స్థంభించిన యూట్యూబ్ సేవలు 

Publish Date:Feb 27, 2024

Advertisement

జీమెయిల్.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉపయోగించే ఈమెయిల్ సర్వీస్. అనేక సంస్థలు, కోట్లాది మంది యూజర్లు జీమెయిల్​ను, గూగుల్​ వర్క్​స్పేస్​ను రోజువారీ కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. యూట్యూబ్​ కూడా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ఈ రెండింటి సేవల్లో అంతరాయం ఏర్పడడం వల్ల వారంతా ఇబ్బంది పడ్డారు. జీమెయిల్, యూట్యూబ్​.. రెండూ గూగుల్​లో భాగమే. సమస్యకు కారణం ఏంటనే విషయంపై గూగుల్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
 ప్రముఖ వీడియో  ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్  స్తంభించిపోయింది. మంగళవారం నాడు మధ్యాహ్న 3 గంటల సమయంలో 20 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ విషయాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూట్యూబ్ పనిచేయలేదని వంద మంది కామెంట్ రాశారు. యూట్యూబ్  పనిచేయలేదని ఇంటర్నెట్ సమస్యలకు సంబంధించి పరిష్కారం కనుగొనే డౌన్ డిటెక్టర్ నిర్ధారించింది.
యూట్యూబ్‌లో  80 శాతం మంది వీడియోలు చూడటంలో ఇబ్బంది పడ్డారు. మరికొందరు వీడియోలు అప్ లోడ్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. యూట్యూబ్‌లో  అంతరాయం భారతదేశంలో ఏర్పడిందా..? మిగతా దేశాల్లో వచ్చిందానే అంశానికి సంబంధించి మాత్రం స్పష్టత లేదు అని’ డౌన్ డిటెక్టర్ పేర్కొంది.
యూట్యూబ్‌లో వీడియోలు అప్ లోడ్ చేయడంలో సమస్య ఏర్పడిందని కొందరు యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యూట్యూబ్  సర్వర్ డౌన్ అయ్యిందా.? ఇతర సమస్యలు ఉన్నాయా..? స్పష్టత ఇవ్వండి. తాను లైవ్, షార్ట్స్ అప్ లోడ్ చేయాల్సి ఉంది. తన వైటీ స్టూడియోలో ఏమీ కనిపించడం లేదు. యూట్యూబ్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. యూట్యూబ్‌ డౌన్‌కు సంబంధించి ఇప్పటివరకు యాజమాన్యం మాత్రం ప్రకటన చేయలేదు.
జీమెయిల్, యూట్యూబ్​ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాల్లోని నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూగుల్​ వర్క్​స్పేస్​లోకి లాగిన్​ కాలేకపోతున్నామని వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ఫిర్యాదులు చేశారు. యూట్యూబ్​లోనూ వీడియోలు చూడడంలో ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయారు. యూట్యూబ్ సహా జీమెయిల్ పని చేయట్లేదని యూజర్లు స్క్రీన్​ షాట్లు పెట్టారు. అలాగే ట్విట్టర్​లో తమ జీమెయిల్​ను సైన్ ఇన్ చేయగా ఓపెన్ కావట్లేదని ట్వీట్లు చేశారు.
అంతకుముందు 2022 అక్టోబరు 25న ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ సేవలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రంగంలోకి దిగిన వాట్సాప్ మాతృ సంస్థ 'మెటా' సర్వీసులను పునరుద్ధరించింది. మధ్యాహ్నం 12.30 నుంచి వాట్సాప్​ ద్వారా మెసేజ్​లు పంపడం, అందుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాట్సాప్‌ వెబ్‌కు కనెక్ట్‌ చేస్తున్నప్పుడు 'కనెక్టింగ్‌' అని వచ్చిందని, ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదని యూజర్లు వాపోయారు. ట్విట్టర్​లో 'వాట్సాప్​ డౌన్'​ హ్యాష్​ట్యాగ్​ సైతం ట్రెండ్ అయ్యింది. దీనిపై సోషల్​ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్​చల్​ చేశాయి.అప్పట్లో వాట్సాప్ సేవలకు అంతరాయం కలగడంపై వాట్సాప్​ మాతృసంస్థ 'మెటా' అధికార ప్రతినిధి స్పందించారు. 'వాట్సాప్ సేవలు ఆగాయని మా దృష్టికి వచ్చింది. వీలైనంత త్వరగా సేవలకు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాం' అని తెలిపారు. కాసేపటికే సేవలు పునరుద్ధరించినట్లు ప్రకటించారు.
వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ సేవలు 2021 అక్టోబరు 5న 6 గంటలపాటు నిలిచిపోయాయి. ఫలితంగా మెటా సంస్థ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఈ క్రమంలో ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడంపై మార్క్ జుకర్​బర్గ్ క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలిపారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఆన్​లైన్​లోకి వచ్చినట్లు ఫేస్​బుక్ పోస్ట్​లో వెల్లడించారు. అలాగే వాట్సాప్ సైతం తన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం యాప్ సాధారణంగా పనిచేస్తోందని వెల్లడించింది.
అంతర్జాల సమస్యలపై దృష్టి సారించే డౌన్​డిటెక్టర్.. ఫేస్​బుక్ అంతరాయంపై కీలక ప్రకటన చేసింది. ఫేస్​బుక్ సమస్యపై ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా కోటికి పైగా ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్ దేశాల్లో ఎక్కువ ప్రభావం కనిపించిందని చెప్పింది. ఫేస్​బుక్​ సేవల్లో ఏర్పడిన సుదీర్ఘ అంతరాయం ఇదేనని వెల్లడించింది.

By
en-us Political News

  
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.