వైసీపీలో ‘మతం’ చిచ్చు.. జగన్ తీరుపై గర్జిస్తున్న నేతలు
Publish Date:Sep 14, 2021
Advertisement
వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం క్రైస్తవ కుటుంబం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు దాపరికమూ లేదు. వైఎస్ ఉన్నంత వరకు ఆయన మత విశ్వాసాలు ఆయన రాజకీయాలను అంతగా ప్రభావితం చేయలేదు.ఆయనకు ప్రతిబంధకమూ కాలేదు. నిజానికి, ఒక్క వైఎస్సే కాదు, మతం మారిన రాజకీయ నాయకులు ఎవరూ కూడా, తమ మూలాలను పూర్తిగా తుడిచేసుకో లేదు. మెజారిటీ మతస్తుల మనోభావలాను ఉద్దేసపూర్వకంగా కించపరిచే ప్రయత్నం చేయలేదు. వైఎస్స్ సహా ఒకరిద్దరు ఒకటిరెండు సందర్భాలలో ఒకటి రెండు తప్పటడుగులు వేసినా అంతలోనే సర్దుకున్నారే కానీ, గీత దాటలేదు. వైఎస్ మీద ఆరోపణలు అసలే లేవని కాదు ఉన్నాయి. తిరుమల దేవుని ఏడుకొండలను రెండు కొండలకు కుదించే కుట్రచేశారనే ఆరోపణ, రంగారెడ్డి జిల్ల్లాలో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ నిధులు కేటాయించారనే మరో ఆరోపణ ఇలా ఇంకొన్ని ఆరోపణలు ఆయనపై వచ్చినా ఆ ఆరోపణలు అంతలా దుమారం లేపలేదు. వైఎస్ ను ఆయన ప్రత్యర్ధులు కూడా ఆ కోణంలో విమర్శించ లేదు.క్రైస్తవ ముఖ్యమంత్రి అన్న ముద్ర వేయలేదు. కానీ, జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కొద్ది కాలానికే ఆయన క్రైస్తవ ముఖ్యమంత్రి అన్న ముద్ర పడిపోయింది. సోషల్ మీడియాలో ఆయన పేరే ఏసు రెడ్డిగా మారిపోయింది. ఆయన పాలనలో సాగుతున్న హిందూ వ్యతిరేక ధోరణికి విసిగిపోయిన జనం, జగన్ రెడ్డిని, ఏసు రెడ్డి అనేంతవరకు వెళ్ళారంటే, పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చును. ఎన్నికలలో జగన్ గెలుపు ఏసు ప్రభువు విజయంగా ప్రచారం జరిగింది. అది మొదలు, అనేక విధాలుగా జగన్ రెడ్డి ప్రభుత్వం క్రైస్తవ మత ప్రచారాన్ని, ప్రోత్సహిస్తూ ,మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ వచ్చిందని, విపక్షాలే కాదు, సామాన్య జనం కూడా ఆరోపిస్తున్నారు. ఆవేదన, ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో క్రైస్తవ మత ప్రచారం ముందెన్నడూ లేని విధంగా సాగుతోంది. గ్రామాలకు గ్రామాలే, క్రైస్తవ గ్రామాలు (వంద శాతం క్రైస్తవులు నివసించే గ్రామాలు)గా మారిపోతున్నాయి. ప్రభుత్వమే టెండర్లు పిలిచి మరీ ప్రజల సొమ్ముతో చర్చిలునిర్మిస్తోంది. పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా జీతాలు చెల్లిస్తోంది. మతం మారిన వారికి రాజ్యంగ విరుద్ధంగా రిజర్వేషనలు కల్పిస్తోంది. సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఒకే సారి ఇటు ఎస్సీలుగా, అటు క్రైస్తవులుగా చెలామణి అవుతూ, ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ విషయంలో సామాన్య ప్రజలే కాదు మంత్రులు కూడా వివాదంలో చిక్కుకుని విచారణ ఎదుర్కుంటున్నారు. మరో వంక హిందూ దేవాలయలపై దాడులు, రధాల ద్వంస రచన సాగుతోంది. ఇవన్నీ పిచ్చోళ్ళ పనని ప్రభుత్వం హిందువుల మనోభావాలను కించే పరిచే విధంగా లైట్’గా తీసుకుంటోంది. అంతే కాదు, ఎదేమితని ప్రశ్నిస్తే మంత్రులు బూతుల దంకం ఎత్తుకుంటున్నారు. ఇంచు మించుగా 150 వరకు దేవాలయాలపై దాడులు జరిగితే ఇనతవరకు ఒక్కరిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అన్న ముద్ర పడింది. అలాగే తిరుమల వెంకన్న దేవుని ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయం సహా రాష్ట్రంలోని