శరీరాన్నే కాదు.. బంధాన్ని డిటాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం..!

Publish Date:Jun 9, 2026

Advertisement


ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య కేవలం గొడవలు మాత్రమే ఎక్కువ ఉండి,  ఇద్దరి మధ్య సరైన అవగాహన,  పరస్పర గౌరవం వంటివి లేకపోతే.. ఆ బంధం చాలా పెళుసుగా మారిపోయే అవకాశం ఉంటుంది.  గొడవలు అలకలు ఇద్దరి మద్య బంధాన్ని ఎంత బలం చేస్తాయో.. అవి ఎక్కువైతే ఇద్దరిని అవే విడదీస్తాయి కూడా. నేటికాలంలో చాలామంది తమ బంధం గురించి ఆలోచించి బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ఒక మంచి మార్గం ఉంది. అదే  రిలేషన్షిప్ డిటాక్స్..

శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడం కోసం చాలా  మంది డిటాక్స్ డ్రింకులు తాగుతూ ఉంటారు.  దీనివల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం శుభ్రం అవుతుంది. అదేవిధంగా.. రిలేషన్షిప్ ను డిటాక్స్ చేసుకుంటే.. బంధంలో ఉన్న అనవసర గొడవలు,  ఇబ్బందులు,  అపార్థాలు అన్నీ మంత్రమేసినట్టు మాయమవుతాయి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..

భాగస్వామిని బాధపెట్టకుండా బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే..

భాగస్వామితో మాట్లాడాలి..

 రిలేషన్ షిప్ డిటాక్స్ చేయించుకోవాలనుకుంటే, ముందుగా  భాగస్వామితో మాట్లాడాలి. ఎందుకు రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవాలని అనుకుంటున్నారో వివరించాలి.ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాలి. సమస్యలకు కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భాగస్వామి పైవన్నీ అర్థం చేసుకుంటే.. రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవడం సులువు అవుతుంది.

దృష్టి..

ప్రతి ఒక్కరు తమపై తాము  దృష్టి పెట్టాలి. ఇది  మానసిక,  భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తమపై తాము దృష్టి పెట్టినప్పుడు, తమ  బలాలు,  బలహీనతలను బాగా అర్థం చేసుకోగలుగుతారు.  ఇవి భవిష్యత్తులో సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సహాయపడతాయి.

సమయం..

నేటికాలంలో ప్రతి ఒక్కరు  నిరంతరం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడూ  ఫోన్‌లో ఉండటం వల్ల తమకు తాము సమయం కేటాయించుకోలేకపోతారు. తమకు తాము సమయం కేటాయించుకోనప్పుడు అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. సమయం కేటాయించాలి.  ఫోన్ కు దూరంగా ఉండాలి. బందం గురించి ఆలోచించాలి.  అలాంటప్పుడు అలోచనలు కూడా సరిగ్గా పనిచేస్తాయి.

దూరం..

రిలేషన్షిప్ డిటాక్స్ అంటే.. బంధం నుండి విడిపోవడానికి ప్రయత్నించడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం.  బంధంలో గొడవలు, అపార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. భాగస్వామికి కొన్నాళ్లు దూరంగా ఉండి అన్నీ ఆలోచించుకోవడం వల్ల అన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థం అవుతాయి. అప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవడానికి మార్గాలు కనిపిస్తాయి. బంధం ఎంత ముఖ్యమైనదో కూడా అర్థమవుతుంది.

                                       *రూపశ్రీ.

By
en-us Political News

  
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.