కూటమి సభలు అదుర్స్.. జగన్ బెదుర్స్!

Publish Date:Apr 12, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌వేళ నేత‌ల ప్ర‌చారం హోరెత్తుతోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బ‌స్సు యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఎన్నికల ప్ర‌చారంలో స్పీడ్ పెంచారు. ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జనసేన బీజేపీ,కూట‌మిగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. మూడు పార్టీల మ‌ధ్య‌ సీట్ల పంప‌కాలతో పాటు అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న పూర్త‌యింది. దీంతో కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యాన్నికాంక్షిస్తూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ రోడ్ షోలు, స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఇద్ద‌రు అగ్ర‌నేత‌లు క‌లిసి త‌ణుకు, నిడ‌ద‌వోలు, పి. గ‌న్న‌వ‌రం, అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన రోడ్‌షోలు, ప్ర‌జాగ‌ళం స‌భల్లో పాల్గొన్నారు. ఈ స‌భ‌ల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఒక‌రు ఎక్కువ ఒక‌రు త‌క్కువ అనే బేధాలు లేకుండా మెలిగారు, మెసిలారు. అంతేకాక‌.. జెండాలు వేర‌యినా   అజెండా ఒక్క‌టేన‌ని, రాష్ట్రంకోసం సీట్ల పంప‌కం విష‌యంలో   త్యాగాలు చేసి.. క‌లిసిక‌ట్టుగా ముందుకొచ్చామ‌ని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పారు. తెలుగుదేశం, జ‌న‌సేన, బీజేపీ శ్రేణులు క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని,  కూట‌మి అభ్య‌ర్థులు ఏ పార్టీ వారైనా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల‌ని మూడు పార్టీల శ్రేణుల‌కు  పిలుపునిచ్చారు. 

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్లపాటు ఏపీలో కొన‌సాగించిన అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు బీజేపీతో క‌లిసి చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఏక‌తాటిపైకి వ‌చ్చారు. సీట్ల పంప‌కం విష‌యంలో ఒక‌రినొక‌రు స‌హ‌క‌రించుకొని పార్టీలు కాదు.. రాష్ట్రం అభివృద్ధే  ధ్యేయం అని చాటారు. అయితే   అధికార వైసీపీ  టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ మ‌ధ్య విబేధాలు సృష్టించే ప్ర‌య‌త్నాలు చేసింది. చేస్తోంది. కులాల మ‌ధ్య  విద్వేషాలు రెచ్చ‌గొట్టింది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట‌ కాపు సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. ఈ ఎన్నిక‌ల్లో మెజార్టీ కాపు సామాజిక‌వ‌ర్గం   ప‌వ‌న్‌కే  జైకొడుతున్నది.  కాపు సామాజిక‌వ‌ర్గంలో చీల‌క తెచ్చేందుకు మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రంగంలోకి దింపారు. ఆయ‌న వైసీపీలో చేర‌డంతోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కాపుల ఆత్మ‌గౌర‌వాన్ని చంద్ర‌బాబు కాళ్ల కింద పెట్టాడంటూ కాపుల‌ను రెచ్చగొట్టే ప్ర‌య‌త్నాల‌ు వైసీపీ చేస్తోంది. తాజాగా ప్ర‌జాగ‌ళం స‌భ‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చంద్ర‌బాబు ఇచ్చిన గౌర‌వాన్ని చూసి జ‌న‌సేన శ్రేణులు, ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఉన్న‌ కాపులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. నాకు అనుభ‌వం ఉంది.. ప‌వ‌న్ కు ప‌వ‌ర్ ఉంది అంటూ చంద్ర‌బాబు కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపారు. ప‌వ‌న్ మంచి నాయ‌కుడు.. రాష్ట్రాన్ని మేమిద్ద‌రం క‌లిసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. దీంతో ఎవ‌రెన్ని చెప్పినా న‌మ్మొద్దు.. మేమిద్ద‌రం క‌లిసే ఉన్నాం.  క్షేత్ర స్థాయిలో జ‌న‌సే, టీడీపీ శ్రేణులు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని చంద్ర‌బాబు ఇరు పార్టీల‌కు శ్రేణుల‌కు సూచించారు.    ఈ ప్రకటన జనసేన, తెలుగుదేశం శ్రేణుల్లో ఏమూలనైనా ఇంకా శంకలు మిగిలి ఉంటే అవన్నీ పటాపంచలైపోయాయి. 
 
