తల్లిదండ్రులు ఈ అలవాటు వదిలిస్తే.. పిల్లల జీవితం ఎంత బాగుంటుందో..!

Publish Date:Feb 16, 2026

Advertisement


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు పడినా, మా పిల్లలు కష్టపడకూడదు అనుకునే తల్లిదండ్రులే ఎక్కువ. అయితే తల్లిదండ్రులు చాలా వరకు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ, తమకు తెలియకుండానే తమ పిల్లల ఆనందాన్ని దెబ్బతీసే తప్పులు చేస్తారు. తల్లిదండ్రులలో అలాంటి అలవాట్లు ఉంటాయి.  వెంటనే ఆ అలవాట్లు వదిలేస్తే తమ పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు.  పిల్లల జీవితం ఎంతో బాగుంటుంది.  తల్లిదండ్రులు వీలైనంత తొందరగా  వదులుకోవాల్సిన ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..

పోల్చడం..

పిల్లలను ఇతరులతో పోల్చడం అనేది ముఖ్యంగా భారతీయ ఇళ్లలో సర్వసాధారణం. పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారు మరింత ఉత్సాహం తెచ్చుకుని చదువుతారు, మంచి పనులు చేస్తారు అనుకుంటే పొరపాటు.  దానికి బదులుగా పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలను ఇతరులతో పోల్చే అలవాటు మానుకోవాలి.

ఇష్టాలు రుద్దడం..

తరచుగా తల్లిదండ్రులు తాము సాధించలేక పోయిన   కలలను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటారు.  మాకు అవకాశం,  ఆర్థిక స్థితి సహకరించలేదు, అందుకే మేము సాధించలేకపోయాము,  కాబట్టి మీరు వీటిని సాధిస్తే సంతోషం అని చెబుతుంటారు.  దీనివల్ల పిల్లలు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోలేకపోతారు,నచ్చిన పని చేయలేకపోతారు. ఇది జీవితాంతం అసంతృప్తికి దారితీస్తుంది.  పిల్లలకు మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం.  అలాగే  వారికి నచ్చిన వృత్తిని ఎంచుకునే అవకాశం ఇవ్వడం వారి తల్లిదండ్రుల బాధ్యత.

జోక్యం..

 పిల్లల జీవితంలోని ప్రతి అంశంలోనూ తల్లిదండ్రులు  జోక్యం చేసుకోవడం సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవడానికి తరచుగా ఆంక్షలు విధిస్తారు, కానీ నిరంతరం ఇలా వ్యవహరించడం వల్ల  పిల్లలు బలహీనపడతారు.తమకు స్వేచ్ఛ లేదని, తమ ఇష్టాలతో తల్లిదండ్రులకు పని లేదని అనుకుంటారు.  తల్లిదండ్రులకు ఎదురు తిరిగే వైపుగా ఈ పరిస్థితి దారితీస్తుంది.

 పర్పెక్ట్ గా ఉండాలని అనుకోవడం..

పిల్లలు చదువులో రాణించాలి, ఆటలు,  ఇతర యాక్టివిటీస్.. ఇలా  ప్రతిదానిలోనూ పర్పెక్ట్ గా  ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.  అలా చేయడం వల్ల బిడ్డ ఒత్తిడికి గురవుతాడు. ఎవరూ పర్పెక్ట్ గా ఉండరు అనే విషయం గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు అన్ని విషయాల్లో పర్పెక్ట్ గా లేనప్పుడు పిల్లలు ఉండాలని అనుకోవడం ఎంత వరకు సమంజసం.  మనుషులు తప్పులు చేయడం,  తప్పులు చేసిన తర్వాత అనుభవాల నుండి నేర్చుకోవడం చేస్తారు.  కాబట్టి పిల్లలు అన్నింటిలో పర్పెక్ట్ గా ఉండాలని కోరుకోవడం తప్పు.

                                     *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.