హెచ్‌సీయూలో చోరీలకు పాల్పడ్డ నిందితులు అరెస్ట్

Publish Date:Feb 16, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన భారీ ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్ ఈ చోరీలకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.. ఇతను సాయిచరణ్ (19), అశ్విన్ రావు (19) అనే ఇద్దరు విద్యార్థుల సాయం తీసుకుని ఈ చోరీలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారంలో క్రితం యూనివర్సిటీ పరిధిలోని సి.వి.రావు ఇన్‌స్టిట్యూట్‌లో చోటుచేసుకున్న ఈ చోరీ విద్యా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తూ నిందితులను గుర్తించారు. 

ఈ చోరీకి పాల్పడిన వారిలో యూనివర్సిటీలోనే చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఉండటం సంచలనంగా మారింది. విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులే దొంగతనానికి పాల్పడటం కలకలం రేపుతోంది. వీరికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ అనంతరం దొంగిలించిన ల్యాప్‌టాప్‌లను నగరంలో కాకుండా బెంగళూరుకు తరలించడం ద్వారా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. ముందస్తుగా పథకం రచించి యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్‌లను హ్యాక్ చేసి, పోలీసుల కదలికలను తమ మొబైల్ ఫోన్ల ద్వారా గమనిస్తూ దొంగతనాన్ని అమలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

అంతేకాకుండా, నేరం చేసినప్పుడు ఉపయోగించిన కారును గుర్తించకుండా ఉండేందుకు నెంబర్ ప్లేట్‌ను మార్చి వినియోగించినట్లు బయటపడింది. నిందితుల వద్ద నుంచి మొత్తం 55 ల్యాప్‌టాప్‌లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ల విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం. ఈ ఘటన యూనివర్సిటీ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. 

అంతర్గతంగా చదువుతున్న విద్యార్థులే సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి చోరీకి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. విద్యాసంస్థల్లో సైబర్ భద్రత, సీసీటీవీ నెట్‌వర్క్‌ల రక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల నేపథ్యం, ల్యాప్‌టాప్‌లను విక్రయించే ప్రయత్నాలు జరిగాయా అనే అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 

By
en-us Political News

  
మారుతున్న కాలంతో పాటు ఈ ఆలోచనా ధోరణిలోనూ మార్పు వస్తున్నది. ఇటీవల చికాగోలో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో మూడు లక్షల డాలర్ల ప్యాకేజీని వదులుకుని ఒక భారత మహిళా టెక్ నిపుణురాలు దుబాయ్‌కి తరలివెళ్లడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం ఆమె తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదని.. మారుతున్న గ్లోబల్ టెక్ ట్రెండ్ కు అద్దం పడుతోందని నిపుణులు అంటున్నారు.
ఇటీవల ఒక భారతీయ మహిళా టెక్ ప్రొఫెషనల్, చికాగోలో 3లక్షల డాలర్ల గూగుల్ జాబ్ ( భారత కరెన్సీలో అక్షరాలా.. 2,78,23,500.00 రూపాయలు) వదిలి, దుబాయ్ కు షిఫ్ట్ అవ్వడం, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమెది కేవలం వ్యక్తిగత నిర్ణయంగా మాత్రమే చూడలేం. ఇది ఒక పెద్ద ట్రెండ్ కు ప్రతీకగా చెప్పుకోవచ్చు.
బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు శంషాబాద్ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆమె వెంట ఉన్న లగేజీ బ్యాగులలో రహస్యంగా దాచిన డ్రగ్స్ బయటపడ్డాయి.
శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించామనీ, ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలోనూ పాతిక నుంచి 30 ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుందన్న ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
థాయ్ లాండ్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నీళ్లతో ఒకరినొకరు తడుపుకుంటూ పండుగ చేసుకుంటారు. కానీ ఈ ఏడాది ఈ ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాలలో 191 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మెగా ప్రాజెక్ట్ కోసం అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్ సుమారు 16 గిగావాట్ అవర్ ( సామర్థ్యంతో పనిచేయనుంది. ఈ ప్లాంట్‌లో కేవలం బ్యాటరీ ప్యాక్‌లు మాత్రమే కాకుండా, సెల్ తయారీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌కు అవసరమైన విడిభాగాలను కూడా ఉత్పత్తి చేయనుంది.
అలా సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పర్యటనలో అమరావతి అభివృద్ధికి సింగపూర్ మోడల్ ఎలా ఉపయోగపడుతుందన్న పరిశీలన, అధ్యయనానికి సంబంధించి వారికి దిశానిర్దేశం చేశారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్‌లతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని పేర్కొన్నారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్‌లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల కాలం తర్వాత అమెరికా చొరవతో ఇరు దేశాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి చర్చలు జరపడం విశేషం.
నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో జూనియర్ ఉద్యోగినులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి యత్నాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిదా ఖాన్ పాత్ర అత్యంత కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. బాధితులు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిదా ఖాన్ వారిని బెదిరించి, నిందితులైన సీనియర్ అధికారులకు సహకరించారని ఆరోపణలున్నాయి.
పెళ్ళి పీటల మీద మురిసిపోయిన వధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.
విశాఖపట్నం నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, స్నేహితులు తనపై దాడి చేశారన్న అవమానభారంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
లోక్‌సభలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.