భలేవాడికి అన్నయ్య.. ఏపీ సీఎం జగనన్నయ్య!

Publish Date:Nov 1, 2020

Advertisement

లిక్కర్, బదిలీలపై రివర్స్ గేర్

 

తత్వం తెలుసుకుంటున్న ఏపీ సీఎం

 

సహజంగా మనం అతను భలేవాడని అంటుంటాం. కానీ ఏపీ సీఎం జగనన్న మాత్రం.. ఆ భలేవాడికి అన్నయ్యలా ఉన్నాడన్న కొత్త సామెత ఒకటి,  ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ముందు కాదనడం, ఆ తర్వాత దానినే తూచ్ అవుననడం అలవాటయిపోయింది. బహుశా అందుకే ఈ పద ప్రయోగం ప్రచారంలోకి వచ్చినట్లుంది. మొన్నటికి మొన్న సీఎస్ రేసులో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్‌ను బదిలీ చేసి, మళ్లీ రెండోరోజునే పోస్టింగు ఇచ్చి హాశ్చర్యపరిచారు.

 

నిన్నటికి నిన్న లిక్కర్ పాలిసీపై అసెంబ్లీలో దంచికొట్టి చేసిన ప్రసంగాలన్నీ, తాజా రేట్ల తగ్గింపుతో.. తస్సాదియ్యా తుస్సుమన్నట్లయింది. ఫర్వాలేదు. పాలకులు వెనకడుగు వేసినంత మాత్రాన విమర్శించకూడదు. ఆలస్యంగానయినా తత్వం బోదపడినందుకు సంతోషించాలి. ఇప్పుడు మొండివాడిగా పేరున్న ఏపీ సీఎం జగనన్నను, ఆ మేరకు అఖిలాంధ్రులు అభినందించాలి.

 

మద్యం మాన్పించేందుకు.. షాక్ కొట్టేలా మందు ధరలు పెంచామన్నారు. మద్యాన్ని దశల వారీగా నిషేధించే క్రమంలోనే, వాటి రేట్లు కావాలనే పెంచామని.. జగన్ అండ్ ‘పెద్దగొంతు’ అంబటి రాంబాబు సభలో సెలవిచ్చారు. పెంచిన ధరలు, ప్రపంచంలో ఎక్కడా లేని మందు బ్రాండ్లు చూసిన జనం కూడా,  జగనన్నయ్య అండ్ అంబటి అన్నయ్యలు చెప్పింది నిజమే కామోసనుకున్నారు.

 

చంద్రబాబులా తమకు, మద్యం నుంచి ఆదాయం సంపాదించే ఖర్మ లేదన్న మాటనూ జనం నమ్మేశారు. దానిని మద్యనిషేదానికి ఏర్పాటుచేసిన, కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణరెడ్డి కూడా సమర్ధించారు. అది చాలదన్నట్లు.. కోట్ల రూపాయలు పెట్టి పత్రికల్లో ప్రకటనలూ ఇచ్చారు. ఇంతమంది మహానుభావులు, మహనీయులు చెప్పింది ఎవరు మాత్రం తప్పనుకుంటారు చెప్పండి? పైగా ఈ జన్మలో.. గాంధీ గారి అంశలో పుట్టిన,  జగనన్నయ్య చెప్పిన తర్వాత ఇక తిరుగే ఉండదు కదా?!

 

కానీ, విచిత్రంగా.. మద్యం మాన్పించేందుకే కొండెక్కించిన మందు ధరలను, కొండ కిందకు దించేశారు. పైగా పిచ్చి బ్రాండ్లతో పాటు,  ప్రీమియం  బ్రాండ్ల రేట్లపైనా దయదలిచారు. యస్. నిజంగా ఇవన్నీ మొండివాడుగా పేరున్న,  మన అఖిలాంధ్రకోటి జగనన్నయ్య తీసుకున్న నిర్ణయాలే. సంతోషం. మందు తాగనివారికి ఈ గోలతో ఎలాగూ సంబంధం ఉండదు. కానీ కొన్న నెలల తరబడి, పిచ్చి బ్రాండ్లు తాగలేకపోతున్న మందుబాబుల దృష్టిలో,  జగనన్నయ్య దేవుడయిపోయారు. బాగానే ఉంది. మందు అలవాటు పూర్తిగా మార్పించి, ద శలవారీ మద్యనిషేధంలో భాగంగానే... మందురేట్లు పెంచామని భాష్యం చెప్పిన.. ఒక అంబటి రాంబాబు, ఇంకో బొత్స సత్తిబాబు, మరో శ్రీకాంత్‌రెడ్డి అండ్ అదర్స్.. తగ్గించిన రేట్లపై ఏం భాష్యం ఇస్తారో చూడాలి.

