సిద్ధిపేటలో ఏం జరిగింది? దుబ్బాకలో అసలేం జరుగుతోంది? 

Publish Date:Oct 27, 2020

Advertisement

దుబ్బాక ఉప ఎన్నిక  అధికార పార్టీని భయపెడుతోందా? బీజేపీ టార్గెట్ గా సోదాలకు కారణమేంటి? సిద్దిపేటలో దొరికిన డబ్బు ఎవరిది? రఘునందన్ రావే సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారా?. దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణలో కాక రేపుతోంది. గత రెండు రోజులుగా దుబ్బాక, సిద్దిపేటలో జరుగుతున్న పరిణామాలు కలవరం రేపుతున్నాయి. అసలు దుబ్బాకలో ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ వరకు పరిస్థితి ఎలా ఉండబోతోంది, పార్టీలు ఎలాంటి వ్యూహాలు అవలంభించబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. 

 

దుబ్బాక ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. దసరా పండుగ మరుసటి రోజే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. సిద్ధిపేటలోని రఘునందన్ రావు మామ ఇంట్లో 18 లక్షల రూపాయలు దొరికాయని, ఆ డబ్బును సీజ్ చేశామని సిద్ధిపేట సీపీ ప్రకటించారు. అయితే బీజేపీ కార్యకర్తలు మాత్రం పోలీసులపై  డబ్బులను రఘునందన్ రావు మామ ఇంట్లో పెట్టారని ఆరోపిస్తున్నారు. డబ్బుల కట్టలు ఉన్న బ్యాగు పోలీసుల చేతిలో ఉన్న వీడియో వైరల్ గా మారింది. పోలీసులు డబ్బును ఇంట్లో పెడుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు లోపలికి వెళ్లి ఆ బ్యాగును లాక్కునే విజువల్స్ బయటికి వచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఇంట్లో దొరికిన డబ్బును సీజ్ చేసి బ్యాగును బయటికి తీసుకువస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేసి కొంత డబ్బును తీసుకెళ్లారని చెప్పారు. రఘునందన్ రావు మామ ఇంట్లో దొరికిన డబ్బులో 5 లక్షల రూపాయలను కొందరు ఎత్తుకెళ్లారని సీపీ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. 
   

రఘునందన్ రావు మామ, బంధువుల ఇళ్లలో పోలీసుల దాడిని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. పార్టీ చీఫ్ బండి సంజయ్ హుటాహుటిన సిద్ధిపేటకు వచ్చినా పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లారు. అయితే పోలీసులు తనపై దాడి చేశారని సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీ తొత్తుగా మారిన జోయల్ డేవిస్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో ఆయన దీక్ష చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధిపేట వెళ్లి రఘునందన్ రావును పరామర్శించారు. పోలీసులు సోదాలు జరిగిన ఇంటిని పరిశీలించారు. సిద్ధిపేట పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రఘనందన్ రావు ఇంట్లో పోలీసుల సోదాలు, బండి సంజయ్ పై దురుసు ప్రవర్తనకు నిరసనగా చలో ప్రగతి భవన్ కు పిలుపిచ్చింది బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా కమలం కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. 

 

దుబ్బాక ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలను  బీజేపీ కేంద్ర పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్ రావుకు  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితులపై అరా తీసినట్లు చెబుుతున్నారు. పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే యోచనలో అభ్యర్థి రఘునందర్‌రావు ఉన్నట్లు తెలస్తోంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు జరపాలని బీజేపీ నుంచి డిమాండ్ వస్తున్నాయి. ఓటమి భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ చేయించిన సర్వేలో పూర్తిగా వెనకబడినట్లు తేలడంతో చిల్లర రాజకీయాలకు దిగారని మండిపడుతున్నారు. సిద్ధిపేట పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని సీపీ జోయల్ ను ఓపెన్ గానే హెచ్చరించారు అర్వింద్. 

 

మరోవైపు సిద్ధిపేట ఘటనపై టీఆర్ఎస్ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. మూడోసారి కూడా డిపాజిట్‌ దక్కదని భావించి రఘునందన్‌ కొత్త రాజకీయ నాటకాలకు తెరతీశారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆయనపై నమ్మకం లేక గ్రామాల బీజేపీ కమిటీలకు కమిటీలే టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నాయని చెప్పారు. దొంగ రాజకీయాలు చేస్తున్న రఘునందన్‌ ట్రాప్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి,  బండి సంజయ్‌ పడిపోయారన్నారు హరీష్ రావు. రఘునందన్‌ బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని పోలీస్‌ కమిషనర్‌ చెప్పారని చెప్పారు. దీనిపై వీడియో ఫుటేజీలు బయటపెడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు హరీష్ రావు. రాజకీయ సానుభూతి కోసం రఘునందన్ నాటకాలు ఆడుతున్నారాని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయని.. సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ ఇంట్లో పోలీసులు బెడ్‌ను చింపి మరీ సోదాలు చేశారని చెప్పారు. అంగీ, లాగులు చింపుకొని టీఆర్‌ఎస్‌ వాళ్లే చింపారని ఆరోపించే స్థాయికి బీజేపీ వాళ్లు వచ్చారని హరీశ్‌ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించి పోలీసులు పట్టుకున్న డబ్బును లాక్కుపోయారన్నారు. తప్పు చేయనివారైతే పోలీసులకు సహకరించాలని సూచించారు హరీష్ రావు.

 

పోలీసుల సోదాలు, డబ్బులు సీజ్, బీజేపీ ఆందోళనలు, టీఆర్ఎస్ కౌంటర్లతో దుబ్బాక రాజకీయ గరంగరంగా మారింది. నియోజకవర్గంలో ఏం జరుగుతుంది.. పోలింగ్ నాటికి ఏం జరగబోతుందన్న ఆందోళన జనాల్లో కనిపిస్తోంది. అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్లే పోలీసులను ఉపయోగించి  గట్టెక్కాలనే ప్రయత్నాలు చేస్తుందో అనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. పోలీసుల సోదాలతో టీఆర్ఎస్ పై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది బీజేపీకి లాభించవచ్చని కూడా వారు అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తోంది. కాంగ్రెస్ పుంజుకోవడంతో రెండు పార్టీలు డ్రామాకు తెర తీశాయని హస్తం నేతలు చర్చించుకుంటున్నారు.

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.