విజయం కావాలంటే  కష్టపడితే సరిపోదు.. వీటి మీద కూడా శ్రద్ద పెట్టాలి..!

Publish Date:Jan 29, 2026

Advertisement

విజయం ప్రతి మనిషి జీవితంలో ఒక కలలా ఉంటుంది. దాన్ని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు.  చిన్న పిల్లల నుండి పెద్దల వరకు.. ఏదో ఒక విషయంలో విజయం సాధించాలని శ్రమిస్తూ  ఉంటారు.  అయితే.. కొందరు లక్ష్యాన్ని సాధిస్తారు,  మరికొందరు  విఫలం అవుతారు. నేను చాలా కష్టపడ్డాను, కానీ విజయం సాధించలేకపోయాను అని కొందరు అంటూ ఉంటారు.  అయితే విజయం సాధించాలంటే కేవలం కష్టపడితే సరిపోదు.. దానికి మరికొన్ని కూడా తోడవ్వాలి. చాలామంది కష్టపడి, దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ విజయం కోసం కష్టంతో పాటు మరికొన్ని చాలా ముఖ్యం.  అవేంటో తెలుసుకుంటే.. ఈసారి విజయం అంతు చూడొచ్చు..


తప్పు..

విజయం సాధించడానికి కష్టపడటం మంచి లక్షణమే అయినా,  కొందరు పైకి కష్టపడుతూ మరొకవైపు విజయం కోసం తప్పు చేస్తారు, అబద్దాలు చెప్తారు.

అబద్దాన్ని ఆశ్రయించి విజయం సాధించాలని అనుకోవడం చాలా తప్పు.  అబద్దం వల్ల అప్పటికప్పుడు విజయం లభిస్తుందేమో కానీ.. దాని ప్రబావం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ సరైన దారిలోనే విజయం కోసం ప్రయత్నించాలి.

అహంకారం..

జీవితంలో ఏం సాధించినా,  ఎంత తెలివైన వ్యక్తి అయినా ఎప్పుడూ గర్వపడకూడదు.  అది ఒక వ్యక్తిని విజయవంతమైన వ్యక్తి అనే స్థాయి నుండి లాగి పడేస్తుంది.  ఎంత తెలివైన వ్యక్తికి అయినా ఫెయిల్యూర్ రుచి చూపించేది అహంకారమే.. అందుకే ఎట్టి పరిస్థితులలో ఎంత తెలిసినా,  ఎంత ఎదిగినా అహంకారం చూపించకూడదు.

సోమరితనం..

విజయానికి అతిపెద్ద శత్రువు సోమరితనం. సోమరితనం ఉన్న వ్యక్తి విజయం వైపు  చురుగ్గా వెళ్లలేడు.  ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా,  ఎన్ని అవకాశాలు ఉన్నా.. అవి ఎక్కడికి పోవులే అనే నిర్లక్ష్యంతో ఉంటారు సోమరిపోతులు. అంతేకాదు.. సోమరిపోతులు ఏ పనిని మొదలు పెట్టినా దానిని సరిగా పూర్తీ చేయలేరు.  ఫలితంగా ఎప్పటికీ ఫెయిల్యూర్ సర్కిల్ లోనే ఉండిపోతారు.

అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం,  ఆరోగ్యకరమైన జీవనశైలి, అన్నింటికంటే ముఖ్యంగా క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి.  క్రమశిక్షణ ఉన్నప్పుడు జీవితంలో అన్ని ఒక ప్రణాళికలో జరిగిపోతూ విజయానికి దగ్గర చేస్తాయి.

కోపం..

తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఎప్పుడో చెప్పారు.  కోపంగా ఉన్నవారు.. వారు చేసే ప్రయత్నాలలో విఫలం అవుతూ ఉంటారు.  వారి కోపమే వారిని దెబ్బతీస్తూ ఉంటుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఇలానే ఉంటాయి.  ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మనిషి జీవితంలో తన సామర్థ్యాన్ని సరైన విధంగా వినియోగించుకోగలడు.

అందుకే కోపాన్ని దూరంగా ఉంచాలి, కోపం వచ్చినప్పుడు నా శత్రువు దగ్గరకు వచ్చింది దానికి దూరంగా ఉండాలి అనుకోవాలి.  ఇది మనిషిని ప్రశాంత జీవనం వైపు నడిపిస్తుంది.

దైవం..

ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా ప్రశాంతత లభించేది దైవ ఆరాధన వల్లే.. జీవితంలో విజయం సాధించాలంటే  సరస్వతి దేవి కృప,  వినాయకుడి అనుగ్రహం ఉండాలి.  వీరిద్దరి అనుగ్రహం ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితి అయినా తెలివిగా అధిగమించగలరు.  

ప్రతిరోజూ సరస్వతి,  గణేషుడి ఆరాధన,   కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం వల్ల కోపాన్ని అధిగమించవచ్చు.

                               *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే....
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో..
వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది...
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక...
ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉండే ప్రజలుగా జపనీయులను చెబుతారు.  వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.  వారి ఆరోగ్యం,  వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది...
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి...
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.