LATEST NEWS
మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌తీమ‌ణి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె  నారా బ్రాహ్మ‌ణి బుధవారం (ఆగస్టు 13) పర్యటించారు. ఆ సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. తన భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంపై మమకారంతో ఆమె ఇప్పటికే అక్కడ తన స్వంత ఖర్చుతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ముఖ్యంగా  మహిళల కోసం స్త్రీ శక్తి  కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే, స్థానిక పార్కులో పిల్లలకు ఆటసామగ్రిని తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేశారు.  వీటన్నిటినీ ఆమె ఈ పర్యటనలో సందర్శించారు.  అలాగే చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప‌రిశీలించారు. నూత‌నంగా తీసుకువ‌చ్చిన డిజైన్ల‌ను ప‌రిశీలించారు.  ‘స్త్రీ శ‌క్తి’ కుట్టు శిక్ష‌ణా కేంద్రాల‌ను ప‌రిశీలించి, శిక్షణ సాగుతున్న తీరును ఆరా తీశారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మూడు బ్యాచ్‌లుగా శిక్ష‌ణ పొందిన వారు సొంత‌గానే కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరత్వం పొందుతున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  పార్కులో స్వ‌యంగా తాను సొంత ఖ‌ర్చుతో ఏర్పాటు చేయించిన పిల్ల‌లు ఆడుకునే ప‌రిక‌రాలు.. వ‌స్తువుల‌ను నారా బ్రాహ్మ‌ణి ప‌రిశీలించారు. అలాగే మంగళగిరిలోని ప్ర‌సిద్ధ‌ పాన‌కాల‌స్వామి ఆల‌యాన్ని  నారా బ్రాహ్మ‌ణి సంద‌ర్శించారు.  నారా లోకేష్ సొంత ఖ‌ర్చుతో కొనుగోలు చేసి ఇచ్చిన ఉచిత బ‌స్సులో కొద్ది సేపు ప్రయాణించి, తోటి ప్రయాణీకులతో సంభాషించారు.  నారా బ్రహ్మణి పర్యటనకు జనం నుంచి అద్భుత స్పందన వచ్చింది. కాగా నారా బ్రహ్మణి మంగళగిరిలో పర్యటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అమె పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే.  
పులివెందుల ఓటమి జగన్ ప్రతిష్టను పాతాళానికి పడిపోయేలా చేసిందన్న మాటలు వైసీపీ వర్గాల నుంచే వినపిస్తున్నాయి. అయితే ఆ పాతాళం కంటే ఆయన ప్రతిష్ఠ దిగజారిపోయే పరిస్థితి ముందుందని అంటున్నారు. పులివెందుల ఓటమిని ముందుగానే అంచనా వేసిన జగన్.. ఆ ఓటమికి అధికార తెలుగుదేశం అధికార దుర్వినియోగమే కారణమని ఆరోపణలు కౌంటింగ్ కు ముందు రోజే గుప్పించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగి ఉంటే పాపం కొంచం ఆబోరైనా దక్కేదేమో.. కానీ జగన్ ఈ వ్యవహారంలోకి రాహుల్ గాంధీని లాగారు. ఓట్ చోరీ అంటూ హంగామా చేస్తున్న ఆయనకు ఏపీలో జరిగిన ఎన్నికల అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించడమే కాకుండా, ఏపీ వ్యవహారంపై ఆయన మాట్లాడకపోవడానికి చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్ లో టచ్ లో ఉండటమే అందుకు కారణమని ఆరోపించారు.  జగన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీయులను గాభరా పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ కు సొంత చెల్లి అయిన షర్మిల జగన్ వ్యాఖ్యలకు రియార్ట్ అయితే తమ పరిస్థితి, జగన్ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు.  జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ మామూలుగా ఉండదనీ, ఆమె సంధించే ప్రశ్నలు, చేసే విమర్శలతో జగన్ కు దిమ్మతిరిగి బొమ్మకనబడటం ఖాయమన్న మాటలు వైసీపీ నుంచే వినవస్తున్నాయి.  ఇటు బీజేపీ ఎన్డీయే లో భాగంగా ఉంటూ మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో బాబు హాట్ లైన్ లో ఉన్నారు అంటూ పులివెందుల పంచాయితీలోకి రాహుల్ లాగడం ద్వారా జగన్ తన చెల్లి షర్మిలను రెచ్చగొట్టారని అంటున్నారు.   ఇక ఇప్పుడు షర్మిల నోరు విప్పితే..పులివెందుల ఓటమితో బీటలు మాత్రమే వారిన జగన్ కోట బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. పులివెందుల పంచాయతీలోకి రాహుల్ ను లాగి జగన్ కొరివితో తలగోక్కున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  
అంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం నమోదైంది. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందుల కోట బద్దలైంది. జగన్ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఘనంగా ఎగిరింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది.  డిపాజిట్ కూడా కోల్పోయి కుదేలైంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. పులివెందుల చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏకగ్రీవమే తప్ప ఎన్నిక ఎరుగని పులివెందుల ఓటర్లు ఈ పరిణామంలో ఓటువేసేందుకు ఉత్సాహంతో పోటెత్తారు. పోలింగ్ సమయంలో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయడానికి వీలులేని పరిస్థితులు కల్పించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలను పోలీసులు సమర్ధంగా అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగేలా చూశారు. దీంతో ఎన్నిక సజావుగా సాగింది.  మొత్తం పోలైన ఓట్లలో తెలుగుదేశం అభ్యర్థికి  6716ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. జగన్ అడ్డాలో ఆయన పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. 
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం అభ్యర్థి  6 వేల 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సతీమణి  లతారెడ్డి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.   ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ తెలుగుదేశం కు ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఏ దశలోనూ వైసీపీ అభ్యర్థి పుంజుకునే పరిస్థితి కనిపించలేదు. తెలుగుదేశం అభ్యర్థికి  6735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు వచ్చాయి. పరాభవాన్ని, పరాజయాన్ని ముందుగానే అంచనా వేసిన వైసీపీ బహిష్కరణ  అంటూ పలాయనం చిత్తగించింది.  
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వస్తున్న వరద నీటి కారణంగా అధికారులు జలాశయం 7 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  గేట్ల ఎత్తి లక్షా 87 వేల 208 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టుకు జూరాల నుంచి 70 వేల 802 క్యూసెక్కుల నీరు, సుంకేసుల నుంచి 42 వేల 669,  హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.   శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉంది.  పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.2737 టీఎంసీలుగా నమోదైంది.  శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.
