ఉదయాన్నే గుండెపోటు ఎందుకు వస్తుంది??

Publish Date:Feb 23, 2022

Advertisement

 

గత కొన్ని ఏళ్లుగా అంటే 2౦14 నుండి 2౦19 వరకు గణనీయం గా గుండె పోటు తో మరణిస్తున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.ముఖ్యంగా గుండె పోటు తో మరణిస్తున్న వారిలో చలా మంది సెలబ్రటీ లు ,రాజ కీయ నాయకులు ఉండడం గమనార్హం అయితే వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్న గుండెపోటుకు కారణాలు ఏమిటి? ముఖ్యంగా గుండెపోటు ఉదయం 7 గం నుండి 11 గంటల మధ్యలోనే ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏమిటి ? అన్న సందేహం వస్తుంది. అదీకాక ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఉదయం వేళ్ళల్లో జిమ్ చేస్తున్నప్పుడు కుప్ప కూలిపోవడం  లేదా జిమ్ చేసిన తరువాత హార్ట్ ఎట్టాక్ గుండెపోటు రావడం గమనించవచ్చు .మరొక కోణం చూసినప్పుడు పోస్ట్ కోవిడ్ వచ్చిన వాళ్ళకు గుందేపోటుకు గురికావడం మరొక కోణం గా చెప్పవచ్చు.అసలు పోస్ట్ కోవిడ్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అప్రమత్తం గా ఉండాలని వైద్యులు సూచించక పోవడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గుండెపోటు వచ్చి నట్లయితే తక్షణం ఎలాంటి చికిత్స అందించాలి అన్న అంశం పై కోవిడ్ రోగులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత చికిత్స చేసిన డాక్టర్లదే కదా. అసలు కోవిడ్ బారిన పడిన తరువాత శరీరం పై ఎలాంటి మార్పులు వస్తాయి? ముఖ్యంగా ఊపిరి తిత్తుల లో ఇబ్బందులు వచ్చి,ఆతరువాత శరీరంలోని రక్త నాళాలు ఎలా బలహీన పడే అవకాశం ఉంది? ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ అందక పోవడం తద్వారా గుండెనుండి మెదడుకు చేరాల్సిన రక్త ప్రసారం లో ఇబ్బందులు వస్తున్నాయా? ఇది కోవిడ్ తరువాత వచ్చే పరిణామం గా చెప్పవచ్చ.వీటి అన్నిటి సామగ్ర సమాధానం వెతికే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.

గుండె పోటు హార్ట్ అట్టాక్...

గుండె కండరానికి రక్తాన్ని తీసుకు వెళ్ళే కరోనరీ ధమనిలో ఎదో ఒక భాగం లో లేదా కొన్ని భాగాలాలో కొవ్వు గాని, రక్తపు గడ్డ కాని పేరుకుని ఆమార్గం పూర్తిగా మూసుకు పోయి నప్పుడు రక్త ప్రవాహానికి ఆటంకం కలిగి అక్కడ రక్త సరఫరా నిలిచిపోతుంది.దానితో రక్త సరఫరా నిలిచిపోయిన గుండె కండరం లోని కొద్ది భాగం నిరుపయోగం అయిపోతుంది. దీనిని వైద్య పరిభాషలో మై కార్దియల్ఇంఫ్రాక్షన్ అని అంటారు. ఆసమయంలో వ్యక్తిలో కలిగే  లక్షణాలని బట్టి మనం గుండె పోటు అని అంటున్నాము.గుండె పోటు వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు...గుండె పోటు సమయంలో తగిన జాగ్రత లు తీసుకుంటే మనిషి బతికి బయట పడితే మెత్తగా అయిన గుండె కండరం కొన్ని వారాలకు మచ్చలాఅయి క్రమేపి తరువాత గట్టి పడిపోతుంది.

హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు ఎలాంటి బాధ ఉంటుంది...

హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు మనుషులు బాధ పడే విధానాలు వేరు వేరుగా ఉన్నా కూడా ఆ సమయాన సహజంగా కనిపించే ముఖ్య లక్షణం.చాతిలో నొప్పి ఇంగ్లాండ్ లో ప్రతియేటా 2,5౦,౦౦౦ మంది గుండె పోటు కు గురిఅవుతున్నట్లు అంచనా. వారిలో 1,6౦.౦౦౦ మంది మృత్యు వాత పడుతున్నారు.అమెరికాలో ప్రతి ముగ్గురిలోనూ ఒకరు గుండె పోటు కు గురి అవుతున్నారు. అభివృ ద్ది చెందిన దేశాలలో మనుషుల మరణాలకు గుండె పోటు ముఖ్య కారణంగా ఉంటుందంటే అతిశయం కాదు వాస్తవం అని అంటున్నారు నిపుణులు.గుండె చుట్టూ ఉండే కరోనరీ ధమనులలో ఏ ఒకాటన్నా బ్లడ్ క్లాట్ మూలంగా పూడుకు పోయినప్పుడు గుండె కవాటానికి వెళ్ళాల్సిన ముఖ్యమైన రక్త సరఫరా ఆగిపోయి గుండె కండరపు కణజాలం నసిన్చిపోతుంది.

 

గుండె పోటు లక్షణాలు / చాతి నొప్పి తీవ్రతకు గుండె పోటు తీవ్రతకు సంబంధం ఉందా? సడన్ గా చాతి మధ్య భాగం లో నొప్పి రావడం. హార్ట్ అట్టాక్ ముఖ్య లక్షణం.నొప్పి యాంజైనాలో లాగానే చాతీ మీద బరువుగా ఉన్నట్లు నొక్కి పెడుతున్నట్లు గా ఉండవచ్చు.యాంజైనా నొప్పి పది ఇరవై నిమిషాల లోపు తగ్గిపోతుంది. అలాగే చేస్తున్న పనిని ఆపేసి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది.కాని హార్ట్ అట్టాక్ నొప్పి అలా కాదు.రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కూడా రావచ్చు రాగానే రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గదు. విడవకుండా అరగంట దాకా నొప్పి వచ్చిందంటే దానిని పూర్తి స్థాయి హార్ట్ అట్టాక్ కింద తీసుకోవచ్చు.చాతి భాగాన తిమ్మిరి ఎక్కుతున్నట్లు లేక సూదితో పొడుస్తున్న అనుభూతి ఉంటుంది.నొప్పి క్రమంగా భుజాలకు,మెడ వైపుకు,చేతులకు వ్యాపించ వచ్చు.

ముఖ్యంగా నొప్పి ఎడమ భుజం నుంచి వ్యాపించి మోచేయి వద్ద ఆగిపోవచ్చు.నొప్పి తీవ్రంగా ఉంటె తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లుగా అనుకోవాల్సి న పనిలేదు. ఒక్కోసారి స్వల్పమైన నోప్పి తో నే తీవ్రమైన గుండెపోటు రావచ్చు. కాబట్టి చాతి నొప్పి తీవ్రతకు గుండె పోటు తీవ్రతకు సంబంధం లేదు.కొన్ని సందర్భాలలో అసలు నొప్పి అనేదే లేని హార్ట్ అట్టాక్స్ కూడా ఉంటాయి. అవి ముఖ్యంగా డయాబెటిస్, వ్యాధి గ్రస్తులకు వ్రుధులకు వస్తూ ఉంటాయి.చల్లటి చెమటలు పోయటం హార్ట్ అట్టాక్ లోని మరో ముఖ్య లక్షణం.తేమలటం,వాంతి తో పాటు శరీరం చచ్చు బడ్డట్లు గా మరీ బలహీనంగా అనిపిస్తుంది. ఊపిరి ఆడక పోవడం,అందక పోవడం తల తిరుగుతున్నట్లు,స్పృహ కోల్పోతున్నట్లు కూడా అనిపించ వచ్చు.చచ్చి పోబోతున్నట్లు లేక ఎదో విపత్తు జరగ బోతోంది. అన్న ఫీలింగ్,ఆందోళన కలగ వచ్చు.ఒక్కో సారి ఛాతీ నొప్పి అనేది లేకుండా ఈ చెప్పిన లక్షణా లాతో పాటు మాత్రమే హార్ట్ అట్టాక్ వస్తుంది.హార్ట్ అట్టాక్ రావడానికి  కొన్ని వారాలముందు ఏ కారణమూ లేకుండా అలసట ఊపిరి అందక పోవడం అంతకు మునుపు ఎన్నడూ లేని అజీర్ణం లాంటి లక్షణాలు.కనిపించ వచ్చు.

