హైదరాబాద్‌లో కల్తీ టీ, నకిలీ సర్ఫ్ పౌడర్ దందా బట్టబయలు
Publish Date:Mar 4, 2026
Advertisement
గుడ్ మార్నింగ్ అంటూ ప్రతి ఒక్కరు టీతో వారి దినచర్య ప్రారంభిస్తారు.. అయితే టీ పౌడర్ కొనేముందు ఒక్క నిమిషం ఆలోచించండి..అది నకిలీనా... లేక ఒరిజినలా అని... హైదరాబాద్ నగరంలో కొంతమంది కేటుగాళ్లు తమ వ్యాపారంలో లాభాలను పెంచు కోవడానికి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ టీ పౌడర్, సర్ఫ్ పౌడర్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠా వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు... హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసు కుని ఇద్దరు కేటుగాళ్లు రసాయనాలతో కల్తీ టీ పౌడర్ తయారు చేస్తు న్నారు. ఈ నకిలీ ఉత్పత్తు లకు ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ లేబుల్స్ అతికించి అసలైన ఉత్పత్తుల్లా విక్రయిస్తున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీగా నకిలీ టీ పౌడర్, సర్ఫ్ పౌడర్, ఖాళీ కవర్లు, బ్రాండెడ్ లేబుల్స్, ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులు టీ పౌడర్, సర్ఫ్ పౌడర్ వంటి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో అసలైన ఉత్పత్తులనే ఎంపిక చేసుకోవాలని, అనుమానం ఉన్న వస్తువులు కనిపించినచో వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
అదేవిధంగా, లోకల్ మార్కెట్లలో సులభంగా లభించే ముడి సరుకులతో నకిలీ సర్ఫ్ పౌడర్ తయారు చేసి, ప్రముఖ డిటర్జెంట్ కంపెనీల పేర్లతో లేబుల్స్ వేసి హోల్‌సేల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గుజరాత్ రాష్ట్రం నుంచి బ్రాండెడ్ లేబుల్స్ దిగుమతి చేసుకుని వాటిని నకిలీ ఉత్పత్తులపై అతికిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బేగంబజార్‌లోని కొన్ని ప్రముఖ హోల్‌సేల్ దుకాణాలకు ఈ కల్తీ టీ పౌడర్, నకిలీ సర్ఫ్ పౌడర్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం.. అక్కడి నుంచి ఇవి నగరంలోని లోకల్ మార్కెట్లకు పెద్ద ఎత్తున చేరుతున్నట్లు పోలీసులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/hyderabad-city-36-214987.html