ALSO ON TELUGUONE N E W S
సినిమా పేరు: కూలీ  తారాగణం: రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, పూజాహెగ్డే, సౌబిన్ షాహిర్, సత్య రాజ్ తదితరులు   సంగీతం: అనిరుద్ రవిచందర్   ఎడిటర్:  ఫిలోమిన్ రాజు  సినిమాటోగ్రాఫర్:  గిరీష్ గంగాధరన్ బ్యానర్: సన్ పిక్చర్స్  నిర్మాత: కళానిధి మారన్  రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్  విడుదల తేదీ: అగస్ట్ 14 , 2025  అభిమానులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'కూలీ' ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. ప్రచార చిత్రాల్లో రజనీ, లోకేష్ కనగరాజ్ మానియా కనిపించడం, కింగ్ నాగార్జున ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో కనిపించడంతో కూలీ 'రిజల్ట్' పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ 'దేవ' ( రజినీకాంత్) ఒక అనాధ.స్టూడెంట్స్ తో పాటు, పేదవాళ్ళకి తక్కువ ధరకే నివాసం ఉండటానికి, 'దేవ మెన్షన్' అనే హాస్టల్ లాంటి దాన్ని నిర్వహిస్తు ఉంటాడు. సైమన్(నాగార్జున).. పోర్ట్ లో వంశపారంపర వ్యాపారంగా వస్తున్నకోట్ల ఖరీదు చేసే విదేశీ వాచీలతో పాటు మరికొన్ని విలువైన వస్తువులని స్మగుల్ద్ చేస్తుంటాడు. కానీ ఆ వ్యాపారం చాటున ప్రపంచానికి తెలియని మరో క్రూరమైన పని చేస్తుంటాడు.దయాళ్( సోబిన్) సహాయంతో బిజినెస్ కి అడ్డోచే వాళ్ళని, పోలీస్ ఇన్ఫార్మర్ లని  క్రూరంగా చంపుతుంటారు. ఈ క్రమంలో 'ఎలక్ట్రిక్ క్రిమీటర్' తయారు చేసే రాజశేఖర్( సత్యరాజ్) సహాయం కోరతారు. తన పెద్ద కూతురు ప్రీతి(శృతి హాసన్) తో కలిసి డబ్బుల కోసం సైమన్ చెప్పిన పని చేస్తుంటాడు. కానీ రాజశేఖర్ ని గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారు.   సైమన్ కి  దయాల్ పోలీస్ ఇన్ ఫార్మర్ అని తెలియడంతో సైమన్ చంపుతాడు. కానీ దయాల్ ప్రాణాలతో బయటపడతాడు. దేవ పోర్ట్ కి ఎందుకు వచ్చాడు? రాజశేఖర్ ని ఎవరు చంపారు? దయాల్ నిజంగానే పోలీస్ ఇన్ ఫార్మరేనా? 'ఎలక్ట్రిక్ క్రిమీటర్' అనే ఏంటి? స్మగుల్ద్ వస్తువుల వెనుక సైమన్ చేస్తున్న క్రూరమైన పని ఏంటి? సైమన్ కి దేవకి శత్రుత్వం ఉందా? దేవ నిజంగానే ఒక అనాధనా?  దేవ గతం ఏంటి? 'కూలి'లో ఎవరి క్యారక్టర్ ఎలా ముగిసిందనేదే ఈ చిత్ర కథ ఎనాలసిస్  లోకేష్ కనగరాజ్ తన మేకింగ్ స్టైల్ ప్రకారం, బలమైన సీన్ ని తగ్గించడం, బలహీనమైన సీన్ ని పెంచడంలో మరోసారి సక్సెస్ అయ్యాడు. మూవీ మొత్తంపై రజనీకాంత్, నాగార్జున, సోబిన్ ల నటన  కథనాన్ని బీట్ చేసింది. ఈ ముగ్గురి నటన మాత్రమే కూలికి ప్లస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే దేవ ఇంట్రడక్షన్ దగ్గర్నుంచి, తన స్నేహితుడు కోసం పోర్ట్ కి రావడం, ఆ తర్వాత పోర్ట్ లో వచ్చే చాలా సీన్స్ చూసాక, రొటీన్ కథ అని తెలిసిపోతుంది. సైమన్  క్యారక్టర్ ని ప్రెజెంట్ చేసిన విధానం బాగున్నా, ఎక్కువ సన్నివేశాలని సృష్టించలేకపోయారు. ఎక్కువగా దయాల్ చుట్టే కథనం నడిచింది. ప్రీతి లైఫ్ లో ఒక సస్పెన్సు ఉందని చెప్పి ఉండాల్సింది. కొన్ని సన్నివేశాల్లో దేవతో సైమన్ మాట్లాడుతు నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందని అంటాడు. సైమన్  ఎక్కడ చూశాడో అనే విషయాన్నీ దేవ చివరలో చెప్తాడు. అలా కాకుండా దేవ గురించి కొన్ని దేశాలకి చెందిన పోలీసులు, డాన్  వెతుకుతునట్టుగా, ఒక దేశంలో దేవ గురించి పాఠ్య పుస్తకాల్లో చదుతున్నట్టుగా సినిమా ప్రారంభంలోనే కొన్ని సీన్స్ ని క్రియేట్ చేసుండాల్సింది. దేవ చివర్లో సైమన్ తో చెప్పే  కథకి, అలాంటి సీన్స్ అవసరం కూడా. సెకండ్ హాఫ్ లో  కథకి  ముఖ్యమైన 'కీ' పాయింట్ ని చెప్పి, గ్యాంగ్ స్టార్ డ్రామాని హై లెవల్ కి తీసుకెళ్లారు. ఈ ప్రాసెస్ లో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్దం చెప్తున్నారో తెలియదు. దర్శకుడు మాత్రం తనకి కావాల్సిన విధంగా సీన్స్ ని అల్లుకున్నాడు. మనం ముందుగానే ఊహిస్తాం కాబట్టి క్లై మాక్స్ లో వచ్చిన 'దహి'పెద్దగా గూస్ బంప్స్ తెప్పించలేకపోయాడు. అలా కాకుండా మధ్యలోనే వచ్చి నా లాంటి డాన్స్ క్లైమాక్స్ లో రావడం రొటీన్, అందుకే మధ్యలోనే వచ్చానని సదరు క్యారక్టర్ ద్వారా చెప్పించినా బాగుండేదేమో. మనిషి డెడ్ బాడీలని సెకన్స్ లో తగలబెట్టడం చూపించారు.కాబట్టి రజనీకాంత్ నే ఆ విషయాన్నీ కనిపెట్టాల్సింది. కూలీలు మిస్ అవుతున్నారని పోర్ట్ లోకి వచ్చి, అప్పుడు రాజశేఖర్ గురించి తెలిసి, తన పోరాటాన్ని ఉధృతం చేస్తే  సినిమా రేంజ్ మారిపోయేది. పైగా దయ లక్ష్యం కూడా 'కూలి' లకి ఏం జరగకూడదనే కదా. ఆ దిశగా ఆలోచించలేకపోయారు. కొన్ని వందల మంది చనిపోయాక  హీరో వచ్చినట్లయింది. దేవ, ప్రీతి మధ్య ఉన్న సస్పెన్సు చివరలో ప్రీతి క్యారక్టర్ కి తెలియాల్సింది. నటీనటులు, సాంకేతిక నిపుణల పని తీరు   దేవ గా 'రజనీకాంత్' మరో మారు సిల్వర్ స్క్రీన్ పై తన  మ్యాజిక్ చూపించాడు. ఏడు పదుల వయసులో కూడా ఆ ఎనర్జీ చూస్తే థియేటర్స్ లో విజిల్స్ మోగుతూనే ఉన్నాయి. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్నిటిలోను, తన వన్ మ్యాన్ షో ప్రదర్శించాడు.సైమన్ గా నాగార్జున పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే .దేవ క్యారెక్టర్ నీ బీట్ చేసే విధంగా నాగ్ యాక్టింగ్ సాగింది. నెగిటివ్ రోల్ కి సంబంధించి సరికొత్త డైలాగ్ మాడ్యులేషన్ ని, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి రుచి చూపించాడు. నాగ్ వల్ల కూలీ కి మరింత నిండు తనం వచ్చింది.  క్లైమాక్స్ లో దహిగా అమీర్ ఖాన్ మెరుపు లు మెరిపించాడు.ఉపేంద్ర ఫైటింగ్ సీన్ వరకే పరిమితం. మిగతా క్యారెక్టర్లలో చేసిన శృతి హాసన్, సత్యరాజ్, సోబిన్ తమదైన నటన ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి సోబిన్ ద్వారా సరికొత్త విలన్ దొరికాడు. లోకేష్ దర్శకత్వం, రివర్స్ స్క్రీన్ ప్లే వేగాన్ని పెంచిన రొటీన్ కథనాలు నడిచాయి. టేకింగ్ పరంగా ప్రతి సీన్ చాలా వేగంగా పరిగెత్తింది. పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ పర్లేదు. అనిరుద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు అతి పెద్ద ఎస్సెట్. ఫైనల్ గా చెప్పాలంటే కథనాలు అంతగా మెప్పించకపోయినా, లోకేష్ దర్శకత్వం, రజనీ, నాగార్జున పెర్ ఫార్మెన్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి.ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్.  రేటింగ్ 2 .75 / 5                                                                                                                                                                                                                                                              అరుణాచలం   