ఉదయం వేళలో గుండెపోటువస్తోందికారణం...

సహజంగా మనం చూస్తున్న మరణాలలో ఉదయం వేళలో నే ఎక్కువమంది సెలబ్రేటీ లు ఉదయం వేళలో హార్ట్ అట్టాక్జ్స్ తో మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు. ప్రమాద భరితమైన గుండెపోటు ఎక్కువగా ఉదయాన 7 నుంచి 11 గంటల మధ్యనే వస్తుందని ఒక పరిశీలనలో వెల్లడైయ్యింది.ఇందుకు కారణం బహుశా రాత్రంతా రెస్టు తీసుకున్న శరీరం పగలు చేయాల్సిన పనులకు సన్నద్ధం అవుతున్న క్రమం లో ఒత్తిడి కి లోనవుతున్నందునే ఉదయం హార్ట్ అట్టాక్స్ వస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ఈ సమయం లో నే అంతకు మునుపు దాకా ప్రశాంతం గా ఉన్న బిపి,గుండె చలనాలు వేగవంతం కావడం మొదలెడతాయి.అలాగే ఈ సమయంలోనే రక్తం తాలూకు ప్లేటిలేట్స్ గడ్డ కట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానాదీనా మనిషి మీద పడే హార్ట్ అట్టాక్స్ కు కారణాలు ఇవీ అయ్యి ఉండవచ్చు.

మీ వయస్సు 4౦ ఏళ్ళు పైన ఉన్నాయా ? ఛాతీలో మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా ? చాతీ ఎముకకు వెనక వైపున అజీర్ణం గ్యాస్ కి చెందిన మంట లాంటి ఫీలింగ్ అనిపిస్తే గ్యాస్ కాదు అది హార్ట్ అట్టాక్ అయ్యిఉండవచ్చు.ఎ మాత్రం అశ్రద్ధ చేసినా అది హార్ట్ అట్టాక్ కు దారి తీయ వచ్చు. చాతీ లో ని ఈ నొప్పి బరువుగా ఉండి. అక్కడి నుంచి ఎడమ భుజం ఆకింద మోచేతి దాకా వ్యాపిస్తుందా ?.చాతి నొప్పితో పాటు చెమటలు పోసి ఊపిరి అందనట్లుగా అనిపిస్తోందా ?నొప్పి పైన పేర్కొన్న విధంగా ఉంటె అది మీ గుండెకు రక్త సరఫరా అందక పోవడం వల్ల వచ్చినదై ఉంటుంది.మీకు 4౦ ఏళ్ళు ఉండి మీ కుటుంబీకులలో ఎవరికన్నా బీపి గుండె జబ్బులు డ యాబెటిక్స్ లాంటి వ్యాధులు చరిత్ర మీకు ఉంటె తప్పనిసరిగా మీరు కార్డియాలజిస్ట్ ను కలిసి ఇ సి జి టెస్ట్ ను చేయించుకోవడం అవసరం.ఇ సి జి టెస్ట్ నార్మల్ గా ఉండి పైన చెప్పిన లేదా పేర్కొన్న లక్షణాలు మీలో ఇంకా కొనసా గుతుంటే. స్ట్రెస్ టెస్ట్ నుకూడా చేయించు కొండి.

హార్ట్ అట్టాక్ కు సొంత వైద్యం...

