పూల టీలతో భలే ఆరోగ్యం..

Publish Date:Oct 24, 2024

Advertisement



పువ్వులు మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. చాలామంది పువ్వులను ఇంటి అలంకరణ కోసం,  దేవుడి పూజ కోసం వాడతారు. ఇక ఆడవాళ్లకు పూలు తెచ్చిపెట్టే అందం అంతా ఇంతా కాదు.. అయితే పువ్వులు మగువల అందాన్ని, ఇంటి అందాన్ని, దేవతామూర్తుల చెంత చేరి దేవతామూర్తుల రూపాన్ని మెరిపించడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి.  జపనీస్, చైనా ప్రజలు పువ్వులను ఆరోగ్యం కోసం ఉపయోగించడం ఎప్పటి నుండో వాడుకలో ఉంది. భారతీయ ఆయుర్వేదంలో కూడా చాలా రకాల పువ్వుల ను ఔషదంగా  వాడతారు. అయితే  కొన్ని రకాల  పువ్వలతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యం భేష్ గా ఉంటుంది. ఇంతకీ ఆరోగ్యం చేకూర్చే ఆ టీలు ఏవో తెలుసుకుంటే..

మందార టీ..

మందారలో ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్,  విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నిరోధిస్తాయి. చాలా అధ్యయనాలలో  మందార సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుందని తేలింది.  ఇప్పటికే యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్స్‌లో ఉన్నవారు  మందార టీని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.

చమోమిలే టీ..

ఎండిన చమోమిలే లేదా చేమంతి పువ్వులను వేడి నీటిలో వేసి చమోమిలే టీని తయారుచేస్తారు. ఫలితంగా సున్నితమైన రుచితో సువాసన కలిగిన టీ చాలా ప్రశాంతతను ఇస్తుంది. చమోమిలే టీ మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. "కెఫిన్ టీలకు బదులు చమోమిలే  రాత్రిపూట  తీసుకుంటే మంచి నిద్ర సొంతమవుతుంది.

బ్లూ టీ..

బ్లూ టీని శంఖు పుష్పాలతో తయారుచేస్తారు. దీని కోసం తాజా శంఖు పుష్పాలు అయినా వాడవచ్చు లేదా.. ఎండిన శంఖు పుష్పాలు అయినా ఉపయోగించవచ్చు. బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి యవ్వనంగా మారుస్తాయి. బ్లూ టీలో ఉండే ప్లేవనాయిడ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. బ్లూ టీలో ఉండే క్యాటెచిన్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి.

రోజ్ టీ..

సాధారణంగా వాడే టీలో ఎండిన గులాబీ రేకులను జోడించుకోవచ్చు. లేదంటే తాజా గులాబీ రేకులను కూడా ఉపయోగించవచ్చు. గులాబీ రేకులను నేరుగా సాధారణ నీటిలో ఉడకబెట్టడం ద్వారా గులాబీ టీని తయారు చేసుకోవచ్చు.  గులాబీ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటీ గుణాలు ఉంటాయి.  రోజ్ టీ కూడా జీర్ణప్రక్రియను ప్రోత్సహిస్తుంది.  

లావెండర్ టీ..

లావెండర్ టీ సాధారణంగా సోపులు, పెర్ప్యూమ, ఎయిర్ ఫ్రెషనర్ మొదలైన వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు.  కానీ లావెండర్ టీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లావెండర్ మానసిక స్థితిని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. నరాలకు స్వాంతన చేకూరుస్తుంది. మంచి నిద్రకు, చర్మ ఆరోగ్యానికి  చాలా మంచిది.


                                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.