జపనీస్ పెంపకం.. ఇలా పెంచితే పిల్లలు చదువులో, ప్రవర్తనలో టాప్ లో ఉంటారట..!

Publish Date:Jul 29, 2026

Advertisement

జపనీస్ పెంపకం.. ఇలా పెంచితే పిల్లలు చదువులో, ప్రవర్తనలో టాప్ లో ఉంటారట..!


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో, పిల్లలను సరైన మార్గంలో నడిపించడం ఒక పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చు. అయితే పిల్లలు చురుగ్గా ఉంటూ, చదువులో కూడా రాణిస్తూ,  మంచి ప్రవర్తనతో ఉండటానికి జపనీస్ పెంపకం చాలా బాగా సహాయపడుతుందట. ఇంతకీ ఆ జపనీస్ పెంపకం చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..

జపనీస్ పెంపకం..

జపనీస్ పెంపక విధానం బాధ్యతాయుతమైన, సున్నితమైన , స్వయం సమృద్ధిగల పిల్లలను తయారుచేయడంలో సహాయపడుతుందట.  పిల్లల భవిష్యత్తును బలోపేతం చేయడానికి సహాయపడుతుందట.

జపనీస్ పెంపకం చిట్కాలు..

 బాధ్యతను నేర్పించడం..

జపాన్‌లో పిల్లలు చాలా చిన్న వయస్సు నుండే చిన్న పనులను స్వయంగా చేసుకోవడం నేర్చుకుంటారు. స్కూల్ బ్యాగులు సర్దుకోవడం, గదిని శుభ్రం చేసుకోవడం లేదా చిన్న చిన్న ఇంటి పనులలో సహాయం చేయడం వంటివన్నీ వారి దినచర్యలో భాగం. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, బాధ్యతా ఉండటాన్ని అభివృద్ధి చేస్తుంది.

క్రమశిక్షణ..  

జపనీస్ పెంపకంలో క్రమశిక్షణను కఠినంగా కాకుండా ఒక అలవాటుగా నేర్పిస్తారు. పిల్లలకు సమయానికి విలువ ఇవ్వడం, నియమాలను పాటించడం , ఇతరులను గౌరవించడం నేర్పిస్తారు. పాఠశాలల్లో, పిల్లలు తమ తరగతి గదులను కూడా స్వయంగా శుభ్రం చేసుకుంటారు. ఇది వారిలో సామూహిక బాధ్యతా భావాన్ని పెంపొందిస్తుంది.

ఎమోషనల్ బాండింగ్..  

జపనీస్ తల్లులు తమ పిల్లల బాల్యంలో వారితో గాఢమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంటారు. దీనిని 'అమాయే' అని పిలుస్తారు. దీనిలో పిల్లలు సురక్షితంగా , ప్రేమతో చుట్టుముట్టబడినట్లు భావిస్తారు. ఇది వారి మానసిక వికాసాన్ని మెరుగుపరుస్తుంది , వారు మరింత ఆత్మవిశ్వాసంగా మారడానికి సహాయపడుుతంది.

టీమ్ వర్క్..  

జపనీస్ సంస్కృతిలో పిల్లలకు టీమ్ వర్క్, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ,అందరూ కలిసి ఆలోచన చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి నేర్పిస్తారు. ఇది వారు సమాజంలో మరింత మెరుగ్గా కలిసిపోవడానికి సహాయపడుతుంది.

స్క్రీన్ సమయం..  

జపనీస్ తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్లు , టెలివిజన్‌కు దూరంగా ఉంచి, సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. చదవడం, ఆరుబయట ఆడుకోవడం , కళలలో నిమగ్నమవడం వారి దినచర్యలో భాగం. ఇది వారి సంపూర్ణ అభివృద్ధికి దోహదపడుతుంది.

తప్పుల నుండి నేర్చుకోవడం..  

ప్రతి చిన్న తప్పుకు పిల్లలను తిట్టే బదులు, వారికి సలహా ఇచ్చి, వారి తప్పుల నుండి నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందిస్తుంది.

వ్యక్తిత్వ నిర్మాణానికే ప్రాధాన్యత..

అక్కడ కేవలం మార్కుల మీదనే కాకుండా, నిజాయితీ, వినయం, సానుభూతి వంటి గుణాలపై దృష్టి పెడతారు. అందుకే అక్కడ చదువు కన్నా, వ్యక్తిత్వ నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

 

                                  *రూపశ్రీ.

 

By
en-us Political News

  
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.