నటీనటులు: హృతిక్‌ రోషన్‌, ఎన్‌.టి.ఆర్‌, కియారా అద్వాని, అనిల్‌ కపూర్‌, అశుతోష్‌ రాణా తదితరులు సంగీతం: ప్రీతమ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: సంచిత్‌ బల్‌హారా, అంకిత్‌ బల్‌హారా సినిమాటోగ్రఫీ: బెంజిమన్‌ జాస్పర్‌ ఎడిటింగ్‌: ఆరిఫ్‌ షేక్‌ కథ, నిర్మాత: ఆదిత్య చోప్రా బ్యానర్‌: యశ్‌రాజ్‌ ఫిలింస్‌ స్క్రీన్‌ప్లే: శ్రీధర్‌ రాఘవన్‌ దర్శకత్వం: అయాన్‌ ముఖర్జీ సినిమా నిడివి: 171.44 నిమిషాలు విడుదల తేదీ: 14.08.2025 టాలీవుడ్‌ నుంచి ఎంతో మంది హీరోలు బాలీవుడ్‌కి వెళ్లి విజయాలు సాధించారు. తాజాగా ‘వార్‌2’ చిత్రంతో ఎన్టీఆర్‌ హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. దీంతో ‘వార్‌2’ చిత్రానికి సౌత్‌లో మంచి క్రేజ్‌ వచ్చింది. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బేనర్‌పై స్పై యూనివర్స్‌ సిరీస్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ యాక్షన్‌ ప్యాక్డ్‌గానే ఉంటాయి. అలాగే వార్‌2 కూడా అదే ప్యాట్రన్‌లో రూపొందిన సినిమా అనే విషయం ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతుంది. ఎన్టీఆర్‌ తొలిసారి హిందీలో ఇంట్రడ్యూస్‌ అయిన వార్‌2 ఎలా ఉంది? ఎన్టీఆర్‌ అభిమానులు పండగ చేసుకునేలా ఉందా? ఓవరాల్‌గా ‘వార్‌2’ చిత్రం ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్‌ అయింది? అనే విషయాల గురించి తెలుసుకుందాం. కథ : యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించే స్పై యూనివర్స్‌ సినిమాల్లో దాదాపు ఒకే కథ రన్‌ అవుతూ ఉంటుంది. అదేమిటంటే.. కొన్ని దుష్ట శక్తుల్ని అంతం చేసే రా ఏజెంట్‌గా హీరో కనిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో విలన్స్‌లోనే కలిసిపోయి నెగెటివ్‌గా కనిపిస్తూ వారిని అంతం చేస్తుంటాడు. కానీ, వార్‌2 కథలో మాత్రం కొన్ని మార్పులు కనిపిస్తాయి. కొన్ని దేశాలు కలిసి ఒక టీమ్‌లా ఏర్పడి ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్లాన్‌ చేస్తుంటాయి. ఆ టీమ్‌ పేరు ‘కలి’. రా ఏజెంట్‌గా పనిచేస్తున్న కబీర్‌(హృతిక్‌ రోషన్‌)పై దేశద్రోహి అనే ముద్ర ఉంటుంది. ఆ కారణంగా అతన్ని పట్టుకోవాలని అధికారులు విశ్వప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో కలి టీమ్‌తో చేతులు కలుపుతాడు కబీర్‌. అతనికి అప్పగించిన మొదటి ఆపరేషన్‌ కల్నల్‌ లూద్రా(అశుతోష్‌ రాణా)ను చంపడం. తన తండ్రిలా భావించే లూద్రాను కాల్పి చంపుతాడు కబీర్‌. దీనిపై ఎంతో సీరియస్‌ అయిన ‘రా’ లూద్రా హత్యకు సంబంధించి విచారణ చేపడుతుంది. అలాగే కబీర్‌ను పట్టుకునేందుకు స్పెషల్‌ ఆఫీసర్‌గా విక్రమ్‌(ఎన్టీఆర్‌)ను నియమిస్తుంది. అలా కబీర్‌, విక్రమ్‌ల మధ్య ఛేజ్‌ మొదలవుతుంది. ఈ క్రమంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటాయి. విక్రమ్‌ క్యారెక్టర్‌ కూడా రకరకాల మలుపులు తిరుగుతుంది. కబీర్‌, విక్రమ్‌ మధ్య కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉంటాయి. వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి? చివరికి కబీర్‌ను విక్రమ్‌ పట్టుకోగలిగాడా? కథ ఎలా మలుపు తిరిగింది? కలి పన్నాగాలను కబీర్‌ అరికట్టగలిగాడా? అనేది మిగతా కథ. విశ్లేషణ:  ఇప్పటివరకు ఎన్టీఆర్‌ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమాగా చెప్పొచ్చు. సినిమా రిలీజ్‌ ముందు వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ గెస్ట్‌గా నటించాడని, అతని క్యారెక్టర్‌ సెకండాఫ్‌లోనే ఎంటర్‌ అవుతుందని.. ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, సినిమాలో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌.. హృతిక్‌ రోషన్‌ క్యారెక్టర్‌కి సమానంగా మొదటి నుంచి చివరి వరకు నడుస్తుంది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సీన్స్‌ అద్భుతంగా వున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌లో అతనికి ఇచ్చిన బిల్డప్‌, సైతాన్‌ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగున్నాయి. కథ కంటే ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే ఛైల్డ్‌ ఎపిసోడ్‌తో ఆడియన్స్‌ని కొంత ఎమోషనల్‌ చేసే ప్రయత్నం జరిగింది. ఈ తరహా సినిమాల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌లు కాస్త ఓవర్‌గానే కనిపిస్తాయి. ఈ సినిమాలో ఆ మోతాదు మరింత పెరిగిందని చెప్పాలి. లెంగ్తీగా ఉండే ఛేజ్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌లను భరించే స్థితిలో ఇప్పుడు ప్రేక్షకులు లేరనేది వాస్తవం. కానీ, ఈ సినిమాలో అవి విపరీతంగా ఉండడంతో కథ తక్కువ, యాక్షన్‌ ఎక్కువ అన్నట్టుగా తయారైంది. కథ విషయంలో డైరెక్టర్‌ ఎంతో వెసులుబాటు తీసుకున్నట్టు కనిపించింది. వీలైనన్ని ఎక్కువ సార్లు కథని మలుపు తిప్పేందుకు, ట్విస్టులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఎన్టీర్‌, హృతిక్‌ మధ్య వచ్చే పాటను బాగా తీశారు. ఇద్దరూ తమ స్టెప్పులతో అదరగొట్టారు. అయాన్‌ ముఖర్జీ టేకింగ్‌ కూడా బాగుంది. ఫస్ట్‌ హాఫ్‌ కంటే సెకండాఫ్‌లోనే కథ ఎక్కువ రన్‌ అయింది. ఎమోషన్స్‌ కూడా సెకండాఫ్‌లోనే కనిపిస్తాయి.  నటీనటులు:  వార్‌ చిత్రంలో ఆల్రెడీ హృతిక్‌ రోషన్‌ చేశాడు. ఆ సినిమాలోని కబీర్‌ క్యారెక్టర్‌కి ఇది కంటిన్యూయేషన్‌. హృతిక్‌ తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశృాడు. పాటల్లో, యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదే స్పీడ్‌తో కనిపించాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఎన్టీఆర్‌కి ఇలాంటి క్యారెక్టర్‌ చెయ్యడం ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ అని చెప్పాలి. ఎన్టీఆర్‌ డాన్సుల గురించి, ఫైట్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులోని ఫైట్స్‌ టేకింగ్‌ కొంత డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ వాటిని అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేశారు ఎన్టీఆర్‌. హృతిక్‌, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో తనదైన పెర్‌ఫార్మెన్స్‌తో అలరించారు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి హీరోయిన్‌ లేదు. హృతిక్‌ రోషన్‌కి జంటగా కియారా అద్వానీ నటించింది. అయితే ఫస్ట్‌ హాఫ్‌ పూర్తయ్యే వరకు హృతిక్‌తో తనకెలాంటి సంబంధం లేదు అనేలా ఆమె క్యారెక్టర్‌ ఉంటుంది. సెకండాఫ్‌లో అది రివీల్‌ అవుతుంది. ఆమె క్యారెక్టర్‌కి అంత ఇంపార్టెన్స్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటన ప్రదర్శించింది. ఇక అశుతోష్‌ రాణా, అనిల్‌కపూర్‌ తమ క్యారెక్టర్‌ పరిధి మేరకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు :  ఈ సినిమా టెక్నీషియన్స్‌లో మొదట చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్‌ బెంజిమన్‌ జాస్పర్‌ గురించి. ప్రతి సీన్‌ని అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో కెమెరాతో ఒక ఆటాడుకున్నాడు. వివిధ యాంగిల్స్‌లో చిత్రీకరించిన ఆ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసేలా ఉన్నాయి. ప్రీతమ్‌ సంగీతం సమకూర్చిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. సంచిత్‌, అంకిత్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అక్కడక్కడా బాగుంది. అయితే కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లలో వచ్చే మ్యూజిక్‌ మరీ గందరగోళంగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాకి ఫాస్ట్‌ ఎడిటింగ్‌ అనేది ఎంతో అవసరం. కొన్నిచోట్ల అవసరానికి తగ్గట్టుగా చేసినప్పటికీ మరికొన్ని సీన్స్‌లో సాగతీత ధోరణి కనిపించింది. ఇక డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ టేకింగ్‌ బాగుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లను బాగా డిజైన్‌ చేశారు. హృతిక్‌ రోషన్‌ కంటే ఎన్టీఆర్‌ పైనే అయాన్‌ ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపించింది. స్పై యూనివర్స్‌లో సినిమాలు ఎలా ఉంటాయో ఆ తరహాలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు అయాన్‌ ముఖర్జీ కృషి చేశాడు. ఫైనల్‌గా చెప్పాలంటే..:  టాలీవుడ్‌  ప్రేక్షకులకు ఈ తరహా స్పై యూనివర్స్‌కి సంబంధించిన సినిమాలు ఎక్కువగా పరిచయం ఉండదు. ఇక ఎన్టీఆర్‌ సినిమా అంటే ఇలా ఉండాలి అని ప్రేక్షకులు, అభిమానులు ఫిక్స్‌ అవుతారు. యాక్షన్‌ సినిమాలు, థ్రిల్‌ చేసే ఛేజ్‌లు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఎన్టీఆర్‌ అభిమానులకు మాత్రం ఈ సినిమా నిరాశనే మిగిల్చే అవకాశం ఉంది. అయితే ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌, అతని పెర్‌ఫార్మెన్స్‌ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఒక విధంగా ఎన్టీఆర్‌కి ఇది బాలీవుడ్‌లో మంచి ఎంట్రీ అనే చెప్పాలి.  రేటింగ్‌: 2.75/5 -  జి.హరా
  Cast: Hrithik Roshan, Jr. NTR, Kiara Advani, Ashutosh Rana Crew:  Written by Aditya Chopra, Shridhar Raghavan, Abbas Tyrewala Edited by Aarif Sheikh Cinematography by Benjamin Jasper Music by Pritam Chakraborty, Ankit Balhara, Sanchit Balhara Directed by Ayan Mukerji Produced by Aditya Chopra, Akshaye Widhani WAR 2 marks the return of YRF Spy Universe and Hrithik Roshan's Kabir after a blockbuster like WAR. The movie adding to the excitement cast Jr. NTR in another leading role along with Hrithik. Ayan Mukherji after an impressive Brahmastra, is directing WAR 2, taking forward the revered Spy Universe post Pathaan, Tiger 3. Kiara Advani's bikini shots have already created huge buzz with HR and NTR in full paisa vasool action avatars. Let's discuss about the movie in detail.  Plot:  Kabir (Hrithik Roshan) turns rogue against Indian R&AW agency to team up with Kali, a dark nexus of Indian Neighbouring countries. To enter into it, he needs to kill his boss Colonel Luthra (Ashutosh Rana) and upon Luthra's insistence, he does the job. But he gets to know that there are forces within India that are helping Kali.  As Luthra is dead, his daughter Kavya (Kiara Advani) joins R&AW to avenge his death against Kabir. Vikrant (Anil Kapoor) takes over as R&AW chief. He appoints Agent Vikram (NTR) to hunt down Kabir. Only Vikram is able to go near him but they have an emotional connection. What is it? How will Kabir win over Kali as Kalki?  Analysis:  Jr. NTR is firecracker in this movie. He is able to convince everyone as an anti-hero and his performance is the main highlight of the movie. Hrithik Roshan is good as usual in Kabir role but more emotional depth was expected for his character. Still, looking both the explosive stars on screen is worth of ticket money.  Kiara Advani is stunning but her role has been underwritten. Her bikini scenes gave much needed glamour to the film, in second hour. The focussed narrative from start to finish and high voltage action scenes are major highlights after performances.  Each action sequence stands out and NTR with his physique and great flexibility matched the Greek God level looks of Hrithik. Also, in the dance moves and action sequences both of them have matched each other's energy. But the plot lacks novelty as YRF Spy Universe movies have been using this kind of template from long.  There is a slight deviation from earlier films and similarities with WAR story which appears to be a major drawback. While the movie is eventful, emotional beats take predictable turns and that could have been ironed with even tighter screenplay. Family audiences might not be in awe of such action oriented outlook but movie packs a punch for action lovers in style.  Bottomline:  Action Lovers will enjoy this power-packed ride.  Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.
మరికొన్నిగంటల్లో రజనీకాంత్(Rajinikanth)నాగార్జున(Nagarajuna),అమీర్ ఖాన్(Amir Khan),ఉపేంద్ర(Upendra),లోకేష్ కనగరాజ్(lOkesh Kanagaraj)ల 'కూలీ'(Coolie)మూవీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. దీంతో కూలీ మూవీ రిజల్ట్ పై అభిమానులతో పాటుప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అయితే అన్ని చోట్ల రికార్డు బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా  తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin)ఎక్స్(X)వేదిపైగా 'కూలీ మూవీ ముందుగా చూసే అవకాశం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ లో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశాను.విడుదలైన ప్రతి చోట కూలీ ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు అని ట్వీట్ చేసాడు.  ఉదయనిధి స్టాలిన్  సినీ రంగంలో తన సత్తా చాటిన విషయం తెలిసిందే. 2012 లో 'ఒరు కల్ ఒరు కన్నడి' అనే చిత్రంతో హీరోగా పరిచయమైన స్టాలిన్ మొదటి సినిమాతోనే బెస్ట్ మేల్ డెబ్యూ గా ఫిలింఫేర్ ని అందుకున్నాడు. ఆ తర్వాత సుమారు పద్నాలుగు చిత్రాల వరకు చేసి ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. చివరగా 2023 లో మామన్నన్‌ లో కనిపించగా, కొన్ని చిత్రాలు తెలుగులో కూడా రిలీజయ్యాయి.     
