LATEST NEWS
పంచాయతీ ఎన్నికలలో తొలి విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో  కలవరం మొదలైంది. ప్రచారానికి  వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి గ్రాయపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం (డిసెంబర్ 9)  సాయంత్రంతో ముగియనుంది.  అదలా ఉండగా.. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన  ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మరో పక్క మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయ్యింది. దీనికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.
బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నాత‌నదైన రాజ‌కీయం చేయ‌డంలో ఆరితేరిన వార‌న్న పేరుంది ఆయనకు.  విజయనగరం రాజ‌కీయాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి  సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.   ఈ క్రమంలోనే  తాను పొలిటికల్ గా యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసుల్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు.  తన కుమార్తె తన కుమార్తె బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్‌ వర్క్ పెద్ద ఎత్తున‌ జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష  చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్‌గా యాక్టివ్‌ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. వివిధ కార్యక్రమాల పేరిట బొత్స  అనూష‌ ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చూపిస్తున్న చొరవ చూస్తుంటే అతి త్వ‌ర‌లోనే  ఆమె రాజ‌కీయ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది.  చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సొంత కేడరే చెబుతోంది. వృత్తి పరంగా డాక్టర్‌ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్‌ మీటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్ గావున్న అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావల్సిన వైద్య సలహాలను అందిస్తున్నారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… స్థానిక‌ నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడికి వెళ్లి త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నార‌ట‌. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పొలిటికల్‌ కెరీర్‌ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.  తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్పుకుంటోంది. మరో వైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల‌ స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకుంటున్నట్టు రేపు పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్‌ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్‌గా ఆ కుటుంబం నుంచి మ‌రో రాజకీయ వారసత్వం  ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.
  ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో  పోలిస్తే ఆ రాజకీయం ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం రెండు మున్సిపాలిటీ లు మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ జోక్యాలు ఉండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు.ఇద్దరు కూడ ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు.  ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేస్తున్నారట. 2024లో టీడీపీ నుంచి గెలిచినా గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారట నేతలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇంచార్జిగా ఉండటంతో ఈ రెండు చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్‌తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి గుంతకల్లు మొత్తం తన భుజస్కందాలపై వేసుకొని తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ వస్తున్నారు.  అయితే తండ్రి ఇటీవల అనార్యోగానికి గురవడంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి పెద్ద కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి విజయవంతం చేయడంతో ఆమెపై వైసీపీ క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేత పెళ్లికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతి రెడ్డితో  ప్రత్యేకంగా మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత  బలం చేకూర్చింది.  అందులోనూ వైసీపీలో వేరే నేత ఎవరు పోటీలో లేకపోవడంతో  అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతి రెడ్డికి  ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు.ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం కర్నూల్ జిల్లాలోని సొంత సెగ్మెంట్ ఆలూరుపై పెట్టడం.. అందులోనూ గుంతకల్లు  టీడీపీ లో గుమ్మనూరు జయరాం ఇమడకపోవడం, అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పార్టీ అతనికి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు.  అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఇదే సీట్‌పై కన్నేయడం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్లుపై ఫోకస్ పెంచడం, ఆయనకు అది సొంత నియోజకవర్గం కూడా కావడంతో గుమ్మనూరు ఈశ్వర్‌కు కొద్దిపాటి ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మరి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.   ఆరు రోజుల అమెరికా పర్యటనలో  లోకేష్ లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణే. అందులో భాగంగానే ప్రస్తుతం డల్లాస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ డల్లాస్ లో తెలుగు కమ్యూనిటీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ ఆర్ఐలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలిచారో వివరించారు. రాష్ట్రం నంబర్ వన్ గా ఎదగడంలో ఎన్ఆర్ఐల సహకారం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక ఎన్ఆర్ఐ కొడాలి నాని గురించి అడిగారు. అధికారం అండ చూసుకుని అరాచకత్వంతో రెచ్చిపోయిన కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.   అంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ గా నిలబెట్టేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలి, అందరూ దానిపైనే దృష్టి పెట్టాలి అని చెప్పిన ఆయన అనవసర విషయాల ప్రస్తావన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.  
రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులు కోవడానికి ఇష్టపడరు.  ఏదో ఆవేశంలో రాజకీయ వైరాగ్యం కలిగినా, మరీ ఆవేశపడి రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటనలు చేసేసినా.. ఆ ఆవేశం తగ్గాకా మళ్లీ వాళ్ల చూపు రాజకీయలవైపే అంటుంది. అడుగులు కూడా రాజకీయం వైపే పడతాయి. ఒక లగడపాటి రాజగోపాల్ అయినా, మరో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా.. ఇంకో వడ్డే శోభనాదీశ్వరరావైనా అంతే. అవకాశం లేక, జనం మొచ్చక, ఒప్పక వీరంతా రాజకీయ ప్రకటనలకే పరిమితమయ్యారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి అది కాదు.విజయసాయి  అవేశంతో కంటే ఎంతో  ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.  ఎందుకంటే.. వైసీపీలో ఒక సమయంలో ఆయన జగన్ తరువాత జగనంతటి నాయకుడిగా వెలుగొందారు.  ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలో రాజకీయంగానే కాదు, కేసుల పరంగా కూడా నిండా మునిగి ఉన్నారు. ఇంత కాలం తన సర్వస్వం ధారపోసి పెంచిన పార్టీ దూరం పెట్టింది. అదే సమయంలో కేసులూ చుట్టుముట్టాయి. ఆ కేసుల నుంచి బయటపడాలంటే.. వైసీపీకి తాను దూరం అని నిరూపించుకోవాలి. అదే సమయంలో.. తన స్వేదంతో పెంచిన పార్టీలో.. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అవకాశం రావాలంటే.. పోలిటికల్ గా తాను న్యూట్రల్ గా ఉన్నాననీ, ఉంటాననీ నిరూపించుకోవాలి. అందుకే ఆ సమయంలో విజయసాయి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లుగా ప్రకటించారని పరిశీలకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన వ్యవసాయమే వ్యాపకం అని ప్రకటించినా, సోషల్ మీడియా ద్వారా, చేయగలిగినంత రాజకీయం చేశారు. అలాగే కేసుల విచారణకు హాజరైన సందర్భంగా మీడియా ముందూ రాజకీయాలే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు ఆయన ఇచ్చిన లీకులే కారణమంటే అతిశయోక్తి కాదు. విజయసాయి వైసీపీ నుంచి బయటకు వచ్చి, రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మాటలు, చేతలు, అడుగులూ అన్నీ బయటకు జగన్ కోటరీ టార్గెట్ అన్నట్లు కనిపించినా.. ఆయన అసలు లక్ష్యం జగన్ అన్నట్లుగానే సాగాయి. అంతెందుకు విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత హైదరాబాద్ వెళ్లి మరీ  జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా విజయసాయి పొలిటికల్ గా బీజేపీకి చేరువ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.   ఇప్పుడు ఆ ప్రచారాలకీ, ఆ విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా హిందుత్వకు మద్దతుగా ఆయన తన గళం వినిపించారు. అదీ అలా ఇలా కాదు.. వైసీపీ పునాదులే కదిలిపోయేంత గట్టిగా విజయసాయి బాం బు పేల్చారు. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా  జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలనీ, ఇందుకు ఒక కమిటీని వేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. హిందుత్వకు ద్రోహం చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. ఈ మాటల వెనుక ఆయన ఆయన ప్రధాన టార్గెట్ వైసీపీ అండ్ జగన్ అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుందంటారు పరిశీలకులు. గత రెండు దశాబ్దాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలన్నది ఆయన చేసిన డిమాండ్.   వైఎస్ జమానాలో క్రైస్తవ మతంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులు జరగిన విషయం అందరికీ తెలి సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి డిమాండ్  ద్వారా బీజేపీకి పదునైన ఆయుధాన్ని అందించారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు విజయసాయి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవచ్చు కానీ, బీజేపీ గొంతుక వినిపించారు.  తద్వారా తన అడుగులు ఎటు అన్న సంకేతాలు ఇచ్చారు. విజయసాయి కాషాయం పుచ్చుకుంటే.. జగన్ కు ఇక గడ్డుకాలమేనన్నది పరిశీలకుల విశ్లేషణ
ALSO ON TELUGUONE N E W S
Sharwanand starrer Nari Nari Naduma Murari, with leading ladies Samyuktha and Sakshi Vaidya, is gearing up for a major Sankranti release. Produced by Ramabrahmam Sunkara and helmed by Ram Abbaraju, the director of cult comedy Samajavaragamana, the film is promised to be a youthful family entertainer. Sharwanand, who previously delivered two massive Sankranti blockbusters, Shatamanam Bhavati and Express Raja, is now eyeing a hat-trick with this release. The filmmakers have confirmed a worldwide theatrical release on January 14th, with a remarkably precise first show timing locked at 5:49 PM.  This unusual evening muhurtham and its precise announcement underscore the meticulous planning and high confidence the team holds in the movie’s success.The announcement poster hints at the film's core theme, showcasing Sharwa in a stylish yet confused look amid a festive setting, contrasting with Samyuktha’s look of anguish and Sakshi Vaidya's cheerful expression.  With promotional content generating buzz, Nari Nari Naduma Murari is strongly positioned for the holiday box office, capitalizing on its family appeal and the director's success streak. The promotional campaign is scheduled to intensify very soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాలలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఇది నిర్వహిస్తున్నారు. ఇందులో సినీ పరిశ్రమకు కూడా పెద్ద పీట ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశమయ్యారు.    తెలంగాణలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.   ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని రేవంత్ తెలిపారు. స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.   Also Read: వారణాసిలో ఐదు పాత్రల్లో మహేష్.. ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న!   రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, చిరంజీవి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, అక్కినేని అమల, జెనీలియాతో  పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.   
