వెన్నునొప్పి రిపీటెడ్ గా వస్తోందా? దీన్ని సహజంగా తగ్గించడం ఎలాగంటే..!
Publish Date:Jun 17, 2025
.webp)
Advertisement
వెన్నునొప్పి చాలామంది కంప్లైంట్ చేసే సమస్య. వెన్నునొప్పిని బిజీగా ఉండే రోజులో పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా గంటల తరబడి డెస్క్ వద్ద పనిచేసిన తర్వాత లేదా ఏదైనా బరువులు ఎత్తిన తర్వాత వెన్నునొప్పి వస్తుంటుంది. చాలామంది ఈ నొప్పి వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు. ఓ పది నిముషాలు పడుకుంటే అంతా సర్థుకుంటుంది అని అంటుంటారు. ఈ వెన్ను నొప్పి పదే పదే వస్తున్నప్పుడు అది కేవలం తాత్కాలిక నొప్పి అనుకోవడం పొరపాటు అని వైద్యులు అంటున్నారు. పదే పదే వచ్చే వెన్నునొప్పి అసౌకర్యాన్ని కలిగించడం కంటే ఎక్కువ హాని చేస్తుంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
వెన్ను నొప్పి అనేది చాలా మంది సాధారణ సమస్యే అనుకుంటూ ఉంటారు. అయితే వెన్ను నొప్పి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకున్నా ఈ నొప్పి తగ్గడంలో మార్పు కనిపించకపోతే అది ప్రమాదం. ముఖ్యంగా ఏ చిన్న పని చేసినా వెన్ను బిగుసుకుపోవడం జరుగుతూ ఉంటే అది నిర్లక్ష్యం చేయాల్సిన సమస్య కాదని అంటున్నారు వైద్యులు. కాళ్లు చేతులు తిమ్మిర్లుగా ఉండటం, జలధరింపు లేదా దృఢత్వం గురించి జాగ్రత్త వహించాలని అంటున్నారు. ఇవి నరాల సమస్యలను, లేదా వెన్నెముక సమస్యలను సూచిస్తాయని అంటున్నారు. అయితే వెన్నెముక సమస్యలు రాకూడదన్నా, వెన్నెముక సేఫ్ గా ఉండాలన్నా, వెన్నెముక సమస్యలను సులువుగా తగ్గించాలని అనుకున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని
వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..
బరువు తగ్గడం..
అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, బరువు తగ్గడం వల్ల వెన్నెముక సమస్యనే కాదు.. మరిన్ని సమస్యలను నివారించవచ్చు .
పొజిషన్..
వంగి ఉండటం ప్రమాదకరం కాదు. కూర్చున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు వీపును సమతలంగా ఉంచాలి. వీపుకు మద్దతు ఇచ్చే కుర్చీలను ఉపయోగించాలి. ఎదురుగా ఉన్న పరికరాలపై వంగి ఉండకూడదు.
వ్యాయామం..
"నిశ్చల జీవనశైలి వెన్నెముకను బలహీనపరుస్తుంది. రోజువారీ దినచర్యలో కోర్ బలపరిచేటటువంటి వ్యాయామాలను చేర్చాలి. తేలికపాటి కదలిక కూడా సహాయపడుతుంది.
ఎర్గోనామిక్ ఫర్నిచర్ ..
అన్నింటి కంటే ముఖ్యంగా చేయాల్సిన పని కుర్చీని వెన్నెముకకు మద్దతు ఇచ్చేలా ఉన్నది ఎంచుకోవడం. అవసరమైతే ఫుట్‌రెస్ట్‌ను జోడించి, స్క్రీన్‌ను కంటి స్థాయికి పెంచుకోవాలి.
లిఫ్టింగ్ టెక్నిక్..
ఏవైనా బరువులు ఎత్తేటప్పుడు నడుమును కాదు మోకాళ్లను వంచాలి. సడన్ గా జెర్కీ కదలికలను నివారించాలి. బరువైన వస్తువును ఎత్తేటప్పుడు ఎప్పుడూ మెలితిప్పకూడదు.
బరువును..
అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మరిన్ని సమస్యలు రాకుండా ఉంటాయి.
నీరు..
హైడ్రేషన్ వెన్నెముక డిస్క్‌ల స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో లేదా వ్యాయామం తర్వాత నీరు తాగాలి. రోజుకు 6–8 గ్లాసులు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.
ఎక్కువసేపు కూర్చోవద్దు..
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను దెబ్బ తింటుంది. ప్రతి 30–45 నిమిషాలకు నిలబడుతూ ఉండాలి. శరీరాన్ని కాస్త సాగదీయడం, నడవడం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి.
నొప్పిని విస్మరించకూడదు..
నొప్పి అనేది శరీరం ఇబ్బందిలో ఉంది అనడానికి ఒక సిగ్నల్. పైన చెప్పిన చిట్కాలు అన్నీ పాటిస్తున్నా అది మళ్లీ మళ్లీ వస్తుంటే వైద్య సహాయం తీసుకోవాలి. ఈరోజు నొప్పిని విస్మరించడం వల్ల రేపు వెన్నెముక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు గట్టిగా చెబుతున్నారు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
http://www.teluguone.com/news/content/how-to-cure-back-pain-naturally-34-200117.html