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్(The Raja Saab).హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ నుంచి ఇప్పటికే  టీజర్ వచ్చి, అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో రాజాసాబ్ పై  ఉన్న అంచనాల్ని రెట్టింపు చేసింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో  నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)పై 'టిజి విశ్వప్రసాద్'(Tg Vishwa Prasad)నిర్మిస్తుండగా, మారుతీ(Maruthi)దర్శకుడు. రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై 'ఢిల్లీ'(Delhi)కి చెందిన 'ఐవివై'(Ivy)సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో 'రాజాసాబ్ మూవీ నిర్మాణం కోసం 218 కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టాం. కానీ మూవీ అప్ డేట్స్ ని  పీపుల్ మీడియా ఇవ్వడం లేదు. పదే పదే సినిమా వాయిదా వేస్తున్నారు. పద్దెనిమిది శాతం వడ్డీతో కలిపి మా డబ్బులు మాకు చెల్లించాలి. అప్పటి వరకు పీపుల్ మీడియాకి రాజా సాబ్ పై ఎలాంటి హక్కులు ఉండవని తమ పిటిషన్ లో  పేర్కొంది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది.   ఢిల్లీ కేంద్రంగా ఉన్న 'ఐవివై' సంస్థ గురించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.  పీపుల్ మీడియా  ప్రస్తుతం రాజాసాబ్ తో పాటు 'మిరాయ్' అనే మరో చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ రెండు చిత్రాలు అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉండగా, సెప్టెంబర్ 5 న మిరాయ్(Mirai)డిసెంబర్ 5 న రాజాసాబ్ విడుదల కానున్నాయి. 2018 లో సినీ రంగ ప్రవేశం చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆనతికాలంలోనే నెంబర్ ఆఫ్ సినిమాలని నిర్మించి ,అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో 'బ్రో' ని కూడా నిర్మించిన విషయం తెలిసిందే.      
సౌత్ చిత్ర పరిశ్రమ నుంచి కూలీ(Coolie),నార్త్ చిత్ర పరిశ్రమ నుంచి 'వార్ 2'(War 2)చిత్రాలు, పాన్ ఇండియా స్థాయిలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద పోటీపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెండిటిలో ఏ చిత్రం ముందు వరుసలో ఉంటుందనే ఆసక్తి  అందరిలో ఉంది. ఈ రెండు భారీ చిత్రాల ముందు పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ఇతర సినీ మేకర్స్ తమ కొత్త సినిమాలని రిలీజ్ చేయలేని పరిస్థితి. అంతలా వార్ 2 , కూలీ చిత్రాలు ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.   కానీ 'పశ్చిమ బెంగాల్' లో పరిస్థితి ఇందుకు భిన్నం. ఆగష్టు 14 న పశ్చిమ బెంగాల్ లో 'ధూమకేతు'(Dhumketu)అనే లోకల్ బెంగాలీ మూవీ విడుదల కాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్ పరంగా ధూమకేతు ఇప్పటి వరకు 21 వేల టికెట్స్ సేల్ అవ్వగా, వార్ 2 కేవలం ఆరువేల టికెట్స్ బుక్ అయ్యాయి. కూలీని బెంగాలీలు  పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ మేరకు సోషల్ మీడియాలో విసృతంగా వార్తలు వస్తున్నాయి. తొలి రోజు వార్ 2 , కూలీ ని తలదన్నేలా నాలుగు వందల షో లు పడనున్నాయని కూడా తెలుస్తుంది.  ఇంతవరకు ఏ బెంగాలీ చిత్రానికి అంత ఆదరణ లభించలేదని సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.   'ధూమకేతు' లో బెంగాల్ సూపర్ స్టార్ దేవ్(Dev),శుభశ్రీ గంగూలీ(Subhashree Ganguly)జంటగా నటించారు. గతంలో ఈ ఇద్దరు నటించిన చిత్రాలు సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా, ఇద్దరి ఫెయిర్ కి మంచి పేరు వచ్చింది. దీంతో ధూమకేతుకి బెంగాల్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వచ్చినట్టుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. పది సంవత్సరాల క్రితం మొదలైన ధూమకేతు, ఎనిమిది సంవత్సరాల క్రితమే షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఎన్నో వాయిదాల అనంతరం రేపు విడుదల కాబోతుంది.    
Prabhas has become one of the biggest bonafide superstars of Indian Cinema. Post Baahubali, in these ten years, his films have been creating huge expectations and collecting big collections at the box office. His last release, Kalki 2898 AD, collected more than Rs.1200 crores at the box office.  Now, his fans and movie-lovers are waiting eagerly for his next film, The Raja Saab. The movie has been delayed from originally planned 2024 release to 5th December 2025, release. But the delays have not just frustrated fans but IVY Entertainment, a film rights holding and monetising company, that specializes in acquring South films rights in Hindi, have gone to court against producer, People Media Factory.  Apparently, the delays have cost them Rs.216 crores and they are asking the producer to pay the amount, immediately. People Media Factory have attributed delays to bring quality content to public and also, Prabhas knee injury and recovery. The actor started his next, Prabhas-Hanu film also but The Raja Saab shoot is still pending. In fact, rumors have stated that Prabhas saw the film and asked for re-shoots, hence, the release is being delayed further. Sanjay Dutt is playing a prominent role in the film with Niddhi Agerwal, Malvika Mohanan in leading roles. The movie is directed by Maruthi Dasari and it is the first time Prabhas doing a Horror Comedy. Let's wait for producer reaction to these accusations and rumors.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)రేపు వరల్డ్ వైడ్ గా 'కూలీ'(Coolie)తో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన కూలీ, రజనీ సినీ కెరీర్ యాభై సంవత్సరాలని పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజ్ కావడం, నాగార్జున(Nagarjuna)వంటి బిగ్ స్టార్ ఫస్ట్ టైం విలన్ గా, లియో తర్వాత కొంత గ్యాప్ తీసుకొని లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తెరకెక్కించడంతో కూలీపై భారీ అంచనాలు ఉన్నాయి. హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్(Ntr)కలిసి చేసిన ప్రెస్టేజియస్ట్ మూవీ 'వార్ 2 'కూడా రేపు వరల్డ్ వైడ్ గా విడుదల కానుండటంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది.      రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర హీరో 'హృతిక్ రోషన్'(Hrithik Roshan)ఎక్స్(X)వేదికగా స్పందిస్తు 'రజినీకాంత్ సార్, మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు. మీరు నాకు ఎప్పుడూ ఆదర్శం అవ్వాలి. 50 సంవత్సరాల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు అని పోస్ట్ చేసాడు. పాన్ ఇండియా లెవల్లో వార్ 2 , కూలీలో ఏ మూవీ ముందు వరుసలో నిలుస్తుందని అభిమానులు, సినీ ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న వేళ, హృతిక్ చేసిన పోస్ట్ ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.  1986 లో హిందీలో విడుదలైన 'భగవాన్ దాదా' అనే చిత్రంలో రజనీ కాంత్, హృతిక్ రోషన్ కలిసి నటించారు. ఈ చిత్రంలో 'భగవాన్ దాదా'(Bhagwan Dada)టైటిల్ రోల్ లో రజనీ చెయ్యగా, పన్నెండు సంవత్సరాల వయసు గల హృతిక్, రజనీ పెంపుకు కొడుకు గోవిందాదాదాగా కనిపించాడు. ఈ చిత్రంకి ముందు హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగు సినిమాలు చేసినా, అవి కేవలం అప్పీరియన్స్ చిత్రాలగానే మిగిలిపోయాయి. నటుడుగా 'భగవాన్ దాదా'నే మంచి గుర్తింపు ఇచ్చింది. ఈ చిత్రం తర్వాత  అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకి పని చేసిన హృతిక్ 2000 వ సంవత్సరంలో 'కహోనా ప్యార్ హో'తో హీరోగా తెరంగ్రేటం చేసాడు.           