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌(Super star Rajinikanth) కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్స్‌ ఉన్నాయి. వాటిలో ‘వడయప్ప’(Vadayappa) చిత్రం ఒకటి. 1999లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘నరసింహ’ పేరుతో విడుదల చేశారు. తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని డిసెంబర్‌ 12న సూపర్‌స్టార్‌ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్‌ చేస్తున్నారు. 4కె డిజిటల్‌ ప్రింట్‌, డాల్బీ అట్మాస్‌ సౌండ్‌తో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది.    Also Read: వారణాసిలో ఐదు పాత్రల్లో మహేష్.. ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న   ఇప్పటివరకు టాప్‌ హీరోల సూపర్‌హిట్‌ మూవీస్‌ చాలా రీరిలీజ్‌ అయ్యాయి. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టాయి. అయితే ‘నరసింహ’ చిత్రానికి వాటిని మించే స్థాయి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఏ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో లేదు. అంతకుముందు ఈ సినిమాను చూసిన వాళ్లు విజువల్‌గా, ఆడియో పరంగా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఈ సినిమాను థియేటర్లలోనే చూడక తప్పదు. అలాగే ఇప్పటి జనరేషన్‌ ఈ సినిమాను అసలు చూసి ఉండదు కాబట్టి వాళ్ళంతా థియేటర్లకు తరలి వెళ్తారు. దాంతో సహజంగానే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.    ‘నరసింహ’ రీరిలీజ్‌ సందర్భంగా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కోలీవుడ్‌లో ఇది ఆసక్తికరమైన చర్చగా మారింది. అంతేకాదు, సీక్వెల్‌ ఎలా ఉండబోతోంది అనేది కూడా రజినీ వివరించారు. సీక్వెల్‌లో తన కంటే రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, కథ ఆమె చుట్టూనే తిరుగుందని తెలిపారు.    Also Read: ప్రభాస్ క్షేమంగానే ఉన్నాడు.. క్లారిటీ ఇచ్చిన మారుతి    ఈ చిత్రంలో రమ్యకృష్ణ చేసిన ఈ నెగెటివ్‌ క్యారెక్టర్‌ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ క్యారెక్టర్‌ను తను తప్ప మరొకరు చెయ్యలేరు అనే రేంజ్‌లో పెర్‌ఫార్మ్‌ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు రమ్యకృష్ణ. ‘నరసింహ’లో నీలాంబరి క్యారెక్టర్‌ చనిపోతుంది. మరి సీక్వెల్‌లో ఆ క్యారెక్టర్‌ మళ్లీ ఎలా వస్తుందనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే దీన్ని సీక్వెల్‌గా చేస్తున్నారా? లేక ప్రీక్వెల్‌గా ప్లాన్‌ చేశారా? లేక ఫ్లాష్‌బ్యాక్‌ ఆధారంగా కథను రెడీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.    ఇవన్నీ పక్కన పెడితే ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. ‘నరసింహ’లాంటి బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ చెయ్యాలంటే ఒక సమర్థవంతమైన డైరెక్టర్‌ కావాలి. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరో పక్క అసలు ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందా? లేక ‘నరసింహ’ రీరిలీజ్‌కు హైప్‌ తీసుకొచ్చేందుకు ఈ ప్రకటన చేశారా అనే సందేహం కూడా అందరిలో ఉంది. ఏది ఏమైనా ‘నరసింహ’ చిత్రం రీరిలీజ్‌ మాత్రం సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది.
Chief Minister Revanth Reddy held a significant meeting with prominent film personalities to discuss the development and support for the cinema industry in Telangana. The meeting saw the attendance of Deputy Chief Minister Bhatti Vikramarka, Minister Komatireddy Venkat Reddy, producers Allu Aravind, Suresh Babu, and Dil Raju, actors Genelia and Akkineni Amala, along with various other key figures from the Telugu and Hindi film fraternities. The Chief Minister assured the film industry stakeholders that the government is fully prepared to provide all necessary facilities and support required for the industry’s growth in the state. CM Reddy highlighted the establishment of a Skills University in Future City and suggested that industry leaders explore the possibility of training local talent across the 24 crafts of filmmaking, aligning with the industry's specific needs. Furthermore, he promised comprehensive assistance from the state government for establishing studios in Future City. CM Revanth Reddy emphasized the government's readiness to promote the cinema industry by creating a streamlined process, stating that they are prepared to encourage filmmakers who arrive with a script to complete their film production entirely within the state. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
      -ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు  -అభిమానులు ఎందుకు టెన్షన్ పడ్డారు  -మారుతి ఇచ్చిన రిప్లై ఏంటి!     ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో వరుస చిత్రాలు అనౌన్స్ చేస్తు షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే, వన్ అండ్ ఓన్లీ ప్రభాస్(Prabhas)అని చెప్పవచ్చు. అంతలా తన సినీ కెరీర్ ని  జెట్ స్పీడ్ వేగంతో ముందుకు తీసుకుపోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం జపాన్(Japan)దేశంలో పర్యటిస్తున్నాడు. బాహుబలి ఎపిక్ ఈ నెల 12 న జపాన్ లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కోసమే జపాన్ వెళ్ళాడు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. వాటిని చూసిన అభిమానుల్లో ఇప్పుడు టెన్షన్ మొదలయ్యింది.     ఆనంద పడాల్సిన అభిమానులు టెన్షన్ పడటానికి కారణం ఉంది. రీసెంట్ గా జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది నిరాశ్రయులుగా మిగులుతున్నారు.ఈ నేపథ్యంలోనే తమ హీరో ప్రభాస్ క్షేమంగా ఉన్నాడా లేదా అనే  ఆందోళనని వ్యక్తం చేస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తు వస్తున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్స్ కి రాజాసాబ్ దర్శకుడు 'మారుతి'(Maruthi) స్పందించాడు. ఫ్యాన్స్ ట్వీట్స్ కి బదులిస్తూ ప్రభాస్ క్షేమంగానే ఉన్నాడు. పైగా భూకంపం సంభవించిన ప్రాంతంలో లేడు. కొద్దిసేపటి క్రితమే ప్రభాస్ తో మాట్లాడాను అని ట్వీట్స్ చెయ్యడంతో  ఫ్యాన్స్ లో టెన్షన్ తగ్గినట్లయ్యింది.     also read:  అఖండ 2 కి చెన్నై హైకోర్టు గ్రీన్ సిగ్నల్      ఇక రాజాసాబ్ తో పాన్ ఇండియా సెల్యులాయిడ్  పై ప్రభాస్, మారుతీ ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ జోనర్ లో చేస్తుండటంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రభాస్ వింటేజ్ లుక్ లో  కనిపిస్తుండటం కూడా అభిమానులకి, ప్రేక్షకులకి అదనపు బోనస్. దీంతో  వచ్చే ఏడాది  జనవరి 9 కోసం అందరు వెయిటింగ్.      
