ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు వద్దు.. సీపీ సజ్జనార్ విజ్ఞప్తి.!

Publish Date:Oct 9, 2026

Advertisement

అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి కేక్ కటింగ్‌లు నిర్వహించవద్దని సూచించారు. సరదా కోసం చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.మూడు రోజుల క్రితం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు వేడుకల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ఆమె కుటుంబ సభ్యుడు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని, ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణనష్టం జరగడం బాధాకరమని సజ్జనార్ తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు కమిషనర్ వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌పై ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ రహదారులపై రాకపోకలు తక్కువగా ఉండటంతో కొందరు వాహనదారులు అధిక వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుందని సజ్జనర్ హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలను వెంటబెట్టుకుని రోడ్లపైకి రావడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో లేదా సురక్షితమైన ప్రదేశాల్లో జరుపుకోవాలని సూచించారు.

ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే వేడుకలు, కేక్ కటింగ్‌ల నిర్వహణపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆంక్షలు విధించిందని గుర్తుచేశారు. పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ అక్కడ వేడుకలు నిర్వహించేందుకు వచ్చే వారిని వెనక్కి పంపిస్తున్నప్పటికీ, కొందరు మళ్లీ అర్ధరాత్రి అక్కడికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కొన్ని క్షణాల ఆనందం కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టవద్దని సజ్జనర్ నగరవాసులకు సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ట్యాంక్‌బండ్‌తో పాటు చెరువుల పరిసరాలు, ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి వేడుకలకు దూరంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజు వేడుకలు ఆనందాన్ని పంచాలే తప్ప.. కుటుంబాల్లో విషాదాన్ని మిగల్చకూడదు అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

 

 

[ Hyderabad CP VC Sajjanar, Tank Bund Birthday Celebrations, Midnight Birthday Parties, Tank Bund Road Accident, Hyderabad Traffic Police, Birthday Cake Cutting Ban, GHMC Restrictions, Hyderabad Road Safety, Tank Bund Accident, Child Safety, Midnight Celebrations Ban, Hyderabad Police Advisory, Road Accident Prevention, Public Safety, Hyderabad News, Telangana News]

By
en-us Political News

  
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.