హీరోగా సుదీర్ఘ కాలంపాటు రాణించి, సినీ రంగంలో తనకంటు ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నాడు జగపతిబాబు(Jagapathi Babu). ఫ్యామిలీ, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, ఇలా అన్ని జోనర్స్ కి సంబంధించిన చిత్రాల్లో, ఎటువంటి క్యారక్టర్ ని అయినా అవలీలగా పోషించి,ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించగల సత్తా ఆయన సొంతం. ప్రస్తుతం ప్రతి నాయకుడుగా తన సత్తా చాటుతు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు జగపతిబాబు ఫస్ట్ టైం ప్రముఖ ఛానల్ 'జీ'(Zee Tv)వేదికగా ప్రసారం కాబోయే 'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి'(Jayammu Nischayammu raa with Jagapathi Babu)అనే టాక్ షో తో  'స్మాల్ స్క్రీన్'పై హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.   ఈ షో కి 'కింగ్ నాగార్జున'(Nagarjuna)ఫస్ట్  గెస్టుగా రాబోతున్నాడు. రీసెంట్ గా 'షో' కి సంబంధించిన ప్రోమో రిలీజై అభిమానులతో పాటు బుల్లి తెర ప్రేక్షకులని విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రోమోలో 'నాగార్జున సినీ కెరీర్ తో పాటు, తండ్రి లెజెండ్రీ యాక్టర్ నాగేశ్వరరావుగారితో ఉన్న అనుబందం, భావోద్వేగాలు, వ్యక్తిగత జీవితం, నాగార్జున గురించి సోదరుడు వెంకట్, సోదరి నాగసుశీల చెప్పిన విషయాలు, నాగార్జున, జగపతి బాబు మధ్య ఉన్న స్నేహబంధం, ఇద్దరి మధ్య జరిగిన కొన్ని ఫన్నీ సంగతులు  'షో'లో ఉండబోతున్నాయని అర్ధమవుతుంది.  దీంతో అక్కినేని అభిమానులు, జగపతి బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు  'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి' టాక్ షో చూస్తామా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్  చేస్తున్నారు. ఆగస్టు 15 న  ఓటిటి వేదికగా జీ5(Zee 5)లో, ఆగస్టు 17 న ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.    
Coolie starring Superstar Rajinikanth, King Nagarjuna, Satyaraj, Upendra, Aamir Khan, Soubin Shahir, Shruti Haasan is releasing on 14th August. worldwide with enormous hype and buzz. Lokesh Kanagaraj directing Rajini for the first time and bringing so many huge stars on board as create mass euphoria all over.  The Coolie storm at the box office is sweeping away all existing records. Already, the movie pre-sales for the opening day have crossed Rs.100 crores gross worldwide and the mania is not stopping anywhere. Even in Telugu States - Andhra Pradesh and Telangana, the movie took huge advantage over WAR 2.  In Tamil strong Overseas territories - Malaysia, Singapore, Indonesia, the hype is phenomenal. Even in North America, the movie has decimated all previous records of Tamil heroes, and crossed Kabali premiere gross by miles. Currently, it has grossed US$2.6 Million and the hype is unreal.  Lokesh Kanagaraj's brand value has contributed immensely along with the star power of all the legends in the cast. Already, Overseas pre-sales have yielded US$8.5 Million and total Worldwide number stands at Rs.103 crores for the opening day. We have to wait and see, how high the final numbers will be after offline bookings are also revealed.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం ను జరుపుకుంటుంది . 2025లో ఇది శుక్రవారం నాడు వస్తుంది.  ఆగస్టు 15, 1947న 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశం విముక్తి పొందినందుకు గుర్తుగా స్వాతంత్ర్యదినోత్సవంను  జరుపుకుంటారు.  స్వాతంత్ర్యదినోత్సవం అనేది దేశమంతా కలిసి జరుపుకునే పండుగ. భారతీయులు ఈ రోజును చాలా  ఉత్సాహంగా జరుపుకుంటారు, విద్యాసంస్థలు, కార్యాలయాలు,  ప్రభుత్వ సంస్థలు జెండా ఎగురవేయడం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం మొదలైనవి చాలా గొప్పగా చేస్తాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 2025 78వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 79వ స్వాతంత్ర్య దినోత్సవమా అనే దానిపై గందరగోళం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు,  విద్యాసంస్థలు, వివిధ కార్యాలయాలలో ఇది చాలా గందరగోళం ఏర్పరుస్తుంది.  ముఖ్యంగా ఉపన్యాసాలు,  వక్తృత్వ పోటీలలో ఈ అంశాన్ని ప్రస్తావించే విషయంలో చాలా అయోమయానికి గురవుతూ ఉంటారు. దీనికి చెక్ పెట్టేందుకు.. అలాగే ప్రతి ఏడాది స్వాతంత్ర్యదినోత్సవం నాడు దేశ ప్రభుత్వం ఒక థీమ్ ప్రకటించి దాని లక్ష్యసాధన దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. ఈ ఏడాది థీమ్ ఏంటనేది కూడా తెలుసుకుంటే.. చాలా మంది 1947 (భారతదేశం బ్రిటిష్ వలసవాదుల నుండి స్వాతంత్ర్యం పొందిన సంవత్సరం) ను 2025 నుండి తీసివేస్తారు. దీని వల్ల  78 వస్తుంది. ఈ కారణంగా గందరగోళం తలెత్తుతుంది. వారు మొదటి వేడుకను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఈ తప్పు జరుగుతుంది. కాబట్టి సరైన మార్గం ఆగస్టు 15, 1947 - భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజు - మొదటి స్వాతంత్ర్య దినోత్సవంగా లెక్కించడం. కాబట్టి, 2025 భారతదేశ స్వాతంత్ర్య వేడుక 79వ సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత ప్రభుత్వం ఇంకా అధికారిక థీమ్ ను ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం, ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ ను  ఐక్యత, దేశభక్తి, సామాజిక పురోగతి,  భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల సహకారాలపై కేంద్రీకరిస్తుంది. ఈ సంవత్సరం థీమ్ జాతీయ అభివృద్ధి,  సమిష్టి బాధ్యతపై ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి విలువలను అనుసరిస్తుందని భావిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ ప్రజలకు మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను,  వారి విలువలను నిలబెట్టుకోవడాన్ని గుర్తుచేస్తాయి కాబట్టి అవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం అంతటా వేడుకలు జరుపుకుంటారు, రాష్ట్ర రాజధానులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు,  సంఘాలు జెండా ఎగురవేయడం,  కవాతులు,  సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తాయి. ప్రధానమంత్రికి సాయుధ దళాలు,  ఢిల్లీ పోలీసులు గౌరవ వందనం సమర్పించడంతో అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జాతీయ గీతం,  21 తుపాకీల వందనంతో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపిస్తాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేస్తారు.                                 *రూపశ్రీ.