అనేక ప్రముఖ దేవాలయాలలో అన్యమత ఉద్యోగుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో దేవుడు మంత్రి ఉన్నారు కానీ, అయన ఏ దేవుడు మంత్రో మాత్రం తెలియదు. ఇలా, హిందూ దేవుళ్ళు, హిదువుల మాట విశ్వాసాలపై ముప్పేట దాడి జరగటానికి, క్రైస్తవ సమాజంలో ప్రభుత్వం మాది, ముఖ్యమంత్రి మావాడు, చట్టాలు మమ్మల్ని ఏమీ చేయలేదు అన్న ధోరణి, భరోసానే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇంతవరకు ఇంత జరుగుతున్నా, వైసీపెలో ఏ ఒక్కరు కూడా ఇదేమిటి? అని ప్రశ్నించిన పాపాన పోలేదు. చివరకు మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు కూడా తమ మనోభావాలను వ్యక్తంచేసే సాహసం చేయలేదు. పదవులు నిలుపుకోవడం కోసంగా, మౌనంగా ఉండిపోయారు. అంతే కాదు, ముఖ్యమంత్రి మెప్పుకోసం, అన్యమతస్తులు సాగిస్తున్న మత ప్రచారాన్ని సమర్ధించారు. చివరకు దేవుడు మంత్రిసహా పలువురు మంత్రులు హిందువుల మనో భావాలను చులకన చేసి మాట్లాడారు.మాట్లాడుతున్నారు. అయితే ఇంత కాలానికి వైసీపీలో ఒక హిందూ గళం వినిపించింది.వైసీపే ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తోందని గళం విప్పి గర్జించారు, గుంటూరు జిల్లా వైసీపీ కార్యదర్శి, బందా శశిధర్. నిజమే ఆయన మహా నేత కాదు, మంత్రి, ఎమ్మెల్యే కాదు, జిల్లా స్థాయి నాయకుడే, అయినా, ఎవరికి వారు లోలోన కుమిలి పోతూ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరని ఎదురు చూస్తున్న, వైసీపీలోని హిందువులకు, నేనున్నాను, అంటూ ముందు కొచ్చి గర్జించారు బందా శశిధర్. వినాయక విగ్రహాల ఏర్పాటుపై, జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయన తప్పు పట్టారు.అది కూడా మాములుగా కాదు, జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలతో లోలోన రగిలిపోతున్న హిందువుల మనోవేదనను తన గొంతుతో గర్జించి వినిపించారు. హిందుత్వాన్ని నాశనం చేసేందుకు, వైసీపీ అధినేత జగన్ కంకణం కట్టుకున్నాడని శివమెత్తారు, శశిధర్. ఇలాంటి పార్టీలో ఉండలేనని, ఆ పాపంలో పలు పంచుకోలేనని, పార్టీ పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒక జిల్లా కార్యదర్శి రాజీనామా చేయడం పెద్ద విషయం, విశేషం కాకపోవచ్చును, కానీ, ఆది ఆయన ఒక్కరి ఆవేదన, ఆగ్రహం కాదు. అనేక మంది, చివరకు జగన్ రెడ్డి కుటుంబానికే చెందిన బాప్టిజం పుచ్చుకోని బంధువులు కూడా జగన్ రెడ్డి మత వివక్షను తప్పు పడుతున్నారని అంటారు. జగన్ రెడ్డికి పార్టీలో . ప్రభుత్వంలో ఇతరత్ర కూడా వ్యతిరేక గళం వినవస్తోంది. వివద రూపాల్లో ప్రమాద ఘంటికలు వినవస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం లీకైన విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కన్నబాబు ఫోన్ సంభాషణ వీడియో, ఆ వీడియోలో ఆయన జగన్ రెడ్డి విధానలను ఎండగట్టిన తీరు, అంతకు ఇంకొన్ని రోజుల ముందు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గ్రామ వాలెంటీర్ల వ్యవస్థపై చేసిన విమర్శలు, చివరకు శ్రీకాకుళం జిల్లాకు చెంది వాలెంటీర్ ఒకరు, ప్రజలను సోమరలును చేయవద్దంటూ అంటించిన చురక, ఇవన్నీ కూడా పార్టీలో, ప్రభుత్వంలో రగులుతున్న అసంతృప్తికి. నిదర్శనం. అగ్ని పర్వతం భగ్గుమనేందుకు సిద్దంగా ఉందనేందుకు సంకేతమనీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/guntur-ycp-leader-fire-on-jagan-over-anti-hindu-policy-39-122937.html





