Publish Date:May 24, 2025
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుంచి బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా వైదొలగింది. తొలుత తాను వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని చెప్పిన మాగీ.. ఆ తరువాత మాత్రం సంచలన ఆరోపణలు చేశారు.
Publish Date:May 24, 2025
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవిత పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవంక కవిత లేఖలో పేర్కొన్న అంశాలతో పాటుగా.. అందుకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, వీటన్నింటి మించి గత కొంతకాలంగా ఆమె పార్టీతో, ఫ్యామిలీతో సంబంధం లేకుండా సొంత పంథాలో సాగిస్తున్నరాజకీయాలను గమనిస్తే.. ఆమె వెనక ఇంకెవరో ఉన్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
Publish Date:May 24, 2025
విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు శనివారం (మే 24) అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Publish Date:May 24, 2025
బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు సంక్షోభంలో కూరుకు పోయింది. అసలు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకోలేదనే చెప్పాలి. ఏవో ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలతో హడావుడి చేస్తున్నప్పటికీ.. పార్టీ మాత్రం అంతర్గత విభేదాలతో కూనారిల్లుతూనే ఉంది. పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడం దగ్గర నుంచి ఆ పార్టీలో ఎక్కడా ఎన్నడూ ఐకమత్యం, ఏకాభిప్రాయం కనిపించిన దాఖలాలు లేవు.
Publish Date:May 24, 2025
తిరుమలలో తప్పతాగి హల్ చల్ చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు చెప్పారు. అన్నమయ్య భవన్ లో శనివారం (మే 24) డయల్ యువర్ ఈవో కార్యకరమంలో భక్తుల సందేహాలకు సమాధానమిచ్చిన ఆయన ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.
Publish Date:May 24, 2025
జీవన విధానంలో యోగా భాగం కావాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ విశాఖ రానున్న నేపథయంలో సన్నాహక కార్యక్రమాలను కూడా ఘటనంగా నిర్వహిస్తున్నారు.
Publish Date:May 24, 2025
బీఆర్ఎస్ లో చీలిక పక్కా అయిపోయిందా? కవిత సొంత కుంపటి పెట్టుకోవడం ఖాయమైపోయిందా? అంటే.. గులాబీ పార్టీ వర్గాల నుంచి ఔననే సమధానమే వస్తోంది. నిజానికి కవిత చాలా కాలంగా సొంత కుంపటి’ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయితే.. కేటీఆర్, హరీష్ రావులను కలిపినట్లుగానే కేసీఆర్ ఏదో చేసి కవితను దారికి తెస్తారనే ఆశలు కూడా ఇప్పుడు ఆవిరైపోయాయి.
Publish Date:May 24, 2025
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న భారతీయులు, పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Publish Date:May 24, 2025
తిరుమలలో ముగ్గరు తాగుబోతు ఖాకీలు హల్ చల్ చేశారు. మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్‌రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. ఇక కొండపై భక్తులను ఇబ్బందులకు గురిచేశారు.
Publish Date:May 24, 2025
Publish Date:May 24, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండేళ్ళు అయినా అవకుండానే అట్టర్ ప్లాప్ సినిమా చూపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మూడు ముక్కల ఆటలో మునిగి తేలుతోంది. మరో వంక కాళేశ్వరం మొదలు కారు రేసు వరకు అనేక అవినీతి ఆరోపణలు, విచారణలు బీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయి.
Publish Date:May 24, 2025
మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించ కతప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపిస్తున్నది. అధికారంలో ఉండగా చేసిన పాపాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సొంత తల్లినీ, చెల్లినీ కూడా దూరం పెట్టేసిన సంగతి తెలిసిందే.
Publish Date:May 23, 2025
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవలకు తోడు వారాంతంం కూడా కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.