భార్య ముక్కు కొరికిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
Publish Date:Jul 12, 2021
Advertisement
భార్యాభర్త మధ్య చిన్న చిన్న గొడవలు సహజం.. అప్పుడప్పుడు కొట్టుకుంటారు ఆ తరువాత మాట్లాడుకుంటారు.. కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో అనుమానం అనే దెయ్యం ఎంటర్ అయితే ఇక అంతే ఆ కుటుంబాన్ని అంతుచూసే దాకా వదిలిపెట్టదు ఆ అనుమాన భూతం.. అందుకే మన పెద్దలు అనుమానం పెద్ద భూతం ని అంటుంటారు.. అనుమానం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. తనకు అనుమానం కలగడానికి గల విషయాలపై ఆరా తీస్తారు.. ఆ తప్పు చేయకూడదని సర్ధిచెప్పుకుంటారు.. అది లేదంటే దెబ్బలాడుకుంటారు.. తాజాగా భార్యపై అనుమానంతో ఆమె ముక్కు కొరికేశాడో భర్త. అదేంటి ముక్కు కొరకడం ఏంటని అనుకుంటున్నారా ? మీరే తెలుసుకోండి అసలు ఏం జరిగిందో.. అదే కర్ణాటకలోని ధారవాడ తాలూకా. బెళగావి జిల్లా. దొడ్డవాడ గ్రామానికి చెందిన ఉమేష్ గీత భార్యా భర్తలు.. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉమేష్ రోజు మద్యం తాగడం తో స్టార్ట్ అయేది.. అలా అతను మద్యానికి బానిసయ్యాడు. దీంతో గుడిలో భక్తులు భజన చేసినట్లు ఆ భార్యాభర్తలు తరచూ గొడవపడుతూ ఉండేవారు. దీంతో ఐదేళ్ల క్రితం గీత భర్తతో గొడవపడి పిల్లల్ని తీసుకుని అమ్మినబావిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ టైములో భార్యపై లేని పోనీ అనుమానం పెంచుకున్నాడు.. తప్పు చేసింది భర్తనే కదా ఇకనైనా మారి ఉంటాడని ఆరునెలల క్రితం గీత ఆమె పుట్టింటి నుంచి భర్త వద్దకు తిరిగి వచ్చింది. అయినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. మారి వైల్డ్ గా తయారు అయ్యాడు. భార్యతో తరచూ గొడవపడుతూనే ఉండేవాడు.. ఆ దెబ్బతో ఆమె చేసేది ఏమిలేక మళ్లీ తిరిగి పుట్టింటికి వెళ్లి పోయింది. అప్పటికే భార్య మీద అనుమానం ఉన్న భర్త కి తన భార్య రెండో సారికూడా వెళ్లిపోవడంతో.. భార్యను తీసుకువచ్చేందుకు శుక్రవారం అత్తారింటికి వెళ్లాడు ఉమేష్ . వెళ్తే వెళ్ళాడు గాని ఫుల్లుగా తాగివెళ్ళాడు.. అతను రాగానే మందు గమనించిన భార్య.. ఉమేష్ తో వెళ్లటానికి నిరాకరించింది. దీంతో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ గొడవ తారాస్ధాయికి చేరేసరికి మద్యం మత్తులో ఉన్న ఉమేష్ కోపం పట్టలేక కోతిలా ఎగిరి భార్య ముక్కు కొరికాడు. ఇక అంతే ఆ నొప్పి భరించలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. ఎవరైనా వస్తే తనకు భజన చేస్తారని తెలిసి ఉమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. గీత కేకలు విని వచ్చిన ఇరుగు పొరుగు వారు ఆమెను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఉమేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/husband-bites-his-wife-nostril-25-119420.html