  ఇంతవరకు డ్యూయల్ రోల్ చేయని మహేష్! ఇప్పుడు వారణాసిలో ఏకంగా ఐదు పాత్రల్లో సర్ ప్రైజ్!   హీరోగా రెండున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో మహేష్ బాబు(Mahesh Babu) డ్యూయల్ రోల్ చేయలేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. 'నాని' సినిమాలో మాత్రమే కాసేపు డ్యూయల్ రోల్ లో కనిపించాడు. ఫుల్ లెంగ్త్ లో ఇంతవరకు నటించలేదు. అలాంటి మహేష్ బాబు.. ఇప్పుడు రెండు పాత్రల్లో కాదు, ఏకంగా ఐదు పాత్రల్లో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   మహేష్ బాబు, రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో 'వారణాసి'(Varanasi) అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.    'వారణాసి'లో మహేష్ రుద్ర అనే పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్రకి సంబంధించిన లుక్ ఆకట్టుకుంది. అలాగే ఇందులో శ్రీరాముడిగా కూడా మహేష్ కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రలతో పాటు.. మరో మూడు పాత్రలలో మహేష్ కనువిందు చేయనున్నాడట. అందులో ఒకటి శివుడి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. మిగతా రెండు పాత్రలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయట. ఒక్కో పాత్రలో మహేష్ కనిపించే తీరు సర్ ప్రైజ్ చేయడం ఖాయం అంటున్నారు.   Also Read: ఆ హీరోయిన్ తో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రెండో పెళ్లి..!   ఈ జనరేషన్ లో ట్రిపుల్ రోల్ చేయడమే అరుదు అయిపోయింది. అలాంటిది మహేష్ ఏకంగా ఐదు పాత్రలో కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. పైగా దర్శకుడు రాజమౌళి కాబట్టి.. ప్రతి పాత్రని ఎంత గొప్పగా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.    'వారణాసి'లో మహేష్ ఐదు పాత్రలు పోషిస్తున్నాడనే వార్త నిజమైతే మాత్రం.. ఇది అభిమానులకు బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.  
- ప్రభాస్ ఎంట్రీ  ఎలా ఉంటుందంటే..? -  ఆ సెట్ సినిమాలో కీలకం - ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అదుర్స్   బాహుబలి సిరీస్‌, సలార్‌, కల్కి వంటి భారీ బ్లాక్‌బస్టర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా హీరోగా తన రేంజ్‌ ఏమిటో చూపించిన ప్రభాస్‌(Prabhas).. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్‌, యానిమల్‌ వంటి వైల్డ్‌  రేంజ్‌ హిట్స్‌తో దేశాన్ని ఉర్రూతలూగించిన డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందీ అంటే అది ఎలా ఉంటుంది అనేది ఊహించడం చాలా కష్టం. ఈ సినిమా టైటిల్‌ని కూడా ఎవరికీ ఊహకందని విధంగా ‘స్పిరిట్‌’(Spirit) అని ఫిక్స్‌ చేశారు. ఈ రేర్‌ కాంబినేషన్‌లో రూపొందే సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేశారు. మొత్తానికి ‘స్పిరిట్‌’ చిత్రాన్ని గత నెల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. నవంబర్‌ నెలాఖరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా ప్రారంభించారు.    Also Read: అఖండ 2 కి చెన్నై హైకోర్టు గ్రీన్ సిగ్నల్    ప్రభాస్‌ కెరీర్‌లోనే ఫస్ట్‌టైమ్‌ ఒక పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ‘స్పిరిట్‌’ చిత్రంలో కనిపించబోతున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. కానీ, సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ రావడం లేదని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ‘స్పిరిట్‌’ నుంచి వచ్చిన అప్‌డేట్‌ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించేలా ఉంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక భారీ పోలీస్‌ స్టేషన్‌ సెట్‌ను నిర్మిస్తోంది చిత్ర యూనిట్‌. సినిమాలో   సెట్‌ బ్యాక్‌డ్రాప్‌గా ఉండడమే కాకుండా కథలో కీలకంగా నిలబోతోందని తెలుస్తోంది.    Also Read: ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!   సాధారణంగా టాప్‌ హీరోల సినిమాల్లో వారి ఎంట్రీ స్పెషల్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తారు డైరెక్టర్లు. ఇక సందీప్‌రెడ్డి విషయానికి వస్తే.. అతనొక విభిన్నమైన డైరెక్టర్‌. అతని సినిమాల్లో హీరోలు ఎంత వైల్డ్‌గా బిహేవ్‌ చేస్తారో తెలిసిందే. అందుకే హీరోల ఎంట్రీ కూడా అంతే వైల్డ్‌గా ఉంటుంది. ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌ది పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌. దానికి తగ్గట్టుగానే ఎంట్రీని ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లోనే ప్రభాస్‌పై ఒక అమేజింగ్‌ సాంగ్‌ని చిత్రీకరించబోతున్నారు. ఈ పాటతోనే ప్రభాస్‌ ఎంట్రీ ఉంటుందట.   Also Read: ‘టాక్సిక్‌’ రిలీజ్‌ డేట్‌ మరోసారి ఫిక్స్‌.. మొదలైన కౌంట్‌డౌన్‌!   ప్రభాస్‌ని ఫస్ట్‌టైమ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చూపిస్తున్న సందీప్‌.. అతని క్యారెక్టర్‌ని ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశారని తెలుస్తోంది. పోలీస్‌ స్టేషన్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ప్లాన్‌ చేశారట. ఈ సెట్‌ కూడా ఎంతో నేచురల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్‌ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఫ్యాన్స్‌లో ఒక క్లారిటీ వచ్చింది. అయితే దాన్ని స్క్రీన్‌ మీద ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారు అనే దానిపై ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. ఇప్పటివరకు ప్రభాస్‌ చేసిన యాక్షన్‌ మూవీస్‌లో ‘స్పిరిట్‌’కి తప్పకుండా ప్రత్యేకత ఉంటుంది అనేది అందరి అభిప్రాయం. 
