పులివెందులపై జగన్ పట్టు సడలిందా?

Publish Date:Aug 31, 2025

Advertisement

నాలుగున్నర దశాబ్దాలకు పైబడి వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు పరస్థితి మారుతోందా? జగన్ ఆధిపత్యానికి గండి పడుతోందా? పులివెందుల నాయకులు, స్థానిక ప్రజలకు ఆయన దూరం అవుతున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  జగన్ సీఎంగా ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఈ దూరం ప్రారంభమైందంటున్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలా జగన్ పులివెందుల నియోజకవర్గ వాసులతో మమేకమైన పరిస్థితి లేకపోవడం, అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కక, కేవలం నియోజకవర్గ ఎమ్మెల్య స్థాయికే పరిమితమైన సమయంలో కూడా ఆయన నియోజకవర్గ ప్రజలకు దగ్గరకావడానికి ఇసుమంతైనా ప్రయత్నించకపోవడంతో జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.  ఆ అసంతృప్తే ఇటీవల పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రతిఫలించిందన్న చర్చ జోరుగా సాగుతోంది.  

 వాస్తవానికి పులివెందుల ప్రజలతో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న కలివిడి తనమే ఆయన, ఆయన కుటుంబం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలలో రాణించే అవకాశానికి కారణమైంది.  వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే ఆయన అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లవేళలా పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండేవారు. పులివెందుల నుంచి ఎవరు వచ్చినా  ఆప్యాయంగా పలకరించడమే కాకుండా, వారు ఏ పనిమీద వచ్చారో కనుక్కుని ఆ పని చేసి పంపించేవారు.  ఆయన పలకరింపు, ఆయన సహాయం చేసే విధానం పులివెందుల వాసులు ఆయననూ, ఆయన కుటుంబాన్నీ గుండెల్లో పెట్టుకునేలా చేసింది. పులివెందుల ప్రజలకు ఆయన పట్ల ప్రజలలో ఉన్న అభిమానమే.. ఆయన తదననంతరం జగన్ ను కూడా అక్కున  చేర్చుకునేలా చేసింది. అయితే జగన్ ఆ ఆదరణను నిలుపుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్  నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా జనాలకు కూడా దురమయ్యారని స్థానికులే చెబుతున్నారు.  ఆ కారణంగానే జగన్ కు పులివెందులలో మునుపటి స్థాయి ఆదరణ, పట్టు కొరవడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వైయస్ ఎంపీగా ఉన్నా, ముఖ్యమంత్రిగా  బిజీగా ఉన్నా ఆయన అందుబాటులో లేని లోటు కనిపించకుండా  సోదరుడు దివంగత వైయస్ వివేకానంద రెడ్డి పులివెందుల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే వారు. అటువంటి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ పక్కన పెట్టుకోవడం కూడా పులివెందుల ప్రజలు జగన్ కు దూరం కావడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారిందంటున్నారు.  అలాగే వైఎస్ కుటుంబ విభేదాల కారణంగా కూడా పులివెందుల జనంలో జగన్ పట్ల విముఖతకు కారణంగా చెబుతున్నారు. పులివెందులలో ఇప్పటివరకు జరిగిన జడ్పిటిసి ఎన్నికల విషయానికి వస్తే 1994, 2001, 2007, 2013, 2021  ఎన్నికల్లో గెలిచినా, ఏకగ్రీవం అయినా వై ఎస్ కుటుంబ మద్దతుతో పోటీ చేసిన వారే . అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే 1978 నుంచి 2024 మధ్యకాలంలో జరిగిన 14 ఎన్నికల్లో వై ఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు.  చివరగా 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గత ఎన్నికల మెజారిటీ తగ్గినా మరో సారి జగన్ మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలవడానికి కారణమయ్యాయి. అయితే  2019 ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన పరిణామాలు  పులివెందులలో జగన్ పట్టు జారిపోవడానికి కారణం అని చెప్పాల్సి ఉంటుంది.

2019 ఎన్నికల సమయంలో జగన్ కు వైఎస్ కుటుంబం మొత్తం అండగా నిలిచింది. తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల, బాబాయ్ వివేకానందరెడ్డి.. ఇలా అందరూ అన్ని విధాలుగా ఆయనకు అండగా నిలబడ్డారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కూడా జగన్ కు ప్రజా సానుభూతి వెల్లువెత్తి వైసీపీ ఘన విజయానికి దోహదం చేసింది. అయితే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ముందు సోదరి, ఆ తరువాత తల్లి ఆయనకు దూరం కావడం, అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయం దర్యాప్తులో ఎస్టాబ్లిష్ కావడం, వివేకా కుమార్తె న్యాయపోరాటం ఇవన్నీ జగన్ కు పులివెందులలో బలం తగ్గడానికి కారణాలయ్యాయి.

అలాగే జగన్  హయాంలో నియోజకవర్గంలో కాంట్రాక్టర్లుగా మారి పలు అభివృద్ధి పనులు చేసిన పార్టీ శ్రేణులకు చెందిన కోట్లాది రూపాయల బిల్లులు చెల్లింపునకు నోచుకోకపోవడం వంటి అంశాలు కూడా నియోజకకర్గంలో జగన్ కు ఆదరణ తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవన్నీ కలిసి పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఆయన పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాకుండా ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని చవిచూసేలా చేశాయి.  ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని నియోజకవర్గ ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుంటే.. ఉన్న కొద్దిపాటి పట్టూ జారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.