నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి
Publish Date:Mar 1, 2026
Advertisement
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్బీఎల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 15 మంది మరణించారు. ఏపీలోని కాకినాడ జిల్లాలో భారీ పేలుడు ఘటనలో 24 మంది మృతిచెందిన .. ఘటన మరువక ముందే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. నాగ్‌పూర్‌లోని కటోల్ ప్రాంతంలో పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, పేలుడు పదార్థాలు తయారు చేస్తారని తెలుస్తోంది. ఎస్బీఎల్‌లోని ఓ యూనిట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ సమయంలో 20 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 15 మంది మరణించారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి ఈ పరిశ్రమ గోడౌన్ పూర్తిగా నేలమట్టమైంది. ఈ ప్రమాదం ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలు గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ గోడౌన్‌లో అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను నిల్వ చేయడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని సమాచారం. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
http://www.teluguone.com/news/content/huge-explosion-in-nagpur-36-214836.html