  నేటి డిజిటల్ యుగంలో పిల్లలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచడం ప్రతి తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఆటలు, యూట్యూబ్, సోషల్ మీడియా, ఇవన్నీ పిల్లలను ఎంతగా ఆకర్షిస్తాయంటే వారు బయటి ప్రపంచం నుండి దూరమైపోతారు. ఇది వారి చదువులను ప్రభావితం చేయడమే కాకుండా  కళ్ళకు కూడా చాలా ప్రమాదం. మరీ ముఖ్యంగా ఇలా ఫోన్ కు బానిస అయిపోవడం అనేది పిల్లల సామాజిక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల జరుగుతున్న నష్టాలేంటి? ఫోన్ నుండి పిల్లలను దూరం ఉంచడం ఎలా? తెలుసుకుంటే.. నష్టాలు.. ఫోన్ చేతిలో ఉంటే చాలు.. పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడానికి ఇష్టపడరు. బదులుగా వారు ఎక్కువ సమయం మొబైల్‌లోనే గడుపుతారు. ఈ రోజుల్లో ఒక సంవత్సరం పిల్లవాడు కూడా మొబైల్‌లో వీడియోలు చూపిస్తేనే  ఆహారం తింటాడు, లేకుంటే ఏడుస్తూనే ఉంటాడు. మరోవైపు, 14 ఏళ్ల టీనేజర్ బాలుడు కూడా పాఠశాల నుండి వచ్చిన తర్వాత మొబైల్‌తో బిజీగా ఉంటాడు. ఫోన్ లో గేమ్స్.. ఆటలు,  యూట్యూబ్‌లో గంటల తరబడి గడుపుతాడు.  మొబైల్ ఫోన్ వాడటం వల్ల వారి సామాజిక, శారీరక,  మానసిక అభివృద్ధిలో ఆటంకం ఏర్పడుతుంది. ఇది ఆందోళన చెందాల్సిన విషయమే అయినా..  కొన్ని చిన్న మార్పులు,  స్మార్ట్ ట్రిక్స్‌తో పిల్లలు మొబైల్‌కు బానిసల్లా మారడాన్ని  చాలా వరకు తగ్గించవచ్చు. ఇందుకోసం కింది టిప్స్ పాటించవచ్చు. స్క్రీన్ టైమ్ ఫిక్స్ చేయాలి.. మొబైల్ వ్యసనాన్ని తగ్గించడానికి, పిల్లల స్క్రీన్ టైమ్ కోసం ఒక నియమాన్ని రూపొందించాలి.  ప్రతిరోజూ మొబైల్ వాడకానికి ఒక సమయాన్ని ఫిక్స్ చేయాలి. తద్వారా పిల్లవాడు రోజంతా మొబైల్ వాడకుండా ఆ సమయానికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తాడు. ఇది క్రమంగా  మొబైల్ వ్యసనం నుండి బయటపడేలా చేస్తుంది. యాక్టివిటీస్.. పెయింటింగ్, కథలు, బయటకు వెళ్లి ఆడుకోవడం, ఆర్ట్స్,క్రాప్ట్స్ ద్వారా పిల్లల దృష్టిని మొబైల్ ఫోన్ల నుండి మళ్లించవచ్చు. వారి మొబైల్ వినియోగాన్ని తగ్గించడానికి వారిని ఇంటరాక్టివ్ కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. కుటుంబం.. పిల్లలలో ఉన్న మొబైల్ వ్యసనాన్ని మాన్పించడానికి పిల్లలతో ఆడుకోవాలి. వారితో మాట్లాడాలి, మొబైల్ కంటే కుటుంబంతో ఎక్కువ ఆనందం ఉందని వారికి అనిపించేలా చేయాలి. ఒక పిల్లవాడు బోర్ కొట్టినప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు, అతను మొబైల్ వాడటం ఒక వ్యసనంగా మారుతుంది. కానీ అతను తన పరిసరాలతో లేదా కుటుంబంతో ఆనందించడం ప్రారంభించినప్పుడు మొబైల్‌ను మరచిపోయి కుటుంబంతో సమయం గడుపుతాడు.  ఎంపిక.. పిల్లలు వినోదం కోసం లేదా సమయం గడపడానికి మొబైల్‌ను ఉపయోగిస్తారు. ఈ కారణాన్ని అర్థం చేసుకుని వారికి మొబైల్‌కు ఇతర ప్రత్యామ్నాయాలను అందించాలి. ఉదాహరణకు.. పజిల్స్, బోర్డ్ గేమ్‌లు, పుస్తకాలు,  పిల్లల కోసం సంగీతం వంటి ఎంపికలను ఉండేలా చూడాలి. ఇది పిల్లలలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది,  మొబైల్ వ్యసనాన్ని తగ్గిస్తుంది. రోల్ మోడల్స్.. పిల్లలు తాము చూసేది నేర్చుకుంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు  రోజంతా మొబైల్‌లో గడుపుతూ ఉంటే  పిల్లలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి  మొబైల్ వాడకాన్ని  పరిమితం చేసుకోవాలి. తల్లిదండ్రుల దినచర్య, తల్లిదండ్రులు చేసే పనుల దృష్ట్యా పిల్లలు కూడా చక్కని దినచర్య అలవర్చుకుంటారు.  పిల్లలకు తల్లిదండ్రులే మంచి రోల్ మోడల్స్ కావాలి.                                       *రూపశ్రీ.
ప్రతి సంవత్సరం ఆగస్టు 12న భారతదేశంలో గ్రంథాలయ దినోత్సవం (National Librarians’ Day)ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును "భారత పబ్లిక్ లైబ్రరీ ఉద్యమ పితామహుడు"గా పేరుపొందిన డా. ఎస్.ఆర్. రంగనాథన్ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటారు. అసలు రంగనాథన్ గారు ఎవరు? అయన జయంతినీ లైబ్రరీ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? అయన గ్రంథాలయాల గురించి చేసిన కృషి ఏమిటి? తెలుసుకుంటే.. డా. ఎస్.ఆర్. రంగనాథన్ ఎవరు? రంగనాథన్ గారి పూర్తిపేరు శియాలి రామం రంగా నాథన్ ఈయన ఆగస్టు 12, 1892,  తమిళనాడులో జన్మించారు. ఈయన గణిత శాస్త్రవేత్త, పుస్తక శాస్త్రవేత్త, భారత పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు. "Library Science"లో ఆధునిక సూత్రాలను ప్రతిపాదించి, భారతదేశంలో పుస్తకాలను, గ్రంథాలయాలను సమాజానికి చేరువ చేశాడు. ఆయన రూపొందించిన ‘పంచ సూత్రాలు’ ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా లైబ్రరీ రంగానికి మార్గదర్శకాలుగా ఉన్నాయి.  పంచ సూత్రాలు..  రంగనాథన్ గారు రూపొందించిన పంచ సూత్రాలు ఇవే.. 1 . Books are for use – పుస్తకాలు వినియోగం కోసం. 2 .Every reader his/her book – ప్రతి పాఠకుడికి తన పుస్తకం. 3. Every book its reader – ప్రతి పుస్తకానికి తన పాఠకుడు. 4. Save the time of the reader – పాఠకుడి సమయాన్ని ఆదా చేయాలి. 5. The library is a growing organism – గ్రంథాలయం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే జీవంతమైన వ్యవస్థ. ఎందుకు జరుపుకుంటారు? డా. రంగనాథన్ గారు గ్రంథాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అయన  కృషిని స్మరించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  పుస్తకాల ప్రాముఖ్యతను, లైబ్రరీల అవసరాన్ని ప్రజల్లో మళ్లీ గుర్తు చేయడం కూడా ఈ రోజు ముఖ్య ఉద్దేశమే.  డిజిటల్ యుగంలో కూడా గ్రంథాలయాల విలువను ప్రోత్సహించడం. దాన్ని గుర్తించడం కోసం ఈరోజు ఎంతో సహాయపడుతుంది.  పాఠకులు, విద్యార్థులు, పరిశోధకులు లైబ్రరీలను ఎక్కువగా వినియోగించేలా ప్రేరేపించడం వల్ల లైబ్రరీలు ఆదరణ పెరుగుతోంది, పుస్తక పఠనం మెరుగవుతుంది. అన్నిటి కంటే ముఖ్యంగా జ్ఞానార్జన పెరుగుతుంది.  ఈ రోజున జరిగే కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. ఇది పుస్తకాల నిలయమైన లైబ్రరీల ఆదరణకు పునాది అవుతుంది.  గ్రంథాలయాల పర్యటనలు చేయడం కూడా ఇందులో భాగంగా. దేశంలో ఎన్నో గొప్ప గ్రంధాలయాలు ఉన్నాయి. లక్షలాది పుస్తకాలను తమలో నిక్షిప్తం చేసుకుని జ్ఞాన బాండాగారాలుగా నిలుస్తున్నాయి.  పఠన పోటీలు, సాహిత్య చర్చలు చేయడం ద్వారా పుస్తకాలను, వాటిని భద్రపరిచే గ్రంథాలయాల అవశ్యకతను కూడా తెలుసుకోవచ్చు  పుస్తక దానం కార్యక్రమాలు చేయడం వల్ల పుస్తక సంపద పెరుగుతుంది. కొన్ని ప్రైవేట్ గ్రంధాలయాలు కు పుస్తకాలను విరాళాలు గా ఇవ్వడం వల్ల వాటిని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం.  లైబ్రేరియన్లను ఈ సందర్భంగా సన్మానించవచ్చు. లైబ్రరీకి వచ్చిన ప్రతి వ్యక్తికి అవసరమైన పుస్తకాలను ఇస్తూ లైబ్రరీని నడిపే వారి కృషి గుర్తించాలి.  గ్రంథాలయాల ప్రాముఖ్యత గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాల గది కాదు అది ఒక జ్ఞానాలయం. పాఠకుడికి చదవడానికి వేదిక అవుతుంది.  పరిశోధనలుంచేసేవారికి మంచి సమాచారం అందిస్తుంది.  విద్యార్తులలో ప్రేరణను నింపేవి గ్రంధాలయాలు. ఎంపిక చేసుకుని చదివితే గొప్ప పుస్తకాలు అక్కడ విద్యార్థులను గొప్ప వాళ్ళుగా మారుస్తాయి.  సమాజానికి అభివృద్ధి మార్గం పుస్తక పఠనం వల్ల జరుగుతుంది.  "గ్రంథాలయం అనేది నిశ్శబ్దంలో జ్ఞాన విప్లవం జరిగే స్థలం" అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.                     *రూపశ్రీ.
