ఆరు నెలల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్!

Publish Date:Nov 28, 2024

Advertisement

రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే పనులు ఎంత శరవేగంగా సాగుతాయో, ప్రజా ప్రయోజనాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఎంత చక్కగా ఉంటుందో ఐదు నెలల తెలుగుదేశం కూటమి పాలనలో ప్రజలకు చక్కగా అర్ధమౌతోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు హామీని నెరవేర్చే విషయంలో తెలుగుదేశం కూటమి సర్కార్ అడుగులు ఎంత వేగంగా పడుతున్నాయో  చెప్పడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ చేసిన ప్రకటనే సాక్ష్యం. ఆరు నెలలలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటౌతుందని ఆయన వెల్లడించారు. 

అదే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అంటూ ఓ అసంబద్ధ ప్రతిపాదనలో జగన్ ముందుకు వెళ్లారు. అప్పటికే 70 శాతం వరకూ పూర్తైన అమరావతి నిర్మాణాలను నిలిపివేశారు. అమరావతిని నిర్వీర్యం చేశారు. పోనీ మూడు రాజధానుల విషయంలో ఒక్కటంటే ఒక్క అడుగైనా ముందకు వేయగలిగారా అంటే అదీ లేదు. కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించిన జగన్ తన హయాంలో ఆ దిశగా ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదు. శాసన రాజధాని అని చెప్పిన అమరావతినీ పాడుపెట్టారు. ఇక విశాఖ విషయానికి వస్తే అక్కడ రుషికొండకు గుండు కొట్టి తన కోసం ప్యాలెస్ నిర్మించుకోవడం వినా రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేసింది లేదు. 

కానీ తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ అమరావతే ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అని ప్రకటించి.. ఆ దిశగా కార్యాచరణ చేపట్టింది. జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేసింది. నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియకు సిద్ధమైంది.  కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం అన్వేషణ ఆరంభించారు.  త్వరలోనే ప్రక్రియను పూర్తి  కాబోతోంది.  జగన్ సర్కార్ కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌గా చేస్తామని హామీ ఇచ్చి  మోసం చేస్తే, తెలుుదేశం కూటమి సర్కార్  హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది.  కర్నూలులో హైకోర్టు బెంచ్ శాశ్వత భవన నిర్మాణానికి ఏడాదిన్న సమయం పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలిక భవనంలో హైకోర్టు బెంచ్ ను ఆరు నెలలలోగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే అర్ధ సంవత్సరంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోంది. అదే సమయంలో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలు కూడా కర్నూలులోనే కొనసాగనున్నాయి. కర్నూలు ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది.

చిత్తశుద్ధితో, సంకల్పంతో పని చేస్తే పనులు ఎంత వేగంగా సాగుతాయన్నదానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉదాహరణగా నిలుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి నిర్మాణమే కాదు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పట్టాలెక్కాయి. నిర్దుష్ట కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి కానున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడాన్ని వారు ఇందుకు తార్కానంగా చూపుతున్నారు. 
 

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.