The makers of Toxic: A Fairy Tale for Grown-Ups have officially kicked off the countdown to its grand release on March 19, 2026, with exactly 100 days remaining. The film, already one of the most anticipated releases of 2026, continues to generate buzz with each update. To heighten the excitement, the team has revealed a powerful new poster showcasing Rocking Star Yash in an intense avatar. In the poster, Yash presents a sexy, rugged look while posing in a bloody bathtub, flexing his chiselled biceps. Although his face is not visible, he gazes outside, illuminated by a streak of light.  His body is adorned with tattoos, delivering a perfect badass vibe that hints at his character. Fans have been eagerly praising this striking image. Toxic is set to release during a significant festive period, overlapping with Gudi Padwa, Ugadi, and Eid, which offers a strong four-day holiday box-office window. Along with the poster, the team spotlighted the accomplished technicians shaping the film’s ambitious vision. The cinematography is led by National Award winner Rajeev Ravi, while the music is composed by Ravi Basrur, known for his previous collaboration with Yash on KGF.  Ujwal Kulkarni oversees the editing, and TP Abid is in charge of production design. Bringing an international touch, Hollywood action director JJ Perry—celebrated for his work on John Wick along with National award winning action director Anbariv have crafted some of the film’s most significant action sequences. Written by Yash and Geetu Mohandas and Directed by Geetu Mohandas, Toxic has been filmed simultaneously in English and Kannada and will also be dubbed in Hindi, Telugu, Tamil, Malayalam, and more. The film is being produced by Venkat K. Narayana and Yash under KVN Productions and Monster Mind Creations. 
3 Idiots is one of the biggest cult classics of Indian Cinema. Rajkumar Hirani and Aamir Khan have joined hands to deliver an epic that showcased how the education system is not encouraging analytical and critical thinking in India. Now, they both are back with an interesting idea for sequel 3 Idiots 2.  Vidhu Vinod Chopra will also be back to produce the film state reports after a fall-out with Rajkumar. Now, the reports suggest that the film is going to take off 15 years after the events of the original film with each one becoming parents. Kareena Kapoor will be back as leading lady opposite Aamir.  The adulting and parenting issues that men and women go through in recent society, mainly, with focus on parenting, will be discussed in the film, state reports. Also, it is stated that as Aamir and Hirani dropped the idea to make Dadasaheb Phalke biopic, the writer-director has worked on this sequel idea and completed scripting.  Aamir Khan is said to be highly excited about this idea and he will go through discussions with Hirani further to consolidate the timeline of production and other logistics. Madhavan, Sharman Joshi will return as friends of Aamir and how this story will be unraveled is interesting to watch on big screens, state reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
        -ఇక బాలయ్య జాతర స్టార్ట్  -కోర్టు గ్రీన్ సిగ్నల్  -కాసేపట్లో నిర్మాతల మీడియా సమావేశం      గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)అభిమానులకి, మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. అఖండ 2 కి ఉన్న అవరోధాలు తొలగిపోయాయి. డిసెంబర్ 5 న విడుదల కాకుండా అఖండ 2 పై స్టే ఇచ్చిన చెన్నై హైకోర్టు రీసెంట్ గా అఖండ 2 కి సంబంధించిన తీర్పుని వెల్లడి చేసింది.     కేసుని పరిశీలించిన పిదప అఖండ 2 పై  ఉన్న కేసు కొట్టివేస్తూ రిలీజ్ కి అనుమతి ఇస్తు తన తీర్పుని వెల్లడి చేసింది. దీంతో అడ్డంకులు తొలిగిపోవడంతో  నిర్మాతలు కాసేపట్లో రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ నెల 12 న విడుదల కాబోతునట్టుగా టాక్. మరి   11 నుంచే ప్రీమియర్ షోస్ తో అభిమానుల జాగరణ ప్రారంభం కావడం ఖాయం.