 

పక్క రాష్ర్టాల నుంచి,  మద్యం స్మగ్లింగ్ జరుగుతున్నందున  మందు ధరలు తగ్గించామని,  సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. బాగుంది. ఈ విషయం అంతకుముందు తెలియదా? సరిహద్దు రాష్ర్టాల  పక్కనే ఉన్న వైన్‌షాపులో.. వెయ్యి రూపాయలకు  బ్రాండెడ్ మందు దొరుకుతుంది.  కానీ సొంత రాష్ట్రంలోని పిచ్చి బ్రాండ్ల రేట్లు దానితో పోలిస్తే మూడింతలు ఎక్కువ. అప్పుడు బుద్ధి-బుర్ర ఉన్న ఎవరైనా, సరిహద్దు దాటి తీసుకుంటాడన్న అంచనా, అధికారులకు అప్పుడు లేదా? మరిప్పుడు ధరలు తగ్గించారు కాబట్టి.. బ్రాండెడ్ మందుతో జనం ఆరోగ్యం పదికాలాల పాటు చల్లగా, తమ ఖజానా వెచ్చగా ఉండేందుటే పెంచామని చెబుతారా? అన్నవి ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. హేమో... చెప్పినా చెప్పగల సమర్ధులు మరి?!

 

సరే.. జగనన్నయ్య తన నిర్ణయం వాపసు తీసుకున్నందుకు, ఆయననేమీ తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే తప్పులు చేయడం మానవ సహజం. సజ్జల, చల్లా రామకృష్ణారెడ్డి చెప్పినట్లు.. జగనన్నయ్య ఆధునిక గాంధీ మహాత్ముడు అయినప్పటికీ, మహాత్ములు కూడా తప్పులో కాలేస్తుంటారు. కాబట్టి, జగనన్నయ్యను నిందించాల్సిన పనిలేదు. కాకపోతే.. ఈ 17 నెలల పరిపాలనా కాలంలో తత్వం తెలుసుకుంటున్నందుకు, ఆయనను అభినందించాలి.

 

తగులుతున్న ఎదురుదె బ్బలే, ఆయనకు గుణపాఠాలుగా మారుతున్నాయి. ఏది మంచి, ఏది చె డు? ఏది ఆదాయం? ఏది వృధా అన్న వాస్తవాలు,  అనుభవంలో తెలిసివస్తున్నట్లు కనిపిస్తోంది. యువకుడు, పులివెందుల బిడ్డ.. పైగా రాజారెడ్డి మనువడు ప్లస్ 151 మంది ఎమ్మెల్యేల బలం.. వీటికి మించి రాజకీయ ప్రత్యర్థుల కుట్రకు బలయి,  16 నెలలు జైల్లో మగ్గిన నాటి జ్ఞాపకాలు! ఇవన్నీ కలసి వెరసి,  జగనన్నయ్యను అలా తయారుచేశాయని అనుకోవడంలో తప్పు లేదు. అనుభవాలు-ఎదురుదె బ్బలే గుణపాఠాలయినప్పుడు, ఏ మనిషి మారినా స్వాగతించడమే గొప్పతనం. అందుకు జగనన్నయ్య కూడా మినహాయింపు కాదు.

 

కాబట్టి మందు రేట్ల తగ్గింపుపై.. జగనన్నయ్యను కాకుల్లా పొడవకుండా, మారిన జగన్‌బాబును, ఈ  విశాల ప్రపంచంలోకి ఆహ్వానించండి. పనిలో పనిగా మారిన జగనన్న.. పోస్టింగులివ్వకుండా, అధికారుల పట్ల అనుసరిస్తున్న  వేధింపు పర్వానికి తెరదించితే, ఆయనను నిజంగానే ఈ విశాల ప్రపచంలోకి ఆహ్వానిస్తారేమో?  కానీ.. ఆ సీఎంఓ సైంధ వుడు ఇక్కడ కూడా అలవాటు ప్రకారం, అడ్డం పడితే చేసేదేమీ లేదు!  

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.