టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు! బండికి హరీష్ 18 ప్రశ్నలు

Publish Date:Nov 1, 2020

Advertisement

రెండు రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్న దుబ్బాకలో చివరి నిమిషంలో రాజకీయ సమీకరలు వేగంగా మారిపోతున్నాయి. ప్రచార గడువు ముగుస్తున్న సమయంలో అధికార పార్టీలోకి భారీగా వలసలు జరిగాయి. తమ పార్టీలకు హ్యాండిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు గులాబీ గూటికి  చేరుతున్నారు. మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో బిజెపి బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తమ అభ్యర్థి రఘునందన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేయడంతో తోట కమలాకర్ రెడ్డిని బీజేపీ బహిష్కరించింది. అప్పటి నుంచి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. కాంగ్రెస్ లో చేరాలని పీసీసీ పెద్దలు తోటను సంప్రదించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తోట కమలాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. దీంతో బీజేపీ మాజీ కిసాన్ నాయకుడైన తోట హస్తం గూటికి చేరుతారని అంతా భావించారు. అయితే పోలింగ్ కు రెండు రోజుల ముందు అనూహ్యంగా మంత్రి హరీష్ రావు సమక్షంలో అధికార పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

దుబ్బాక ఉప ఎన్నికలో గట్టి పోటీ ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రచారాన్ని అంతా తానే నడిపిస్తున్న మంత్రి హరీష్ రావు.. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం చేగుంట మండలంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు, వందలాది మంది కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. ఇక బీజేపీ కేడర్ లో కొంత పట్టున్న తోట కమలాకర్ రెడ్డిని పార్టీలో చేర్పించడంలో హరీష్ రావు సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. చివరి గంటల్లో దుబ్బాకలో మరిన్ని రాజకీయ కీలక పరిణామాలు జరుగుతాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

 

వలసలు పెరగడంతో ఉత్సాహంగా కనిపిస్తున్న మంత్రి హరీష్ రావు బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు 18 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు.  తెలంగాణలో నైతిక విలువలను మంట కలిపేలా బీజేపీ పనిచేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీలేరుని ఏపీకి ఇచ్చింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. తాను ఓ తెలంగాణ పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నానని చెప్పిన హరీష్.. తన లేఖకు సంజయ్ స్పందిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందని చెప్పారు. తాను పింఛన్లపై సవాలు చేస్తే సంజయ్ ఇప్పటివరకూ స్పందించలేదన్నారు హరీష్ రావు. ఏపీ పునర్విభజన చట్టంలో అప్పటి పది జిల్లాల సరిహద్దులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందులో ఏడు మండలాలను వేరే రాష్ట్రంలో కలపడం బీజేపీ చేసిన అన్యాయం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైన 460 మెగావాట్ల లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్లాంటును బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అప్పగించిందని అన్నారు. 

 

బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని, విభజన చట్టంలో కూడా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చారని హరీష్ రావు గుర్తు  చేశారు.స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టడం లేదని  ప్రశ్నించారు.  హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ఎందుకు రద్దు చేసింది? అని ఆయన నిలదీశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని ఎప్పటి నుంచో వరంగల్ జిల్లా ప్రజలు ఉద్యమాలు చేశారని, బీజేపీ సర్కారు కాజీపేటకు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసిందని హరీష్ ఆరోపించారు. నీటి కేటాయింపులు చేయకుండా ప్రాజెక్టుల విషయంలో తలెత్తే అభ్యంతరాలను బీజేపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, ఇది ఆ పార్టీ నేతల కపట నీతి కాదా? అని నిలదీశారు.  తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని  ప్రశ్నించారు. 

 

ఆరేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఉద్యోగులను భరిస్తోందని, ఏటా వెయ్యి కోట్ల భారం పడుతోందని, ఇది కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కాదా? అని లేఖలో హరీశ్ పేర్కొన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1,855 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.తెలంగాణలో అర్హులైన అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే పెంఛను ఇవ్వడంలో బీజేపీ ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. వరంగల్ విమానాశ్రయాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదని, టెక్స్ టైల్స్ అభివృద్ధి నిధులను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని సంజయ్ ని లేఖలో నిలదీశారు హరీష్ రావు.

 

ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు కోరినా ఎందుకు పట్టించుకోవడం లేదు? అని మంత్రి ప్రశ్నించారు.   తెలంగాణలో విద్యా వసతుల పట్ల  కేంద్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించట్లేదా? అని నిలదీశారు.హైదరాబాద్ నుంచి ఎంపీలుగా గెలిచి, కేంద్ర మంత్రులైన బీజేపీ నేతలు ఎందుకు మూసీ ప్రక్షాళనకు నిధులు తేవడం లేదు? అని నిలదీశారు. ఏపీ విభజన బిల్లు ప్రకారం రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం ఏటా రూ.450 కోట్ల ఇవ్వాలని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదని హరీశ్ రావు లేఖలో ప్రశ్నించారు.

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.