రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా పంపిణీ
Publish Date:Feb 27, 2026
Advertisement
మహిళల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వైకల్ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. .బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యం లోనే ఈటికా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ టీకా పంపిణీ కార్యక్రమానికి కింగ్ కోటి డిస్టిక్ హాస్పిటల్లో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, వైద్య నిపు ణులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది బాలికలకు హెచ్‌పీవీ టీకా అందించేందుకు విస్తృత ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వం.. ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఎంపిక చేసిన పాఠశాలల ద్వారా దశలవారీగా టీకాలు పంపిణీ చేయనుంది. వైద్య నిపుణుల వివరాల ప్రకారం, హెచ్‌పీవీ వైరస్ కారణంగా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళ ల్లో కనిపించే క్యాన్సర్లలో ఇది ప్రధానమైనదిగా గుర్తించబడింది. అయితే సరైన సమయంలో టీకా తీసుకుంటే ఈ వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రజారోగ్య రంగంలో ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తల్లిదండ్రుల్లో అపోహలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, టీకా నిల్వ మరియు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశారు. సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలనే లక్ష్యంగా తీసుకున్న ఈ చర్యతో రాష్ట్రంలోని బాలికల ఆరోగ్య భద్రతకు మరింత బలమైన పునాది పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తు న్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకోవాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
http://www.teluguone.com/news/content/hpv-vaccine-distributio-36-214779.html





