికిత్సకోసం మద్యలో నిలిపివేసిన తన పాదయాత్రను మళ్ళీ వచ్చేనెల మొదటివారం నుండి ప్రారంబించవచ్చునని ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఈ రోజు మీడియాకి తెలియజేసారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 117 రోజులు పాదయాత్ర పూర్తీ చేసిన సందర్భంగా ఈ రోజు కృష్ణా జిల్లా పరిటాలలో స్థానిక పార్టీ నేతలు నిర్మించిన 117 అడుగుల ఎత్తున్న పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన కృష్ణా జిల్లాలో పైలాన్ అవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
అలనాడు బోధీ వృక్షం క్రింద తపస్సుచేసిన గౌతమ బుద్దుడు “కోరికలే దుఃఖమునకు మూల కారణం” అని కనుగొనగలిగేడు. ఇప్పుడు తెలంగాణాలో దుఃఖానికి, అశాంతికి కేసీర్ వంటి నేతల కోరికలే కారణమని మంత్రి వర్యులు శైలజానాథ్ తెలిపారు.
రాజమండ్రిలో జరుగుతున్న జై ఆంధ్రప్రదేశ్ సభలో పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ నాయకులు కోరినందువల్లే ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని స్పష్టం చేశారు. ఎవ్వరూ మాయమాటలు చెప్పి తెలంగాణను కలుపుకోలేదు అని ఆయన వివరించారు.
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజమండ్రీలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ మహాసభలో మాట్లాడుతూ కేసీర్, ప్రొఫెసర్ కోదండరాం తదితరులను ఉద్యమం పేరిట ప్రజలమధ్య విద్వేషాలు రగిలిస్తున్నందుకు తప్పుపట్టారు. వారు తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసమే తెలంగాణా ఉద్యమాలు మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు.
ముంబై పై దాడులకు సంబంధించిన ఉగ్రవాదికి అమెరికా కోర్టు శిక్ష విధించింది. ముంబై దాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అమెరికాలోని షికాగో కోర్టు తీర్పు చెప్పింది. గత ముంబై దాడి ఘటనలో కీలకపాత్ర పోషించి విధ్వంసానికి కారణమైన హెడ్లీకి 35 ఏళ్ల జైలు
ప్రతీ చిన్న విషయానికి అధిష్టానం నిర్ణయం కోసం డిల్లీ వైపు చూసే కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో మాత్రం పార్టీ గౌరవ ప్రతిష్టలను మసకబారుస్తూ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రజలకి మార్గ దర్శనం చేయవలసిన నేతలే ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొడుతూ, వాటిని అడ్డుపెట్టుకొని గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు.
ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై 13 రోజుల పోరాటం అనంతరం ప్రాణాలు వదిలిన ఫిజియోతెరపీ విద్యార్థిని జ్యోతి సింగ్ పాండే చదువులో ఎంత చురుకో తెలియజేసే రుజువిది. ఫిజియోథెరపీ కోర్సు నాలుగో సంవత్సరం పరీక్షల్లో జ్యోతి సింగ్ పాండే కు 72.7 శాతం మార్కులు వచ్చాయి.
”వారమంటే ఏడు రోజులు కాదు. షిండే చెప్పినంత మాత్రాన నెల రోజుల్లో తెలంగాణను ప్రకటించడం కుదరదు. తెలంగాణ సమస్యకు డెడ్ లైన్ అనేది లేదు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సమస్య పరిష్కారానికి మరింత సమయం పడుతుంది” అని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినంతమాత్రాల ఇప్పుడు ప్రకటన చేయలేం
కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీల మద్య రాజకీయ వైరం పాక్ తీవ్రవాదికి ఆయుధంగా మారింది. రెండు రోజుల క్రితం హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడుతూ సంఘ్ పరివారం మరియు భారతీయ జనతాపార్టీలు కలిసి దేశంలో హిందూ ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ హిందూ ఉగ్రవాదులను తయారుచేస్తున్నాయని విమర్శించారు.
ప్రధానితో మీటింగ్ అనంతరం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్ తో సమావేశం అయ్యారు. ప్రధాని దగ్గర శ్రీకృష్ణకమిటీ నివేదిక గురించే ప్రస్తావించిన కాంగ్రెస్ నేతలు ఆజాద్ తో కూడా అదే విషయంపై మాట్లాడినట్టు తెలుస్తోంది. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలోని 6వ నిబంధన అమలు చేయాలని