దీంతో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వైసీపీ నేత‌ల‌కు అర్థ‌మైంది. దీంతో ఎలాగైనా మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని అనేక కుట్ర‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వాలంటీర్ల వ్య‌వ‌హారాన్ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెర‌పైకి తెచ్చారు. వారిని ఎన్నిక‌ల్లో  వాడుకొని మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని భావించారు. కానీ, కోడ్ పూర్త‌య్యే వ‌ర‌కు ఎన్నిక‌ల విధులు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో వాలంటీర్లు పాల్గొన‌వ‌ద్ద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. ఈసీ నిర్ణ‌యాన్ని జీర్ణించుకోలేని జ‌గ‌న్‌.. ఇదంతా చంద్ర‌బాబు, ప‌వ‌న్ కుట్ర.. వారు అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తారు.. త‌ద్వారా మీకు ఇంటివ‌ద్ద‌కు పెన్ష‌న్ రాదు అంటూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ప్ర‌చారం చేశారు. దీనికితోడు వాలంటీర్ల‌పై ఒత్తిడి తెచ్చి వారితో వైసీపీ నేత‌లు రాజీనామాలు చేపిస్తున్నారు. జ‌గ‌న్ త‌ప్పుడు ప్ర‌చారాల‌కు, వాలంటీర్ల‌ను అడ్డుపెట్టుకొని ఆడుతున్న నాట‌కాల‌కు ప్ర‌జాగ‌ళం స‌భ‌ల్లో చంద్ర‌బాబు,ప‌వ‌న్ చెక్ పెట్టారు. వాలంటీర్ల వ్య‌వ‌స్థ కొన‌సాగుతుంద‌ని, కూట‌మి అధికారంలోకి రాగానే వారికి రూ. 10వేల వేత‌నం ఇస్తామ‌ని ఇద్ద‌రు నేత‌లు స్ప‌ష్టం చేశారు. అయితే, వాలంటీర్లు రాజ‌కీయాలు చేయొద్దని చంద్ర‌బాబు, ప‌వ‌న్ సూచించారు. వైసీపీ నేత‌లు చెప్పార‌ని రాజీనామా చేస్తే మ‌ళ్లీ ఉద్యోగం రాదు.. అధికారంలోకి వ‌చ్చేది కూట‌మి.. ఇప్పుడు రాజీనామా చేస్తే పోయేది మీ ఉద్యోగాలు. జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డానికి మీ ఉద్యోగాల‌ను పోగొట్టుకోవ‌ద్ద‌ని, కూట‌మి అధికారంలోకి రాగానే మీకు అన్నివిధాల అండ‌గా ఉండి.. మీకు మ‌రింత మేలు జ‌రిగేలా చూస్తామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ వాలంటీర్ల‌కు హామీ ఇచ్చారు. దీంతో.. వాలంటీర్ల‌తో రాజీనామాలు చేయించి చంద్ర‌బాబు, ప‌వ‌న్ పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెంచాల‌ని చూసిన వైసీపీ నేత‌ల కుట్ర‌ల‌కు చెక్ ప‌డిన‌ట్ల‌యింది.       

త‌ణుకు, నిడ‌ద‌వోలు, పి. గ‌న్న‌వ‌రం, అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిసి పాల్గొన్న ప్ర‌జాగ‌ళం స‌భ‌ల‌కు భారీ స్పంద‌న ల‌భించింది. కిలోమీట‌ర్ల కొద్ది ఇసుకేస్తే రాల‌నంత రీతిలో ప్ర‌జ‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్ పాల్గొన్న స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యారు. మ‌రోవైపు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన బ‌స్సు యాత్రకు ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. గ‌తంలో జ‌గ‌న్ స‌భ‌ల‌కు భారీగా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చేవారు.. కానీ, ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు షాకిస్తున్నారు. కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లుసైతం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌లో పాల్గొనకుండా ముఖం చాటేస్తున్నారు. దీంతో వైసీపీలో ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. ముఖ్యంగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఒకే వేదిక‌పైనుంచి గ‌ర్జ‌న చేస్తుండ‌టంతోపాటు.. ఇద్ద‌రు నేత‌లు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిపోయి ప్ర‌చారంలో పాల్గొంటుండ‌టంతో జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో జోష్ ను నింపింది.  భారీ మెజార్టీతో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని కూట‌మి పార్టీల శ్రేణులు ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. అదే సమయంలో జగన్ శిబిరం బెదిరిపోతోంది. 

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.