ప్రాణాలు తీస్తున్న Hot Water Challenge

Publish Date:Feb 16, 2019

Advertisement

 

 

 

జనానికి ఏమొచ్చినా పట్టడం కష్టం. మొన్నటి వరకూ Cold Water Challenge పేరుతో చల్లటి నీళ్లు ఒకరి మీద ఒకరు దిమ్మరించుకునేవాళ్లు. ఇహ ఇప్పుడు Hot Water Challenge శకం మొదలైంది. ఏడాది క్రితం మొదలైన ఈ సరదా ఇప్పుడు వెర్రి తలలు వేసి ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఎవరన్నా తన స్నేహితుడి మీద వేడి వేడి నీళ్లు పోయడం కానీ... వేడి నీళ్లు బలవంతంగా తాగమని ఛాలెంజ్ చేయడం కానీ చేస్తారు.

 

ఈ ఛాలెంజ్ వల్ల వచ్చే సరదా ఏంటో కానీ వేడి నీళ్లు పడ్డ ప్రతివాళ్లకీ ఒళ్లు బొబ్బలెక్కి హాస్పిటల్‌లో చేరే పరిస్థితులు వస్తున్నాయి. ఇక వేడి నీళ్లు తాగినవాళ్లకి అయితే నోరు, గొంతు కాలిపోయి మూగ, చెవిటివాళ్లుగా మారిపోతున్నారు. వేడి వేడి నీళ్లు తాగడం వల్ల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా రికార్డు అవుతున్నాయి. వేడి నీళ్ల వల్ల ఇంత ప్రమాదం జరుగుతుందని తెలియని పిల్లలు మాత్రం ఈ ఛాలెంజ్ మోజులో పడి స్నేహితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

 

 

మనం వేడి చేసే నీళ్లు సాధారణంగా 120 డిగ్రీలు దాటితే SECOND DEGREE BURNS ఖాయం. అంటే చర్మపు పై పొరతో పాటు రెండో పొర కూడా దెబ్బతింటుంది. ఇలా ఏర్పడే గాయాలు ఓ పట్టాన తగ్గకపోగా చాలా బాధని కూడా మిగులుస్తాయి. ఇక 150 డిగ్రీలు దాటితే THIRD DEGREE BURNS తప్పవు. అంటే చర్మం లోపల ఉండే కొవ్వు కూడా దెబ్బతిని, నరాలు కూడా పాడైపోతాయి. ధర్డ్‌ డిగ్రీ బర్న్స్ వల్ల ఒకోసారి ఎముకలు కూడా బయటపడవచ్చు.

 

 

హాట్ వాటర్ ఛాలంజ్ వెనకాల ఇంత బాధ ఉందన్నమాట! ఇలాంటి సంఘటనలు జరిగాక తెగ బాధపడే కంటే ముందే ఇంట్లో పిల్లలకి వేడి నీళ్లతో ఎప్పుడూ చెలగాటం ఆడొద్దని ఓ గట్టి వార్నింగ్‌ ఇవ్వాలి. యూట్యూబ్‌లో వేడి నీళ్లు పడటం వల్ల కలిగే అనర్థాలు ఓసారి చూపిస్తే ఇక వాటి జోలికే పోకుండా ఉంటారు.

- నిర్జర.

 

By
en-us Political News

  
ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు, కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చాలామంది ఆరోగ్యం అంటే కేవలం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా కఠినమైన ఆహార నియమాలు పాటించడమే అని అనుకుంటారు.
అంజీర్ పండు (Fig Fruit) ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పండు. తాజా అంజీర్ అయినా, ఎండిన అంజీర్ అయినా సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం.
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
పంటి నొప్పి, పిప్పిపంటి, పంటి సెన్సిటివిటీ, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి, ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగా, ప్రాణాయామం కూడా కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు.
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలపై Best Before,Use By, Expiry Date వంటి పదాలు కనిపిస్తుంటాయి,చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు.
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
దాహంగా అనిపించినప్పుడు, గొంతు పొడిగా మారినప్పుడు నీరు తాగడం సహజం.  అయితే ఇలా నీరు తాగగానే.. మళ్లీ కాసేపటికే వెంటనే దాహం వేస్తుంది కొందరికి.
రెస్టారెంట్లలో భోజనం తర్వాత స్వీట్ సొంపు ఇస్తుంటారు.  చాలామందికి ఈ సొంపు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.  కొందరు ఇంట్లో కూడా భోజనం తర్వాత స్వీట్ సొంపు తినడం లేదా సొంపు కండ చెక్కర కలిపి తినడం చేస్తుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.