వివేకా హత్య కేసు.. ఇక విచారణ వాయిదాలకే పరిమితమా?

Publish Date:Feb 27, 2024

Advertisement

ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 27)న సీబీఐ కోర్టులో హాజరయ్యారు. కోర్టు కేసు విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. పెద్దగా ప్రాముఖ్యత లేని వ్యవహారంలా వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ మారిపోయిందనడానికి ఈ కేసు విచారణ జరుగుతున్న తీరే నిదర్శనం. కానీ గత ఏడాది ఫిబ్రవరి నుంచి మే నేలాఖరు వరకూ  మాత్రం ఇహనో ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు అన్న వాతావరణమే ఉండింది. అప్పట్లో రాజకీయ వర్గాలు కూడా అవినాష్ అరెస్టు కాకుండా అడ్డుకోవడం ఇక ఎవరి తరం కాదన్నట్లుగానే భావించాయి.  గత ఏడాది ఫిబ్రవరి 24న  వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరయ్యారు. అప్పట్లోనే కోర్టు హాలు నుంచి బయటకు రాగానే అవినాష్ ను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న వరుస ఘటనలను నిరూపించేందుకు   సాక్ష్యాలున్నాయంటూ ఓ వైపు  ఫోన్ కాల్స్ ఆధారంగా తీగ లాగడంతో.. ఈ హత్య కేసులో డొంకంతా కదిలి..సూత్రదారులు ఎవరో తెలిపోయిందని, అలాగే మరోవైపు తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తేల్చి చెప్పిడం చూస్తుంటే.. ఇక ఈ  హత్య కేసులో వరుస బెట్టి ఆరెస్ట్‌లే తరువాయి అన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది.

వాస్తవానికి వివేకా హత్య కేసులో అవినాష్ ను 2023 జనవరిలోనే అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది.  అయితే ఆయన కాల్ డేటాను పరిశీలించి.. వాటి వివరాల ఆధారంగా కాల్స్ వెళ్లిన వారిని ఓ సారి విచారిస్తే.. ఆ తర్వాత తమ పని మరింత సులువు అవుతుందన్న ఓ ఆలోచనతో అప్పటికి వెనక్కు తగ్గిన సీబీఐ  ఆయన ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణీ వైయస్ భారతి పీఏ నవీన్‌లకు నోటీసులు జారీ చేసి.. వారిని విచారించింది. వారిని విచారించిన అనంతరం అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సీబీఐ  నోటీసులు పంపింది.  దీంతో ఇక అవినాష్ అరెస్టే అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  అప్పట్లో సీఎం జగన్ సైతం తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. అవినాష్ అరెస్టు తరువాత సీబీఐ తట్టేది తాడేపల్లి ప్యాలెస్ తలుపులేనన్న చర్చ కూడా అప్పట్లో జోరుగా సాగింది.  జగన్ హస్తిన పర్యటనతో పరిస్థితి సద్దుమణిగిందన్న వార్తలు కూడా అప్పట్లో హల్ చల్ చేశాయి. 

ఆ తరువాత మళ్లీ గత ఏడాది మేలో కూడా అవినాష్ రెడ్డి అరెస్టునకు సీబీఐ విశ్వ ప్రయత్నం చేసింది. తల్లికి గుండెపోటు కారణంగా సీబీఐ విచారణకు రాలేను అంటూ అవినాష్ విజ్ణప్తిని సీబీఐ తోసిపుచ్చింది. దీంతో హైదరాబాద్ లోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలు దేరిన అవినాష్ రెడ్డి అంతలోనే మనసు మార్చుకుని కడపకు పయనమయ్యారు. దీంతో సీబీఐ ఆయనను సినీ ఫక్కీలో ఛేజ్ చేసింది. మార్గ మధ్యంలో ఆయన రూటు మార్చి తన తల్లిని కర్నూలులోని ఓ అసుపత్రిలో చేర్చారంటూ అక్కడకు వెళ్లారు. ఆ తరువాత గంటల తరబడి డ్రామా కొనసాగింది. అవినాష్ రెడ్డి ఆసుపత్రి లోపల, సీబీఐ అధికారులు ఆసుపత్రి బయట మధ్యలో వందల సంఖ్యలో అవినాష్ అనుచరులు. అప్పట్లో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. అవినాష్ అరెస్టు కు సీబీఐ స్థానిక పోలీసుల సహాయం కోరితే.. వారు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమౌతుందంటూ చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక సీబీఐ వెనుదిరిగింది. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు చూపి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.  అంతే ఆ తరువాత నుంచీ వివేకా హత్య కేసులో పురోగతి ఏమిటి అన్న విషయంపై ఇసుమంతైనా సమాచారం లేదు. 

అవినాష్ ను అరెస్టు చేయడానికి నానా హడావుడీ చేసి చివరకు చేతులెత్తేసిన సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ.   కానీ రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన ఏపీ సీఐడీ మాత్రం జగన్ రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసే విషయంలో నిబంధనలను తుంగలోకి తొక్కేసింది. అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టుకు వెళ్లి మరీ అరెస్టులు చేసింది. గోడలు దూకి వెళ్లి మరీ అరెస్టులు చేసింది. ఇలా ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వారిలో తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, మాజీ మంత్రి నారాయణ, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు చివరాఖరికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు. వీళ్లెవరూ టెర్రరిస్టులు కారు.   రాత్రికి రాత్రి  పరారైపోతారన్న అనుమానాలూ లేవు. అయినా కూడా ఏపీ సీఐడి, పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించి మరీ అరెస్టులు చేశారు. వందల మైళ్లు కార్లలో తిప్పారు.  వైసీపీ రెబల్ ఎంపీపై అయితే ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు.    అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ మాత్రం వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేక చోద్యం చూసిన తీరు ఆ సంస్థ ఇంటిగ్రిటీపైనే అనుమానాలు కలిగేలా చేసింది.  

By
en-us Political News

  
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.