Publish Date:Feb 15, 2026
ఈ సంక్రాంతి సందర్భంగా మన శివశంకర వరప్రసాద్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈ తరానికి కూడా తెలిసిన విషయం.. అది చిరంజీవి అసలు పేరని. అందులోంచి శివ.. ఆపై తన పేరులోని రామ్ ని కలిపి రామ్ చరణ్ తన కొడుకు పేరు శివరామ్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది. దానికి తోడు శివరాత్రికి ముందు పుట్టిన కవలపిల్లల్లో ఒకడు కావడంతో.. శివ శబ్ధం చేర్చినట్టు కనిపిస్తోంది. ఇక శివరామ్ తో పాటు పుట్టిన మరో పాపాయికి అన్విరాదేవి అని పేరు పెట్టారు. అన్విరా దేవి అర్ధమేంటో చూస్తే.. బుద్ధిని ప్రసాదించే దేవతా లేదంటే సత్యం వైపు నడిపే దిక్సూచీ అని తెలుస్తోంది.
తొలి గా పుట్టిన కుమార్తెకు క్లింకారా అని పేరు పెట్టింది రామ్ చరణ్, ఉపాసన జంట. క్లింకార అంటే లలితా సహస్రనామాల్లో ఒకటిగా అప్పట్లో చెప్పారు.అయితే కూతుళ్లు ఇద్దరి పేర్లు తల్లి ఉపాసన పేరు ఎంతటి గంభీరమైనదో.. అంత గంభీరంగా ఉండగా.. కొడుకు పేరు మాత్రం జనసామాన్యంలో బాగా తెలిసిన తన తండ్రి, తాతయ్యల పేర్లను పోలిన పేర్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ శివరాత్రి సందర్భంగా ఆ శివుడ్ని తలుచుకునే విధంగా చిరంజీవి మనవడి పేరు ఉండటం అదో పుణ్య ప్రదంగా భావిస్తున్నారు పలువురు అభిమానులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hero-ram-charans-sons-name-36-214117.html
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.