Publish Date:Jul 20, 2025
దాత చేయూతతో ఓ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించారు. ఆ పాఠశాలలో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. చక్కటి ఏకరూప దుస్తులు, మెడలో టై, కాళ్లకు బూట్లు ధరించి ప్రతిరోజు సుమారు 420 పిల్లలు బస్సుల్లో పాఠశాలకు వెళ్తారు. అలాగని ఆ పాఠశాల ఏదో పట్టణంలో లేదు ఓ మారుమూల పల్లెటూరులో ఉంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ లో ఉంది ఈ పాఠశాల. ఇదే గ్రామానికి చెందిన కావేరి విత్తన సంస్థ ఎండి, గుండవరపు భాస్కరరావు ఊరితో పాటు పాఠశాలను దత్తత తీసుకొని ఆధునికీకరించారు. ఆధునికీకరించిన పాఠశాల భవనంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి.
సమీపంలోని 11 గ్రామాల నుండి 420 మంది పిల్లలను పాఠశాలలకు తీసుకురావడానికి మూడు బస్సులు ఏర్పాటు చేశారు. డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు డీజిల్ కోసం దాత భాస్కర్ రావు ప్రతినెల 1.50 లక్షలను వెచ్చిస్తున్నారు. విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు, బ్యాగు, బెల్ట్, టై అందిస్తున్నారు. పాఠశాలలో అవసరమైన ప్రైవేటు ఉపాధ్యాయులను, ఆయాలను నియమించి వారి వేతనాలను తనే చెల్లిస్తూ ఔధార్యాన్ని చాటుతున్నారు. పాఠశాలలో 17 మంది ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించి వారికి వారితోపాటు బస్సులను, డ్రైవర్లను, క్లీనర్లను కూడా నియమించి వారి ఖర్చులు కూడా దాత భాస్కర్ రావు భరిస్తున్నారని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నరన్నారు.
పాఠశాలలో ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చేర్చుకోవడం లేదని కేవలం ప్రైవేట్ పాఠశాలల నుండి వస్తున్న విద్యార్థులు మాత్రమే చేర్చుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సంఖ్యలో హనుమకొండ జిల్లాలోనే పాఠశాల ప్రథమ స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో 1000 మందికి పైగా విద్యార్థులకు పాఠశాలలో విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. నవోదయ, గురుకుల పాఠశాలల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందన్నారు. దాత భాస్కర్ రావు పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థుల కోసం ప్రతినెల సుమారు 14 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దాత భాస్కర్ రావు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు వసతులు కల్పించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hanumakonda-district-39-202320.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.