సమభావం లేనప్పుడు అన్నీ ఒకేలా ఎలా?

Publish Date:Oct 29, 2022

Advertisement

బీజేపీ వారికి దేశభక్తి మరీ నరనరాల నిండిపోతోంది. భక్తి తో తూగిపోతున్నారు, దాన్ని అందరికీ పంచాలి. సామాన్యు లకు బోధించాలి. అందుకే ప్రధాని మోదీజీ మన్ కీ బాత్ పేరుతో బోధానంద మోదీజీ గా మారారు. మనసులో మాట మరీ జనాంతికంగానే అనేసి దాన్ని కార్యరూపంలోకి తెచ్చేయడానికి అధికార యంత్రాన్ని అమాంతం రంగంలోకి దింపేయడం అన్నీ రాజకీయతంత్రంగానే భావించాలి. మనసులో మాట అంటూనే వారి నిర్ణయాన్ని ప్రకటించడంలో మోదీజీ ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా చింతన్ బైఠక్ లోనూ ఒకే దేశం, ఒకే యూనిఫాం అనే కొత్త నినాదాన్నిచ్చారు. అసలా మాటకి వస్తే ఆయనలా మరే రాజకీయ నాయకుడూ దేశంలో ఆలోచించలేరు.. కడు దుర్లభం కూడా. వారిది ఆర్ ఎస్ ఎస్ క్రమశిక్షణ మరి. అందువల్ల మాటయినా, అభిప్రాయాన్న యినా రుద్దడమే తెలుసు. పలకమీద కాదు రాతి మీద శాసనమే. మనమంతా ఒకటే అంటూండడం పరిపాటి. అంతా ఒకటే ఏ విషయంలోనో తెలీదు. ఎందుకంటే కేంద్రానికి రాష్ట్రాలకీ మధ్య  అత్తగారు, చిన్న కోడలు, పెద్దకోడల తారతమ్యం చాలా ఉంది. పెద్దామెకు పెద్ద కోడలు పీట వేస్తే, చిన్న కోడలు అరిచి అడిగితే గాని గ్లాసుడు నీళ్లవదట.. అలా ఉంది కేంద్రం, రాష్ట్రాల మధ్య సో కాల్డ్ సంబంధాలు. మనది భిన్నత్వంలో ఏకత్వం.. కానీ ఎక్కడా ఎవ్వరూ సమానత్వం, ఏక కత్వం అనేది పాటించగా చూడం. రాజకీయవాతావరణం అంతగా పరిస్థితులను మలినంచేసేసింది. ప్రతీదీ రాజకీయాల మయం. రాజకీయ కోణంలోనే  ఆలోచించడం జరుగుతోంది. మరి ఇప్పుడు మోదీజీ కొత్త పిలుపుని చ్చారు.. ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం అని.

ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ, దీనికి దేశ సమైక్యత, అఖండతలతో కూడా సంబంధం ఉంటుందని చెప్పారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం జరిగిన మేధోమథనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్  ద్వారా మాట్లా డారు. సహకారాత్మక సమాఖ్య తత్వానికి ఈ చింతన్ శిబిరం అసాధారణ ఉదాహరణ అని తెలిపారు. వారి చింతన్ శిబిరంలో ఏది చర్చించినా, నిర్ణయం తీసుకున్నా దేశానికి ఎంతో మేలు చేస్తుందనే అభిప్రాయంలో ప్రకటనలు చేయడం చిత్రం. 

రాష్ట్రాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందవచ్చునని, కలిసికట్టుగా భారత దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని తెలిపారు. ఇది రాజ్యాంగ భావన అని, ప్రజల పట్ల మనకు కల కర్తవ్యమని వివరించారు. ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్చిం చాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని తెలిపారు. నేరగాళ్ళు దేశ సరిహద్దుల ఆవలి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పని చేయవలసిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. ఇది ఉపన్యాసంవరకూ బాగానే ఉంది. కానీ రాష్ట్రాల మధ్య సమన్వయం సరిగా లేన పుడు, వివరాలు, సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడాల్లో రాజకీయ కోణంగా ఆలోచించి జాప్యాలు జరుగు తున్న సమయాల్లో శాంతి భద్రతలు, ప్రజారక్షణ అంశాల్లో కేంద్రం ప్రత్యేకించి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది. పైగా అన్నింటికీ ముందే నిర్ణయాలు తీసుకుని, అమలు చేయాలన్న చివరి దశలో పోనీ మనోళ్లని ఒకసారి కలిసి మాట్లాడు తామన్న ధోరణే తప్ప జాతీకి ఉపయోగపడే అంశాల మీద రాష్ట్రాల అభిప్రాయాలకు ప్రాధాన్యతనీయడం అవసరం. ీ విషయంలో మరి కేంద్రం ఏ మేరకు నమ్మకం కలిగిస్తోంది.  చిత్రమేమంటే,  నేరాల విషయంలో పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సమానంగా స్పందన రానంత వరకు, అన్ని రాష్ట్రాలు వీటిపై పోరాటానికి కలిసిరానంత వరకు, వీటిని ఎదుర్కొనడం అసాధ్యమని చెప్పారు.

ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేధోమథనం సదస్సు రెండు రోజులపాటు జరుగుతుంది. అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై విధానాల రూపకల్పనకు జాతీయ దృక్పథాన్ని కల్పించేందుకు చేసే ప్రయత్నమే ఈ సదస్సు. పోలీసు దళాల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మరింత ఎక్కువగా వాడటం, భూ సరిహద్దుల నిర్వహణ, తీర ప్రాంత భద్రత, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్య మంత్రులు, హోం మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్నవారి మాటకు కేంద్రం యిచ్చే ప్రాధాన్యత, గౌరవం మున్ముందు తెలుస్తుంది. హామీలు ఇవ్వడం కంటే వాటిని నిలబెట్టుకోవడం, సహాయసహకారాలు అందించడమే కీలకం. ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య రాజకీయ కోణం అడ్డుపడకూడదు. ప్రజారోగ్యం, ప్రజాసంక్షేమం, రక్షణ విషయాల్లో కూడా పరిస్థితులను అనుసరించి  ఏ విధంగా సహాయసహకారాలు అందించాలన్నది ఆలోచించాలి. తనవారు పరాయివారు అన్న తేడాలు ఈ విషయాల్లో లేకుండా ఉంటేనే నిజమైన సామరస్యం ఉంటుంది. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.