అప్రూవర్‌గా మారుతానంటూ విజయసాయి బెదిరించారా? అందుకే కీలక పదవులా?
Publish Date:Apr 27, 2022
Advertisement
విజయసాయిరెడ్డి పని అయిపోయిందని అనుకుంటుండగా.. సడెన్‌గా పార్టీలో మళ్లీ నెంబర్ 2 పొజిషన్‌లోకి వచ్చేశారు. సజ్జలను సైడ్ చేసేసి.. ఆయన స్థానంలోకి ఈయన వచ్చేశారు. వైసీపీ జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లంతా ఇక సాయిరెడ్డి ఆధ్వర్యంలో పని చేయాల్సి ఉంటుంది. ఇకపై సజ్జల జస్ట్ మీడియా, ఎమ్మెల్యేల సమన్వయకర్త మాత్రమే. ఏం జరిగింది? రాత్రికి రాత్రి తాడేపల్లి ప్యాలెస్‌లో ఈక్వెషన్ ఎందుకు మారిపోయిందని.. అంతా చర్చించుకుంటున్నారు. అసలు కారణం ఇదంటూ ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. బ్లాక్‌మెయిల్ చేసి మరీ విజయసాయిరెడ్డి కీలక పదవులు పట్టేశారని సమాచారం. అక్రమాస్తుల కేసులో జగన్‌తో పాటు ముద్దాయిగా ఉన్నారు విజయసాయి. ఆయనలానే ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. పాత్రధారి జగనే అయినా.. సూత్రధారి విజయసాయినే అంటోంది సీబీఐ, ఈడీ. సాయిరెడ్డి ఐడియాల మేరకే సూటుకేసు కంపెనీలు, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు తరలివచ్చాయని.. వేల కోట్ల క్విడ్ ప్రోకో నడిచిందని అంటున్నారు. ఆ కేసులు బలంగా ఉన్నా.. బెయిల్ మాత్రం వచ్చేసింది. ఆ అక్రమాస్తులకు సంబంధించిన గుట్టుముట్లన్నీ విజయసాయికి బాగా తెలుసు. తేడా వస్తే.. అప్రూవర్‌గా మారిపోతా.. తనకు కీలక పదవులు ఇవ్వాల్సిందేనంటూ.. జగన్‌రెడ్డి దగ్గర సాయిరెడ్డి పట్టుబట్టారని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు అంటున్నాయి. ఇంకేమైనా ఉందా? విజయసాయి అప్రూవర్‌గా మారితే జగన్ కొంప మునగడం ఖాయమనే విషయం అందరికంటే ఆయనకే బాగా తెలుసు. అందుకే, అంత పని చేయమాకు.. కావలసింది పార్టీ పదవులేగా.. ఇదిగో తీసుకో.. అంటూ ఆ కీలక బాధ్యతలు సజ్జల నుంచి తీసేసి విజయసాయి చేతిలో పెట్టారట జగనన్న. అందుకే, రాత్రికి రాత్రే అలా పదవులు మారిపోయాయని అంటున్నారు. అదంతా, సాయిరెడ్డి బ్లాక్‌మెయిల్ ఫలితమే అని చెబుతున్నారు. ఎందుకైనా మంచిది.. జగన్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ విజయసాయికి ఆయన సన్నిహితులు సలహా కూడా ఇస్తున్నారట వివేక ఘటనను గుర్తు చేస్తూ.
http://www.teluguone.com/news/content/how-vijayasai-reddy-got-key-position-in-ycp-39-135091.html