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు. కానీ చాలా బంధాలు విచ్చిన్నం అవ్వడానికి,  వివాహం నిలబడకపోవడానికి కారణం వారి ఆలోచనలే అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. కేవలం వయసు చూసి పెళ్లి చేయడం సరికాదని, కొన్ని లక్షణాలు వచ్చాకే పెళ్ళి చేయాలని   అంటున్నారు. ఈ లక్షణాలు ఉంటే ఇక పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదట.   వయసు కాకుండా పెళ్లి  చేసుకోవడానికి ఉండాల్సిన  ముఖ్యమైన లక్షణాలు ఏంటి? తెలుసుకుంటే.. నేను కాదు మనం.. పెళ్లి అంటే కేవలం ఇంకొక వ్యక్తితో కలిసి జీవించడం మాత్రమే కాదు, అది  జీవితాన్ని వేరొకరితో పంచుకోవడం. పెళ్లి చేసుకోవడాన్ని కేవలం  స్వంత ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా వచ్చే భాగస్వామి, వారి  కుటుంబాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. పెళ్లి చేసుకోవడం అంటే ప్రతిది తనకు నచ్చినట్టు,  తను కోరుకుంటున్నట్టు ఉండేది కాదు.. అందరికీ నచ్చినట్టు, అందరూ కలిసి ఉండేలా ఉండాలి.  చేతిలో ఒక్క పండు ఉన్నా దాన్ని ఒక్కరే కాకుండా అందరూ కలిసి పంచుకుని తినాలి అనే మనస్తత్వం ఉండాలి. ఇలా ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఒక లక్షణం ఉన్నట్టే. సమస్యలు, పరిష్కారాలు.. వివాహం అయ్యాక భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా వస్తాయి. కానీ చాలామంది వాటిని పరిష్కరించడంలో విఫలం అవుతారు.  భార్యాభర్తల మధ్య సమస్య లేదా గొడవ వస్తే కోపం చేసుకుని దాన్ని పెంచుకోవడానికి బదులు దాన్ని ఎలా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనేది తెలిసి ఉండాలి.  సాధారణంగా సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు కలిగి ఉంటే వివాహ బంధంలో కూడా అది చేయగలుగుతారు. తప్పు చేసినప్పుడు ఒప్పుకునే స్వభావం కూడా ఉండాలి. అలాగే ఎదుటివారు తప్పు చేసినప్పుడు దాన్ని క్షమించగలిగే మనసు కలిగి ఉండాలి. ఇలా ఉంటే ఒక మంచి లైప్ పార్టనర్ అవుతారు. వాస్తవ జీవితం.. చిన్నతనం నుండి కొన్ని కలలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమాలు, టీవీలు,  పుస్తకాల ప్రబావం వల్ల భాగస్వామి గురించి,  వివాహం తర్వాత జీవితం గురించి చాలా డ్రీమ్స్ పెట్టుకుంటారు. కానీ నిజానికి వివాహం తర్వాత జీవితంలో కలలను వెతక్కూడదు.  వాస్తవిక జీవితంలోనే బ్రతకాలి. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా ఉండరు. అలాగే జీవితంలోకి వచ్చే వ్యక్తి గురించి చాలా ఆశలు, అంచనాలు పెట్టుకోకూడదు.  వాస్తవాన్ని, వ్యక్తి ఎలా ఉంటారో దాన్నే అంగీకరించాలి.  యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఈ లక్షణం ఉంటే జీవితంలో అసంతృప్తి ఫీలవడం చాలా తక్కువ. మంచి భాగస్వామి కాగలుగుతారు. ఆర్థిక బాధ్యతలు.. వివాహానికి ముందు వివాహం తర్వాత ఆర్థిక విషయాలలో చాలా మార్పులు వస్తాయి.  ఒక్కసారిగా భార్యాభర్తల ఇద్దరి మీద బాధ్యతలు పెరుగుతాయి.  ఖర్చులు ఎలా చేయాలి? దుబారా ఎలా తగ్గించాలి? భవిష్యత్తు కోసం పొదుపు ఎలా చేయాలి? ఇవన్నీ ఆలోచించేవారు,  వీటిని ఎలా నిర్వహించాలి అనే విషయం తెలిసిన వారు అయితే కుటుంబాన్ని పోషించే క్వాలిటీ ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. సంతోషం.. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండగలగడం  పెళ్లికి సిద్దంగా ఉండే గొప్ప లక్షణం. ఇది చాలామందికి వింతగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఏ వ్యక్తి అయినా తన సంతోషం ఇతరుల మీద ఆధారపడి ఉండేలా ఉండకూడదు. పెళ్లి చేసుకోగానే తాము ఇతరుల సంతోషమే చూడాలి అనుకోవడం చాలా తప్పు. ఎవ్వరూ లేకపోయినా తాను సంతోషంగా ఉండగలను అనే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో అయినా తనను తాను సంతోషంగా ఉంచుకునే వ్యక్తి ఇతరులను సంతోష పెట్టడంలో ఎప్పుడూ విఫలం కారు.  కష్టాలు.. బాలెన్సింగ్.. ఒంటరిగా ఉన్నా, జంటగా ఉన్నా జీవితం ఎప్పుడూ సులువుగా ఉండదు. కాకపోతే జంటగా ఉన్నప్పుడు సవాళ్లు, సమస్యలు, కాస్త ఎక్కువ ఉంటాయి.  అయితే అలాంటివి ఫేస్ చేయడానికి బంధంలో మరొకరు కూడా తోడుగా ఉంటారు. జీవితంలోకి వచ్చే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నా,  ఆర్థిక సమస్యలలో ఉన్నా, కుటుంబ సమస్యలతో ఉన్నా, పరిస్థితులు ఏవైనా సరే.. అన్ని సమయాలలో ఓపికతో కలిసి ఉండే ధైర్యం,  అన్నింటిని అధిగమించే నైపుణ్యం కలిగి ఉండాలి.  ఈ లక్షణం కూడా కలిగి ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేనట్టే.. పైన చెప్పుకున్న లక్షణాలు అన్నీ ఉన్నవారు పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ పైన చెప్పుకున్న లక్షణాలు లేకపోతే మాత్రం వయసు వచ్చినా సరే.. పెళ్లి చేసుకోవడానికి  మీరు కరెక్ట్ కాదని అర్థం. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీ వల్ల మీ లైఫ్ లోకి వచ్చే భాగస్వామి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  కొన్ని పరిస్థితులలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు,  విడిపోవడానికి దారితీసే గొడవలు కూడా రావచ్చు.                                  *రూపశ్రీ.
