కాక్రోచ్ జనతాపార్టీ చలో పార్లమెంట్.. హస్తినలో హై టెన్షన్.!

Publish Date:Jul 19, 2026

Advertisement

హస్తినలో  రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. కాక్రోచ్ జనతా పార్టీ   సోమవారం (జులై 29) చలో పార్లమెంట్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  వేలాది మంది కాక్రోచ్ జనతా పార్టీ  కార్యకర్తలు, మద్దతుదారులు ఢిల్లీ సరిహద్దులకు, సెంట్రల్ ఢిల్లీ వైపు చేరుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.   శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు  భద్రతను   కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు.   కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి  అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేని ఏ కార్యక్రమాన్ని కూడా రాజధాని వీధుల్లో కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ భవనం, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వంటి ప్రాంతాలు ఉండే హైసెక్యూరిటీ జోన్‌లో   ర్యాలీ,  ధర్నాలకు అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టారు. , ఈ ప్రాంతాకికి 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో  దాదాపు వంద బారికేడ్లు ఏర్పాటు చేశారు.  సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో   అదనపు బలగాలను, పారామిలటరీ దళాలను   మోహరించారు. ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్ల వద్ద   తనిఖీలు ముమ్మరం చేశారు,  

మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ  నాయకులు  తమ నిరసనను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు,  లేదని భీష్మించుకూర్చున్నారు. తమ చలో పార్లమెంటు కార్యక్రమం  శాంతియుతంగా ముందుకుసాగుతామని వెల్లడించారు. ఈ నేపధ్యంలో  ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.  ఇలా ఉండగా.. సోనమ్ వాంగ్చుక్ 21  నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను ఆస్పత్రికి తరలించిన సంగతి తలిసిందే. అయితే ఆస్పత్రిలో కూడా నిరశన కొనసాగిస్తున్న సోనమ్ వాంగ్చుక్..  అక్కడి నుంచే చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.  నీట్ బాధితుల ఆక్రందనలు  కేంద్రానికి వినిపించేందుకు ఈ మార్చ్ ఒక పెద్ద వేదిక కావాలన్న సోనమ్ వాంగ్చుక్..ఈ ఉద్యమాన్ని రెండో స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణిస్తూ ఉద్వేగ పూరిత ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే హస్తిన లో తీవ్ర ఉద్రిక్త ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.  

chalo parliament protest, cockroach janata party, delhi police alert, central delhi security, high security zone

By
en-us Political News

  
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.