Publish Date:Apr 28, 2025
హైదరాబాద్‌లో కేవలం 14 నెలల్లోనే హైటెక్ సిటీని నిర్మించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విట్-ఏపీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం, నూతన స్టార్టప్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన వి-లాంచ్ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. విద్యార్థులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, విట్-ఏపీలో 95 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్ అంతా ఐటీ దేనని అప్పట్లోనే చెప్పాను దేశంలోని ఐఐటీలలో 20 శాతం సీట్లు తెలుగోళ్లే కొల్లగొడుతున్నారు. అన్నింటిలో తెలుగువారు ముందుండాలనేదే నా ఆకాంక్ష అని తెలిపారు.ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులుంటారు.. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని పేర్కొన్నారు.
మే 2 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పున:ప్రారంభం కాబోతుందని.. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని.. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది. ఇప్పుడు కలెక్టర్ పోస్టు కంటే ఐటీ ఉద్యోగానికే డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. విట్ అమరావతిలో 95 శాతం ప్లేస్మెంట్లు వస్తున్నాయి. మీరు ఉద్యోగంలో సంతృప్తి చెందవద్దు.. కొత్త సంస్థలు స్థాపించండి. సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈవోలంతా తెలుగోళ్లు, భారతీయులే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారు. త్వరలో అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. మన పిల్లలు ప్రపంచస్థాయి సేవలు అందించే స్థాయికి ఎదగాలి. వాట్సప్ సేవ ద్వారా ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ సర్వీసులు దగ్గర చేశాం. వాట్సప్ ద్వారా వెయ్యి రకాల సేవలు అందిస్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి మార్గసూచి రూపొందిస్తున్నాం. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. ఇప్పుడు కలెక్టర్ పోస్ట కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో విట్ యూనివర్సిటీ ఛాన్స్లర్ డాక్టర్ జి. విశ్వనాథన్, వైస్ ఛాన్స్లర్ డాక్టర్ ఎస్.వి. కోటారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-chandrababu-39-197079.html
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగింది. దాదాపు సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నయి. షర్మిల ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గాలుగా వాగ్వాదాలకు దిగారు
జూన్ చివరి వారంలో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు.
రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో జతరకు హాజరైన అఖిలప్రియ అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుడి ఆవరణలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు.
ఏపీ రాజధాని అమరావతి లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్‌కుమార్ అన్నారు. ఆంగ్లపత్రికలో అమరావతి ప్రస్తావ రాకపోయినా కావాలనే చర్చలోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్‌కు ఆయన వివరించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్నిరకాల ఆర్టీసీ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
వరుస దెబ్బలు తగులుతున్నా వైసీపీకిగానీ దాని మీడియాకి గానీ బుద్ది వచ్చినట్టు కనిపించడం లేదా? అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల పట్ల ఉండాల్సిన నిబద్ధత మరచి మరీ జగన్ అనుంగు మీడియా వ్యవహరించడం చేటు తెస్తుందా? అంటే అదే నిజమని తెలుస్తోంది.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఖండించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళల పై వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై రాయపాటి శైలజ తీవ్రస్థాయిలో స్పందించారు.
అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సాక్షి వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు.