అధికార లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు.. రాజకీయాలను పక్కన పెట్టి చంద్రబాబు నిర్ణయం.!

Publish Date:Jul 15, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు సామాజిక ఉద్యమాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో   అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది. మంగళవారం (జులై 14) సాయంత్రం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో  ముద్రగడ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్..  ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని,  అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులను అలంకరించిన ముద్రగడ, నిరంతరం ప్రజా సమస్యలపై గొంతుక వినిపించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అత్యున్నత గౌరవ మర్యాదలతో ఆయన అంతిమ యాత్రను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ముద్రగడ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం ముద్రగడ చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన అన్నారు. 

ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం అత్యంత వైవిధ్యభరితంగా సాగింది. 1978లో జనతా పార్టీ ద్వారా శాసనసభ్యుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తదనంతరం తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాలంలో ఎన్టీఆర్ పిలుపు అందుకొని ఆ పార్టీలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి వరుస విజయాలు సాధించి రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలలో కూడా కీలక పాత్రలు పోషించారు. 1999లో కాకినాడ లోక్‌సభ స్థానం నుండి పార్లమెంట్‌కు కూడా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరినప్పటికీ..  రాజకీయాలకు అతీతంగా ఆయన సేవలను గౌరవించాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. రాజకీయాలను పక్కన పెట్టి ముద్రగడ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని హైదరాబాద్ నుండి ఆయన సొంత గ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి తరలించారు. ఈ వార్త తెలియడంతో ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు కాపు సామాజిక వర్గ ప్రతినిధులు భారీ సంఖ్యలో కిర్లంపూడికి తరలివస్తున్నారు. ఆయన నివాస పరిసర ప్రాంతాలన్నీ శోకసంద్రంలో మునిగిపోయాయి. తమ ప్రియతమ నేతను ఆఖరిసారిగా చూసుకునేందుకు ప్రజలు బారులు తీరడంతో స్థానిక యంత్రాంగం భారీ రక్షణ చర్యలను చేపట్టింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు బలగాలను మోహరించారు.

ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ప్రకటించడంతో, పోలీస్ శాఖ ప్రత్యేక గౌరవ వందనం (గన్ సెల్యూట్) సమర్పించడానికి సన్నాహాలు చేస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా కిర్లంపూడిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఒక సామాజిక ఉద్యమకారుడిగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తికి తగిన రీతిలో వీడ్కోలు పలకడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. ముద్రగడ మృతి అనేది కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎందరో వెనుకబడిన వర్గాల ప్రజలకు తీరని లోటని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 Mudragada Padmanabham Last Rites, Chandrababu Naidu State Honours Mudragada, Pawan Kalyan Mudragada Demise, Kapu Leader Mudragada Passed Away 

By
en-us Political News

  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.