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి. అయితే గొడవలు కూడా ఆరోగ్యంగా  ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. కానీ నేటి కాలంలో చాలా వరకు భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేసే విదంగా గొడవలు జరగడం చూస్తుంటాం.  అసలు భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? తెలుసుకుంటే.. భార్యాభర్తల మధ్య వాదనలు, గొడవలు జరుగుతూ ఉంటాయి.  అవన్నీ నిజంగా బంధాన్ని బలపరుస్తున్నాయా లేదా అనే విషయాన్ని గమనించుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినా అది ఆరోగ్యకరంగా ఉండాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ అబిప్రాయాలను ఓపెన్ గా చెప్పుకోవాలి.  అది వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసేలా కాకుండా సమస్యపై దృష్టి పెట్టేలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బంధం విచ్చిన్నం కాకుండా బంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ వాదించుకున్న తర్వాత జరిగిన విషయం గురించి ఇద్దరూ లోతుగా  ఆలోచించాలి.  ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి గొడవ తర్వాత భార్యాభర్తలు తమ భాగస్వాములను మరింత అర్థం చేసుకోగలిగితే,  సమస్య ఎందుకు వచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ బంధం ఆరోగ్యకరంగా ఉంటుంది. భార్యాభర్తల మద్య గొడవ ఏదైనా అనుమానం, హింస,  కోపం, నియంత్రించడం,  భయపెట్టడం వంటి విషయాల ద్వారా చోటు చేసుకుంటే అది బార్యాభర్తల మద్య బంధాన్ని నాశనం చేస్తుంది. భార్యాభర్తల మధ్య  ఎన్ని గొడవలు జరిగినా అది చివరికి పరిష్కారం అవ్వాలి.  అలా ఉన్నప్పుడే ఆ బందం అందంగా, ఆనందంగా ఉంటుంది.  భార్యాభర్తలు కూడా ఇలాంటి గొడవల వల్ల దూరం కాకుండా ఉంటారు.  కానీ గొడవలు నిరంతరం జరుగుతూ పరిష్కారం మాత్రం జరగకపోతే ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవవు.                                  *రూపశ్రీ.
  అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది.  దీనికి కారణం కేవలం బయట సమాజంలో కాదు.. ఇద్దరు వ్యక్తుల మద్య అభద్రతాభావం.  తమ స్థానం ఎక్కడ బలహీనం అవుతుందో అని అత్తగారు,  తనకు తన మాటకు ఎక్కడ విలువ లేకుండా పోతుందో అని కోడలు ఇద్దరూ తమ తమ పంతాలకు పోవడం వల్ల అత్తాకోడళ్ల మధ్య విభేదాలు వస్తుంటాయి. అయితే కొన్ని మ్యాజిక్ చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల అత్తాకోడళ్ల బంధం ఎంతో పదిలంగా,  బలంగా,  సంతోషంగా ఉంటుంది.  ఆ  మ్యాజిక్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. నేటి కోడలే రేపటి అత్తగారు, ఇప్పటి అత్తగారు ఒకప్పుడు కోడలు  అనే మాట వినే ఉంటారు. అత్తగారి జీవితంలో అంచనాలు ఉంటాయి,  అనుభవాలు ఉంటాయి. కానీ కోడలి జీవితంలో ఆధునికత,  కలలు,  భవిష్యత్తు గురించి ఆశలు ఉంటాయి.  ఇవి రెండూ విరుద్దంగా అనిపిస్తాయి. అందుకే అత్తాకోడళ్ల మధ్య వ్యతిరేకత తలెత్తుతూ ఉంటుంది. అంచనాల గురించి ఓపెన్ గా.. కోడలి మీద అత్తకు, అత్త గురించి కోడలికి కొన్ని అంచనాలు ఉంటాయి.  అయితే విషయాన్ని మనసులో పెట్టుకుని ఎదుటి వారు,  వారికి వారే అర్థం చేసుకుని తమకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం పిచ్చితనం. ఇంటి బాధ్యతలు కోడలితో ఏవి పంచుకోవాలని అనుకుంటారో అత్తగారు ఓపెన్ గా చెప్పాలి. అలాగే కోడలు కూడా తన కెరీర్,  ప్రాధాన్యాల గురించి ఓపెన్ గా తన అత్తగారితో చెప్పాలి.  ఎందుకంటే అంచనాలు నెరవేరకపోతే అత్తాకోడళ్ల బంధం దెబ్బతింటుంది. అందుకే ముందే ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటే మంచిది. ప్రేమతోనే సరిహద్దులు.. అత్తాకోడళ్లు ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోవడం వల్ల చాలా గొడవలు జరుగుతుంటాయి.  చాలా సార్లు అత్తలు తమ ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తారు. కానీ అత్తాకోడళ్లు ప్రేమగానే మాట్లాడుకుని తమ సరిహద్దులు విధించుకుంటే చాలా వరకు గొడవలు రాకుండా ఉంటాయి. కానీ ఇద్దరూ ఒకరి విషయాలలో మరొకరు ఎక్కువ జోక్యం చేసుకుంటే పెద్ద గొడవలు జరుగుతాయి. గతం, అనుభవాలు... అత్త జీవితంలో అనుభవాలు చాలా ఉంటాయి. అలాగే కోడలి జీవితంలో అనుభవాలు ఉంటాయి. అత్తగారు తాను జీవితంలో ఎదుర్కున్న సమస్యలు, కుటుంబ పరంగా ఎదుర్కున్న కష్టాలు, చేసిన పోరాటాలు కోడలితో చెప్పుకుంటూ ఉండాలి, కోడలు తన చిన్నతనం తను పెరిగిన విధానం,  తన కష్టం,  భవిష్యత్తు గురించి తన ఆశలు చెప్పుకోవాలి. ఇవి ఇద్దరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. అంతేకాదు.. అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉంటారు.  ఆ ఇల్లు సంతోషంగా, ఎంతో బాగా అబివృద్ది చెందాలంటే అత్తాకోడళ్లు ఇద్దరూ అవగాహనతో ఉండటం ముఖ్యం.   నిర్ణయాలు.. అత్తాకోఢల్లు ఇద్దరూ ఒక్కమాట మీద ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది.  అందుకే ఏ విషయం గురించి అయినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి.  కోడలు ఇలాగే ఉండాలనే నియమాలు విధించడం అత్తగారి గొప్పతనం అనిపించుకోదు, అత్తగారు చెప్పే ఏ విషయం గురించైనా ఆలోచించకుండా వ్యతిరేకత చూపడం కోడలి తెలివి అనిపించుకోదు. అత్తాకోడళ్లు ఇద్దరూ మాట్లాడుకుని వారి ఇగో సాటిసిపై అయ్యే దిశగా కాకుండా జీవితం గురించి, ఇంచి అబివృద్ది గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పొగడ్తలు.. గొప్ప మెడిసిన్.. బంధం ఆరోగ్యంగా ఉండటంలో పొగడ్తలు చాలా గొప్పగా పనిచేస్తాయి.   అత్తగారు ఏదైనా బాగా చేసినప్పుడు కోడలు,  కోడలు ఏదైనా పనిని బాగా చేసినప్పుడు అత్తగారు.. ఒకరిని ఒకరు మెచ్చుకోవడం చేయాలి.  ఇలా మెచ్చుకోవడం ఇద్దరి మద్య బందాన్ని బలంగా మార్చుతుంది. అంతేకాదు.. ఒకరి మంచి అలవాట్లను మరొకరు మెచ్చుకోవడం, ఒకరికి ఒకరు మంచి స్నేహితురాలిగా ఉండటం వల్ల అత్తాకోడళ్ల బందం పదిలంగా ఉంటుంది.                              *రూపశ్రీ.
