హైదరాబాద్‌ మెట్రో ఆగిపోతుందా..?

Publish Date:Feb 3, 2017

Advertisement

హైదరాబాద్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఛార్మినార్, ట్యాంక్‌బండ్, సైబర్ టవర్స్..వాటితో పాటే ట్రాఫిక్ కూడా. ఇరుకైన రోడ్లకి తోడు, అడుగడుగునా సిగ్నల్స్..ఆ చక్ర వ్యూహంలో మనిషి ఇరుక్కుంటే ఎప్పటికి బయటకొస్తాడో..అసలు వస్తాడో రాడో కూడా తెలియదు. పొద్దున్న ఆఫీసుకు వెళ్దామని బయలుదేరితే..ఆఫీసులు వదిలే సమయానికి కూడా ఇంకా ట్రాఫిక్‌లోనే ఉంటాడు. ఇలాంటి వాటికి చెల్లు చీటి చెప్పేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు‌ ప్రాజెక్ట్‌ను తెరమీదకు తీసుకువచ్చింది. అయితే కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు తొలి నుంచి ఈ ప్రాజెక్ట్ వివాదాస్పదంగానే కొనసాగుతోంది. దాదాపు 72 కిలోమీటర్ల మేర ఆరు దశల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ కోసం నగర ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

 

 

రాష్ట్ర విభజన తర్వాత మెట్రో ఆగిపోతోందని...హైదరాబాద్ ప్రాధాన్యం నానాటికి తగ్గిపోతోందని..ఎల్‌ అండ్ టీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని..మొత్తం ప్రాజెక్ట్ నుంచే కంపెనీ వైదొలుగుతోందంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి.. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. అప్పటి నుంచి పనులు ఊపందుకున్నాయి..ట్రయల్ రన్‌లు విజయవంతమయ్యాయి...అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్న దశలో ఇప్పుడు మరో ఉపద్రవం హెచ్‌ఎంఆర్‌ను చుట్టుముట్టింది.

 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో దాదాపు 900 ఎకరాల భూమికి సంబంధించిన యజమాని పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు..దీంతో అప్పటి ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనపరచుకుంది..ఆ భూమిలో దాదాపు 300 ఎకరాలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు విక్రయించింది. అది సుమారు 200 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసి ఇళ్ల స్థలాల కింద విక్రయించింది. మరో 100 ఎకరాలను హైదరాబాద్ మెట్రో రైలు కోసం ఎల్‌ అండ్ టీ సంస్థకు కేటాయించింది. ఇందులో మెట్రో అధికారులు తమ అవసరాల కోసం అతిపెద్ద డిపోను నిర్మించుకున్నారు. ఇప్పుడు ఇదే మెట్రో ప్రాజెక్ట్‌కు అవరోధంగా మారింది. ఆస్తి అసలు యజమాని పాకిస్థాన్‌కు వెళ్లేముందు ఈ భూమిని తమకు విక్రయించారంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు చాలా ఏళ్ల కిందటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లోనే సుప్రీం దీనిని ప్రైవేట్ ఆస్తిగా నిర్థారించింది.

 

 

ఈ మొత్తం ఆస్తిని తమ ఆధ్వర్యంలోనే విక్రయించాలని ఆదేశించి.. తమ ప్రతినిధిగా పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డిని నియమించింది. సుప్రీం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన నరసింహారెడ్డి భూమి హద్దులను నిర్ణయించాల్సిందిగా రెవెన్యూ శాఖకు ఓ లేఖ రాశారు. దీంతో తెలంగాణ రెవెన్యూ శాఖలో కలకలం రేగింది. ఎందుకంటే అప్పటికే సదరు భూమిని అనేక సంస్థలకు కేటాయించడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు అధికారులు. ఇది ఇలా ఉంటే అదే భూమిలో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైల్‌కు చెందిన మియాపూర్ డిపో ఉంది..ఈ డిపోను వినియోగించుకోవాలంటే దీనిని కొనుగోలు చేయాల్సి వుంటుంది. అసలే ఆర్థిక భారంతో సతమతమవుతున్న మెట్రో రైలుకు తాజా పరిణామం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది. ఈపాటికే పరుగులు తీయాల్సిన మెట్రో రైలు రూట్ మార్పుతో కొంత ఆలస్యమవ్వగా..సుప్రీం ఆదేశంతో మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మెట్రో త్వరగా వస్తుందని ఎదురుచూస్తున్న సామాన్యుడికి మరికొంత కాలం ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. 

By
en-us Political News

  
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.