హార్ట్ అట్టాక్ రాగానే లేచి కూర్చోడం మంచిది. లేదా దిళ్ళకు అంటే తలగడా కు ఆనుకుని కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల గుండె మీద ఒత్తిడి కొంత తగ్గుతుంది.

హార్ట్ అట్టాక్ ఎవరికీ వస్తుంది...

స్త్రీలకంటే పురుషులకు ఎక్కువగా వస్తుంది.అయితే స్త్రీలకు మెనోపాజ్ దశ వచ్చి వాళ్ళలో హార్మోన్లు ఉత్పత్తి తగ్గిపోవడం ప్రారంభించగానే వాళ్ళకు హార్ట్ అట్టాక్ రావడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి. అక్కడి నుంచీ వాళ్ళు హార్ట్ అట్టాక్ విషయం లో పురుషులతో పోటీ పడతారు.పొగతాగని వాళ్ళ కంటే పొగ తాగే వాళ్ళకు ఎక్కువగా హార్ట్ అట్టాక్స్ వస్తాయి.హార్ట్ అట్టాక్ తో చనిపోయిన వారి పిల్లలకు వార సత్వంగా సంక్రమించ వచ్చువయస్సు మీద పడుతున్న కొద్దీ అంటే 5౦ ఏళ్ళు పై బడ్డ వాళ్ళకు హార్ట్ అట్టాక్ రావడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ౩౦ నుంచి5౦ ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళకి కూడా ఈ మధ్య కాలం లో హార్ట్ అట్టాక్స్ రావడం పెరుగిపోతున్నాయి.

ముఖ్యంగా ఎవరికీ వస్తుంది?...

స్థూల కాయులకు హై పర్ టెన్సన్ బిపి తో బాధపడుతున్న వాళ్ళ కు హార్ట్ అట్టాక్ వస్తుంది. డయాబెటీస్ వ్యాధి గ్రస్తులకు హార్ట్ అట్టాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఉద్రేక పూరితంగా ఉండే వారికి చీకు చింత చికాకు ఉండేవాళ్లకు హార్ట్ అట్టాక్ వచ్చే అవకాశం ఉంది. థాయ్ రాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళకి హార్ట్ అట్టాక్స్ వచ్చే అవకాశం ఉంది.

హార్ట్ అట్టాక్ వల్ల వచ్చే అనార్ధాలు...

గుండె కండరానికి జరిగిన డ్యామేజ్ తీవ్రంగా ఉంటె అది హార్ట్ ఫెయి ల్యూర్ కి దారి తీయవచ్చు. దీనికారణంగా గుండె క్రమ బద్ధత లేకుండా అపసవ్యంగా కొట్టుకోవచ్చు.  ARRHYMIAS అంటారు. గుండె పంప్ చేసే సామర్ధ్యం మీద దీనిప్రభావం ఉంటుంది.గుండె పోటుతో మరణించిన మరణించిన పేషంట్లలో చాలా మంది మరణానికి ముందు కొన్ని ఘంటల పాటు VENTRICULAR FIBRILLATION అన బడే గుండె దడ తో బాధ పడినట్లుగా పరిశీలనలు చెపుతున్నాయి. అయితే పేషంట్ ను సకాలం లో హాస్పిటల్ కు తీసుకెళ్తే డాక్టర్ దీనిని సరి చేయగలరు.హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి?...మీ ఎదురుగా ఉన్న వ్యక్తి కి...తీవ్రమైన చికాకు ఆందోళన తో కనిపిస్తే.విపరీతంగా చెమటలు పోస్తుంటే.మొహం తెల్లగా పాలిపోతుంటే. ఊపిరి అందక ఇబ్బంది పడిపోవచ్చు.ఇది మామూలే అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉంటుంది అంటూ తోసి పాడే యకండి. సహజంగా పేషంట్ ఆసుపత్రికి వద్దు అంటూ ఉంటారు ఒక మిత్రునిగా స్నేహితునిగా అంబు లెన్స్ ని పిలవడం,లేదా మీకు అందుబాటులో ఉన్న కారులో కార్డియాక్ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళండి. ఆ వ్యక్తి స్పృహ కోల్పోయి ఉంటె మీకు సి పి ఆర్ అంటే కార్డియో పల్మనరీరిసుస్ సిటేషన్ నోటితో అతని నోట్లోకి గాలిని ఊదడం.చేతులతో చాతీని నొక్కి పెట్టడం లాంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ ని పాటించాలి. అసలు హార్ట్ అట్టాక్ వచ్చిన లక్షణాలు ఉన్నవారికి సరైన సమయం లో సహకారం అందిస్తే బతికి బట్ట కట్టవచ్చు. 