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది.  పరిస్థితులు, సందర్భాలు ఏవైనా మూత్రం వచ్చినప్పుడు ఆపుకుంటూ ఉంటారు. దీని వల్ల ఇబ్బంది కలిగినా గత్యంతరం లేక ఇలా చేస్తుంటారు.  అయితే ఇలా మూత్రాన్ని ఆపుకోవడం అనేది చాలా లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. దీని వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  ఇంతకూ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలేంటి? శరీరానికి కలిగే ప్రమాదాలేంటి? తెలుసుకుంటే.. చలికాలం కష్టం.. చలికాలం చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది.  వాటిలో మూత్రానికి వెళ్లడానికి బద్దకించే వారు కూడా ఉంటారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది చాలా నిజం. ఇదే కాకుండా బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా గుడి,  పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు.  ఇలా మూత్రాన్ని ఆపుకోవడం చాలా డేంజర్. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలు.. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల కలిగే చాలా పెద్ద నష్టం మూత్రంలో ఇన్పెక్షన్ ఏర్పడటం.  మూత్రం మానవ శరీరంలో ఇన్ఫెక్షన్లు తొలగించడానికి సహాయపడుతుంది. కానీ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలో ఉండే విష పదార్థాల ప్రభావం వల్ల మూత్రాశయ ద్వారం ఇన్పెక్షన్ కు లోనవుతుంది. మూత్రాన్ని ఎక్కువ సేపు పట్టి ఉంచడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.  ఇది మూత్ర పిండాల సంబంధిత  సమస్యలకు దారితీస్తుంది.   మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు చాలా ప్రముఖమైనవి. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం బలహీనంగా మారుతుంది.  మూత్రాశయ కండరాలు బలహీనం అవుతాయి.  ఇది మూత్రం లీకేజికి దారి తీస్తుంది.  ఇది చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలోని మలినాలు, విసర్జక పదార్థాలు కలిసి గట్టిపడి రాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఈ సమస్య కిడ్నీలను మరింత ప్రమాదానికి గురిచేస్తుంది.  అందుకే మూత్రాన్ని ఆపుకోవడం అస్సలు మంచిది కాదు.                                  *రూపశ్రీ.  
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం.  చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. దీనికి తగ్గట్టే మందంగా ఉన్న దుప్పటిని నిండుగా కప్పుకొని పడుకుంటారు.  ఇలా పడుకున్నప్పుడు ఏకంగా ముఖాన్ని కూడా పూర్తీగా కవర్ చేసుకుని పడుకునే వారు ఎక్కువే ఉంటారు.  దీనివల్ల ముక్కు, నోరు, చెవులకు చలితీవ్రత సోకదని అనుకుంటారు. అయితే ఇలా పడుకోవడం మంచిదేనా? దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలుసుకుంటే.. చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకోవడం అనే అలవాటు వల్ల చలి నుండి ఉపశమనం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ  ఇలా చేయడం వల్ల  కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న అదే గాలిని పదే పదే పీల్చుకుంటారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ  కార్బన్ డయాక్సైడ్ ఉన్న గాలిలో నిద్రపోవడం మెదడుకు,  శరీరానికి హానికరం. ఈ అలవాటు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల  శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది  మెదడు,  గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.  ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో ఉదయం తలనొప్పి, అలసట,  నోరు పొడిబారడం కూడా జరుగుతుందట.  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. నోటి నుండి వచ్చే తేమ దుప్పటి  బట్టలో చిక్కుకుపోతుంది. దీని వలన దుప్పటి లోపల వాతావరణం వెచ్చగా,  తేమగా ఉంటుంది. ఈ వాతావరణం ఫంగస్  పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ముఖం మీద ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల ఈ అలెర్జీ కారకాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళతాయి.  వీటి వల్ల  అలెర్జీలు,  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగుతుంది. ఆక్సిజన్ సరిగా  లేకపోవడం వల్ల  మెదడు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఉంటుంది.   మంచి, గాఢమైన నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.  ఒకవేళ నిద్ర పట్టినా ఉదయం లేవగానే తలనొప్పి, అలసట వంటివి ఏర్పడతాయి.   CO2కి అధికంగా గురికావడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును ప్రభావితం చేస్తుంది. అందుకే చలికాలంలో వెచ్చదనం కోసం ముఖాన్ని కూడా కప్పుకుని నిద్రపోవడానికి బదులు,  వెచ్చని దుస్తులు,  టోపి, కాళ్లకు సాక్స్ వంటివి ధరించి నిద్రపోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఎంత చలి ఉన్నా ఫ్యాన్ ఉండాలి,  కానీ దుప్పటి కప్పుకోవాలి అని అనుకోకూడదు.                                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...