టీసీఎస్ లో లైంగిక వేధింపులు.. మహిళాకమిషన్ నివేదికలో దిగ్భ్రాంతికర అంశాలు

Publish Date:May 12, 2026

Advertisement

టీసీఎస్  నాసిక్ యూనిట్‌లో   లైంగిక వేధింపుల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జాతీయ మహిళా కమిషన్  తాజాగా తన నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో నాసిక్ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల అత్యంత దారుణమైన వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని నివేదిక తేల్చింది.   లైంగిక వేధింపులతో పాటు, మతపరమైన దూషణలు,  వ్యవస్థాగత వేధింపులు  కూడా జరిగినట్లు మహిళాకమిషన్ నివేదిక పేర్కొంది. 

జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ నాసిక్ యూనిట్‌లో పర్యటించి బాధితులు, పోలీసులు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఈ నివేదికను రూపొందించింది. నివేదిక ప్రకారం.. నాసిక్ కార్యాలయం కొంతమంది వ్యక్తుల గుప్పిట్లోకి వెళ్ళిపోయిందనీ..  వారు యువతులు, కొత్తగా ఉద్యోగంలో చేరిన మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లైంగికంగా, మానసికంగా  గురిచేశారు. నిందితులు మహిళలను లొంగదీసుకోవడానికి తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. 

మరీ ముఖ్యంగా..  కార్యాలయంలో పని చేసే మహిళలపై మతపరమైన ఒత్తిళ్లు కూడా ఉన్నాయని నివేదికలో  పేర్కొంది. హిందూ విశ్వాసాలను కించపరుస్తూ..   ఇతర మతాల పట్ల ఆకర్షితులయ్యేలా వేధింపులకు పాల్పడినట్లు నివేదిక తేల్చింది.  నిందితులు మహిళా ఉద్యోగులను నిరంతరం వేధించడం,  అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడినట్లు మహిళాకమిషన్ నివేదిక  నిర్ధారించింది.  

కార్పొరేట్ సంస్థల్లో మహిళల భద్రత కోసం అమలులో ఉండాల్సిన  పోష్ చట్టం అమలులో టీసీఎస్ నాసిక్ యూనిట్ పూర్తిగా విఫలమైందని జాతీయ మహిళాకమిషన్ పేర్కొంది.  అంతర్గత ఫిర్యాదుల కమిటీ   నామమాత్రంగానే ఉందనీ, బాధితుల పట్ల కనీస సానుభూతి కూడా చూపలేదని కమిషన్ నివేదిక పేర్కొంది. 

ఈ వ్యవహారం కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదనీ, ఇది యాజమాన్య వైఫల్యమని కమిషన్  పేర్కొంది. ఫిర్యాదు చేసిన వారిని బదిలీ చేస్తామని లేదా ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరించడం వల్ల చాలా మంది బాధితులు బయటకు రాలేకపోయారని పేర్కొన్న మహిళాకమిషన్.. నిందితులపై   కఠిన చర్యలు తీసుకోవాలని, సాక్షులకు రక్షణ కల్పించాలని  సిఫార్సు చేసింది. ఈ నివేదిక నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం, టీసీఎస్ యాజమాన్యం తీసుకోబోయే చర్యలపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ కేసులో విచారణ ప్రక్రియ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది.
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఎట్టకేలకు కథ సుఖాంతమైంది.
ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అధికార కార్యాలయాలకు వస్తుంటారు. అయితే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని భావించిన అధికారులు ముందుగా ప్రభుత్వ కార్యాలయాలలో నో హెల్మెట్, నో ఎంట్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ప్రధాని ఆ పిలుపునిచ్చిన రోజుల వ్యవధిలోనే దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
పశ్చిమాసియా సంక్షోభం పెరుగుతున్న నిర్మాణ వ్యయాల దృష్ట్యా నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్ వంటి ప్రధాన ప్రాజెక్టులను రెండేళ్ల పాటు వాయిదా వేయాలని నీతి ఆయోగ్ సూచించింది. ఈ సూచన నేపథ్యంలో కేంద్రం భారీ నిర్మాణాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తిప్పిరి తిరుపతి తన చిన్నతనంలోనే అంటే ఇంటర్ చదువుతున్న సమయంలోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఉన్న కేసులు, పరిస్థితుల కారణంగా ఆయన ఇంటర్ తెలుగు పరీక్షకు హాజరు కాలేకపోయారని చెబుతు న్నారు. అయితే మిగతా సబ్జెక్టుల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
దుబాయ్‌కు ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమైన ప్రయాణికుల వద్ద నుంచి 28 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సర్వీసుల రద్దు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్న ఎయిర్ ఇండియా... ఈ సర్వీసుల కోత మూడు నెలల పాటు ఉంటుందని వివరించింది. ఎయిర్ ఇండియా నిర్ణయం .. భారత్ నుండి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది.
సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెబుతున్నారు. వైద్యుల బృందం ఆమె పరిస్థితిని సమీక్షిస్తూ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కాగా ఇటీవల కాలంలో సోనియాగాంధీ పలుమార్లు ఆరోగ్య సమస్యలతో బాధపడిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అనవసరమైన విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని, ఏడాది పాటు బంగారం కొనవద్దనీ, ఉద్యోగులు కోవిడ్ సమయంలో విజయవంతం అయిన వర్క్ ఫ్రం హోం పద్ధతిని పాటించాలనీ మోడీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడం ద్వారా బంగారం కొనుగోలు విషయంలో ప్రజలు వెనుకడుగు వేయక తప్పని పరిస్థితి కల్పించారు.
తన కాన్వాయ్‌ సైజ్‌ను సగానికి తగ్గించాలని ప్రధాని మోడీ ఎస్‌పీజీకి ఆదేశాలు జారీ చేశారు. పొదుపు మంత్రం పాటించాలని ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ ముందుగా పొదుపు పాటించడాన్ని తన నుంచే ఆరంభించాలని నిర్ణయించుకున్నారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61పరుగులు, వాషింగ్టన్ సుందర్ 33 బంతుల్లో 50 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.