  వయసు పెరిగే కొద్దీ  ఎముకలు పెళుసుగా,  బలహీనంగా మారతాయి. అయితే అనుసరించే జీవనశైలి,  అలవాట్లు బలమైన ఎముకలకు,  శరీరం  సాఫీగా కదలడానికి దోహదం చేస్తాయి. చాలా మంది మోకాళ్ సమస్య వచ్చేవరకు మోకాళ్ల గురించి అస్సలు ఆలోచించరు. కానీ శరీర బరువును మోసేవి కాళ్లు. ఆ భారం ఎక్కువగా మోకాళ్ల మీద ఉంటుంది. అందుకే ఒక వయసు దాటగానే మోకాళ్లు నొప్పులు రావడం,  లేక ఇతర మోకాళ్ల సంబంధ సమస్యలు రావడం జరుగుతుంది.  అయితే మోకాళ్లను సంవత్సరాల తరబడి ఎలాంటి సమస్యలు చట్టు ముట్టకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఇవన్నీ లైప్ స్టైల్ అలవాట్లలో భాగమే.. అవేంటో తెలుసుకుంటే.. బరువు.. కొంచెం అదనపు బరువు ఉన్నా అది  మోకాళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి అడుగుతో  శరీర బరువుకు నాలుగు రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల ఈ ఒత్తిడి తగ్గుతుంది.  దీర్ఘకాలిక గాయం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. మూవ్ మెంట్.. తరచుగా కదలికలు చేయడం వల్ల  మోకాళ్లను సరళంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు  కీళ్ళు కూడా  మంచి స్థితిలో ఉంటాయి. నడక, ఈత, సైక్లింగ్ లేదా యోగా వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు మోకాళ్లకు సున్నితంగా  ఉంటాయి. మోకాళ్ల మీద ఒత్తిడి ఉండదు.  కానీ మోకాళ్లను  బలంగా మారుస్తాయి. కండరాల సపోర్ట్.. దృఢమైన కాళ్ళ కండరాలు, ముఖ్యంగా  హామ్ స్ట్రింగ్స్,  క్వాడ్స్,  మోకాళ్ల నుండి ఒత్తిడిని తగ్గిస్తాయి.  వ్యాయామ నియమావళిలో బాడీ వెయిట్ స్క్వాట్‌లు, లెగ్ రైజ్‌లను చేర్చడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇవన్నీ చేసేటప్పుడు గాయం కాకుండ ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా ఉండటం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్స్, ముఖ్యంగా  తొడలు, పిక్కలు,  తుంటిని వదులుగా,  స్ట్రయిట్ గా   ఉంచుతుంది. వ్యాయామం తర్వాత లేదా  రోజు చివరిలో వేగవంతమైన స్ట్రెచింగ్ ను  డైలీ రొటీన్ లో భాగం చేసుకోవాలి. షూస్..  నడవడం లేదా వ్యాయామం చేయడం వంటివి చేసేటప్పుడు  మంచి ఆర్చ్ సపోర్ట్,  కుషనింగ్ ఉన్న బూట్లు ధరించాలి. బాగు్నాయి కదా అని పాత షూస్ ను వర్కౌట్స్ కు సరిపడకపోయినా వేసుకుంటే ఆ తరువాత నష్టాలు ఎదురుచూడాల్సి రావచ్చు. మరొక విషయం ఏమిటంటే.. ఎక్కువసేపు హీల్స్ ధరించకూడదు. ఫోజ్ మార్చుకోవాలి.. ఫోజ్ ను భంగిమ అని కూడా  అంటారు.  సరైన భంగిమ కాకుండా వ్యాయామం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫోజ్ లు పెడుతుంటే అది   వీపును గాయపరచడమే కాకుండా,  మోకాలి అమరికను కూడా దెబ్బతీస్తుంది. నిటారుగా నిలబడాలి, నిటారుగా కూర్చోవాలి. అలాగే వ్యాయామం అయినా వాకింగ్ అయినా, యోగా అయినా వాటికి తగిన విధంగా శరీరాన్ని బ్యాలన్స్ చేయాలి. అలాగే  బరువులు ఎత్తేటప్పుడు కూడా ఫోజ్ చూసుకోవాలి.                        *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  భారతీయులు  ఆహార ప్రియులు. భారతదేశంలో ఉండే అన్ని వంటకాలు, అన్ని పదార్థాలు మరెక్కడా లభించవని కూడా చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఎక్కువ భాగం ఆహారం నూనె వినియోగం తోనే జరుగుతుంది. నూనె లేకుండా చాలా వంటకాలను అస్సలు తయారు చేయలేరు కూడా.  నూనె భారతీయ  వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తే అది ఆరోగ్యానికి విషంగా మారుతుంది. ఆహారంలో ఎక్కువ నూనెను ఉపయోగిస్తే అది ఊబకాయం, గుండె జబ్బులు,  అనేక ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నూనెలో ఉండే అధిక కేలరీలు శరీరానికి  అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. అందుకే ఇప్పుడు  నూనె లేని ఆహారం అనే ట్రెండ్‌ని  చాలామంది అనుసరిస్తున్నారు. ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  అసలు నో ఆయిల్ డైట్ అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే.. నూనె లేని ఆహారం అంటే.. నో ఆయిల్ డైట్‌లో ఆహారంలో  నూనె పూర్తిగా తొలగించబడుతుంది. బదులుగా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్,  విత్తనాలు వంటి తృణధాన్యాలు  సహజమైనవిగా  తింటారు. వీటిలో ఇప్పటికే కొంత సహజ కొవ్వు ఉంటుంది. అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నూనె లేని ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆహారం నుండి నూనెను పూర్తిగా తొలగించినప్పుడు బరువు తగ్గడం సులభం అవుతుంది. ఉడికించిన పప్పులు, కాల్చిన కూరగాయలు,  నూనె లేకుండా చేసిన వాటిని ఆహారంలో చేర్చడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. శుద్ధి చేసిన నూనెలో ఒమేగా-6 కొవ్వులు అధికంగా ఉంటాయి.  దీన్ని  ఆహారం నుండి తొలగిస్తే, శరీరంలో మంట తగ్గుతుంది,  కొలెస్ట్రాల్,  రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నూనె లేని ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది కడుపు, కాలేయం,  క్లోమంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లతత్వం,  అపానవాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ఆహారంలో నూనె వాడకపోవడం ద్వారా ముఖంపై మొటిమలు,  మచ్చలు తగ్గుతాయి. దీనితో పాటు శరీరం కూడా డీటాక్స్ అవుతుంది. ఇది ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది. నూనె పదార్థాలు తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.  ఇది తరచుగా ఆకలి, మానసిక స్థితిలో మార్పులు,  అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...