గుండె రక్తనాళాలపై కరోనా దెబ్బ  వర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

ఫిబ్రవరి 22: కరోనా వైరస్‌.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను ఇన్ఫెక్ట్‌ చేయకుండానే వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ (యూకే) పరిశోధకుల బృందం అధ్యయనంలో తేలింది. తమ పరిశోధనలో భాగంగా.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను కప్పి ఉంచే పెరిసైట్స్‌పైకి కరోనా వేరియంట్లన్నింటినీ ప్రయోగించారు. కానీ, అవేవీ పెరిసైట్స్‌ను ఇన్ఫెక్ట్‌ చేయలేకపోయాయి. అయితే  కేవలం స్పైక్‌ ప్రొటీన్లను ప్రయోగించినప్పుడు మాత్రం.. ఆ ప్రొటీన్లు ఎండోథీలియల్‌ కణాలతో సంభాషించకుండా పెరిసైట్లను నియంత్రించడమే కాక, వాపును కలిగించే సైటోకైన్లను స్రవించేలా చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకిన రోగుల్లో ఉండే  స్పైక్‌ ప్రొటీన్లు, మొత్తం రక్తప్రసరణ వ్యవస్థ అంతా ప్రయాణిస్తూ అన్ని అవయవాలనూ దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ అధ్యయనాన్ని ‘క్లినికల్‌ సైన్స్‌’ జర్నల్‌లో వారు ప్రచురించారు. కాగా అపోలో ఆసుపత్రికి చెందినా కార్దియాక్  సర్జన్ పద్మశ్రీ డాక్టర్ గోకలే మాట్లాడుతూ దివంగత మంత్రి గౌతం రెడ్డి కి రక్తం గడ్డ కట్టడం వల్లే మరణించారని అన్నారు. అయితే మంత్రి గౌతం రెడ్డి కి ఒకసారి గుండె పోటు వచ్చిందా అన్న సందేహం కలుగుతుందని హార్ట్ అట్టాక్ ఒక్కసారిగా రాదనీ హెచ్చరిక చేస్తుందని మనం ఆసంకేథాన్ని గమనించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే తీవ్రగుండే పోటు కు దారి తీస్తుందని అంటున్నారు.ఇదిలా ఉంటె మాన్ శరీరం రాత్రి నిద్ర పోతుందని అనంతరం నిద్ర లేవగానే శరీరం డీ హైడ్రే షణ్  వల్ల రక్తప్రసారం సరిగా లేకపోయినా రక్తం చిక్కపదిపోతుందనిఅనుతున్నారు. ఈ క్రమంలో ఉదయం లేచిన తరువాత మంచి నీళ్ళు తీసుకోవాలని రక్తం చిక్కబడ కుండా రక్త ప్రసారం సరిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు         
                              

By
en-us Political News

  
ఒక లీటరు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయట. నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంద‌ని, ప్రాణాంతక వ్యాధులపై బెర్లిన్ - జర్మనీలో జ‌రిగిన‌ మెడికల్ కాన్ఫరెన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.
ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.
వేసవి వచ్చిందంటే చాలామంది పుచ్చకాయలు, చెరకు రసం, మామిడి పండ్లు, తాటిముంజలు మొదలైనవి తినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు.
శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది.
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ.
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే.
బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి.
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక.
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది.
జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.